శ్రీ మదగ్ని మహాపురాణము - 242 / Agni Maha Purana - 242


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 242 / Agni Maha Purana - 242 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 73

🌻. సూర్య పూజా విధి వర్ణనము - 1 🌻


పరమేశ్వరుడు పలికెను. స్కందా! ఇపుడు అంగన్యాస కరన్యాసములతో సూర్య పూజావిధానమును చెప్పెదను. తేజోమయసూర్యుడను నేనే'' అని భావన చేసి అర్ఘ్యపూజనము చేయవలెను. ఎఱ్ఱటి చందనము కలిపిన జలమును లలాట సమీపమునకు తీసికొని వెళ్ళి దానితో అర్ఘ్యపాత్రమును నింపవలెను. దానిని గంధాదులతో పూజించి సూర్యాంగములచే రక్షావగుంఠనము చేయవలెను. పిమ్మట జలముతో పూజాసామగ్రిని ప్రోక్షించి, పూర్వాభిముఖుడై సూర్యుని పూజ చేయవలెను. ''ఓం ఆం హృదయాయ నమః'' ఇత్యాది విధమున స్వరబీజము మొదట చేర్చి శిరస్సు మొదలగు అన్ని అవయవముల న్యాసము చేయవలెను. పూజాగృహద్వారమునందు కుడి వైపున దండిని, ఎడమ వైపున పింగళుని పూజింపవలెను. ''గం గణపతయే నమః'' అను మంత్రముతో ఈశాన్యమున గణశుని పూజింపవలెను. ఆగ్నేయమున గురుపూజ చేయవలెను. పీఠమధ్యమునందు కమాలాకారాసనము భావన చేసి పూజించవలెను. పీఠముయొక్క ఆగ్నేయాది కోణములలో క్రమముగ విమల - సార - ఆరాధ్య - పరమసుఖములను, మధ్యభాగమున ప్రభూతాసనమును పూజింపవలెను. విమలాదుల నాల్గింటి రంగులు వరుసగ శ్వేత - రక్త - పీత - నీలములు ఉండును. వాటి ఆకారము సింహముతో సమానముగ నుండును. వీటి నన్నింటిని పూజించవలెను.

పీఠముపై నున్న కమలములోపల ''రాం దీప్తాయై నమః'' అను మంత్రముచే దీప్తాశక్తిని, ''రీం సూక్ష్మాయై నమః'' అను మంత్రముతో సూక్ష్మాశక్తిని, ''రూం జయాయై నమః'' అను మంత్రముచే జయాశక్తిని, ''రేం భద్రాయై నమః'' అను మంత్రముచే భద్రాశక్తిని, ''రైం విభూతయే నమః'' అను మంత్రముచే విభూతి శక్తిని, ''రోం విమలాయై నమః'' అను మంత్రముచే విమలాశక్తిని, ''రౌం అమోఘాయై నమః'' అను మంత్రముచే అమోఘా శక్తిని, ''రం విద్యుతాయై నమః'' అను మంత్రముచే విద్యుతాశక్తిని పూర్వాది దిక్కులు ఎనిమిదింటి యందును పూజించి, ''రః సర్వతోముఖ్యై నమః'' అను మంత్రముచే మధ్యభాగమునందు, తొమ్మిదవ పీఠశక్తియైన సర్వతోముఖిని పూజించ వలెను. పిమ్మట ''ఓం బ్రహ్మవిష్ణుశివాత్మకాయ సౌరాయ యోగపీఠాత్మనే నమః'' అను మంత్రముచే సూర్యదేవుని పీఠమును పూజించవలెను. పిమ్మట ''ఖఖోల్కాయ నమః'' అను షడక్షర మంత్రమునకు ప్రారంభము 'ఓం హం ఖం' అను అక్షరములు చేర్చి తొమ్మిది అక్షరములు గల ''ఓం హం ఖం ఖఖోల్కాయ నమః'' అను మంత్రము ద్వారా సూర్య విగ్రహావామనము చేసి సూర్యుని పూజ చేయవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 242 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 73

🌻 Mode of worshipping the Sun - 1 🌻



The Lord said:

1. O Skanda! I shall describe the (mode of) worship of Sun [i.e., sūrya-pūjā or arcana] preceded by the assignment (of letters) on the body. After having contemplated as “I am the Sun [sūrya]”, one should worship by offering waters (arghya).

2-4. It (should be conceived) as filled with red colour with the drop (of water) drawn to the forehead. After having worshipped it and after making the protective covering with the limbs of the sun-god, that water should be sprinkled on the materials of worship and the sun-god should be worshipped (remaining) facing the east. (One should recite) the syllables oṃ aṃ (hṛdayāya etc. and worship Daṇḍi and Piṅgala (attendants of the sun) respectively at the right and left sides of the entrance. (Salutations should be made to the gaṇa saying) aṃ gaṇāya on the northeast. The preceptor (should be worshipped) in the south-east and the lofty seat (of the deity) should be worshipped in the middle of the altar.

5. One should worship vimala, sāra, parama and sukha, (the rays of the sun), which are to be worshipped in the directions south-east (and should be conceived as) strong as the lion and of the colours of white, red, yellow and blue.

6-8. One should worship (the essences of the energies of the lord) rā-diptā (radiant), ra-jayā (victorious), ru-bhadrā (auspicious), re-vibhūti (prosperity), rai-vimalā (pure), rai-amoghā (profound), rau-vidyut (lightning), in the (quarters) east etc. inside the lotus (shaped diagram). The seat of the sun would be at the centre (established by the syllable) raṃ. One should invoke the sun and worship his form with the six-syllabled (mantra) oṃ haṃ khakholkāya. One should assign the sun-god after having meditated upon the altar with the folded hands lifted to the forehead.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment