🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 156 / DAILY WISDOM - 156 🌹
🍀 📖 జ్ఞానం యొక్క కాంతి పుస్తకం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 4. అనేక భాగాలు కలిపినా మానవుణ్ణి చేయలేము. 🌻
మానవుడు కేవలం శిరస్సు, అవయవాలు కాదు, అన్ని అవయవాలు కలిసిన మొత్తం కూడా కాదు. మనం కేవలం భౌతిక భాగాలు మాత్రమే కాదు; మనం ఈ కలయికల కంటే కూడా చాలా ఎక్కువ. మానవుడు తన భాగాల యొక్క ఒక మొత్తం కాదు, ప్రాణమున్న జీవి. అలాగే, మనం వేసే చివరి అడుగు మాత్రమే యోగం కాదు, మనం వేసే ప్రతి అడుగు కూడా యోగంలో భాగమే. యోగం తనలో ఉన్న దశల యొక్క ఒక మొత్తం కాదు. కానీ వాటి కలయిక వల్ల వచ్చే ఒక ప్రాణ శక్తి. అనేక భాగాలు కలిసి మనిషిని తయారు చేయవు. యోగం యొక్క అనేక దశలు కలిసి యోగం అవవు. కానీ, అవి ప్రారంభంలో చాలా అవసరం.
అందుకే, “దీని అవసరం ఎక్కడ ఉంది?” అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. అవసరం, ప్రయోజనం మరియు లక్ష్యం ప్రతి చర్య వెనుక ఉండే ప్రోత్సాహకాలు. ఒక చర్యను ప్రేరేపించాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. కానీ, జీవితంలో మనకు ఎదురయ్యే అనేక అనుభవాలలో, మనకు ఏదో లోటు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ లోపం కారణంగా, జీవితంలో తరచుగా అసంతృప్తి ఉంటుంది. మనం రోజూ తినే భోజనంతో సంతృప్తి చెందము; కేవలం ఆహారంతో మనల్ని మనం పోషించుకోడం కంటే మరేదో ఉందని మనము భావిస్తాము.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 156 🌹
🍀 📖 In the Light of Wisdom 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 4. Many Parts Put Together do not Make a Human Being 🌻
A human being is not merely the head, nor the limbs, nor even the totality of all the limbs. We are not merely a total of the physical parts; we are something more than these combinations. A human being is not merely a mathematical total, but a vital total. Likewise, not merely the last step that we take, but every step that we take is included in yoga. It is not the mathematical total of these steps that constitutes yoga, but something vital that is present in the combination of the parts. Many parts put together do not make a human being. The many stages of yoga put together do not make yoga, though they are all essential in the beginning.
Therefore, I will try to answer the question “Where is the need for it?” The need, the purpose and the goal are the incentives behind every action. There needs to be a necessity to motivate an action. Yet in many experiences that we have in life, we feel that we are lacking something. Due to this lack, there is often a dissatisfaction in life. We are not satisfied with the daily eating of our meals; we feel that there is something more than merely sustaining ourselves with food.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment