నారద భక్తి సూత్రాలు - 87

🌹.  నారద భక్తి సూత్రాలు - 87  🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్ధాధ్యాయం - సూత్రము - 57

🌻 57. ఉత్తరన్మా దుత్తజన్మాత్‌ పూర్వ పూర్వా శ్రేయాయ భవతి ॥ 🌻

భక్తి సాధనలో తామసిక భక్తి ఫలితంగా రాజసిక భక్తి కుదురుతుంది. రాజసిక భక్తి ఫలితంగా నాత్విక భక్తుదవుతాడు. ఆ సాత్విక భక్తుడు మొదట ఆర్హుడై ఆర్త భక్తి ఫలితంగా అర్ధార్ధి అవుతాడు. దాని ఫలితంగా జిజ్ఞాసువవుతాడు. అక్కడ సత్వ గుణం కూడా విడచి భగవల్రైేమను సర్వత్రా కనుగొని తుదకు ఏ గుణం లేని భక్తుదవుతాడు.

అందువలన తామసిక భక్తి నుండి క్రమంగా రాజసిక భక్తుడై, సాత్విక భక్తుడై, ఆ సాత్విక భక్తిలో ఆర్తి, అర్భార్థి, జిజ్ఞాస అనెడి స్వభావపూరితమైన భక్తి నుండి అధిరోహించి, ముఖ్య భక్తుదవుతాడు. గౌణభక్తి నుండి విడుదలవుతాడు.

కనుక పై చెప్పినవన్నీ ఒకదాని కంటె మరొకటి ఆరోహణా క్రమంలో శ్రేష్టం. ఇవన్నీ ముఖ్యభక్తుడవడానికి సాధనా క్రమంలో సోపానాలు.

ఆర్తిలో ఉన్న క్లేశం ఎట్టిదనగా సాధకునకు, భగవంతునికి మధ్య వియోగం ఉన్నందుకు క్లేశం జనిస్తుంది. ఆ క్లేశం భక్తికి ప్రధాన లక్షణం. వియోగం ఏర్పడకుండా ఉండటం కోసం గౌణభక్తిలోనె సాత్వికానికి పురోగమిస్తాడు. అలాగే మనసును భగవంతుని మీద సర్వదా ఏకాగ్రంగా ఉంచుతాడు.

సాత్విక భక్తి కుదిరాక, ఆ భక్తి అవిచ్చిన్నంగా కొనసాగుతుంది. అంతకుముందు తామసిక, రాజసిక భక్తి సాధనలలో విరామాలు, ఆటంకాలు, తిరోగమనాలు, పునసాధనలు ఉండేవి. సాత్విక భక్తుడు అంత కంటే శ్రేష్టమైన భక్తికి పురోగమించాలి. అందుకోసం శ్రద్ధగా సాధన చేయాలి. విరోధాలను నివారిస్తూ ఉపాయాలను అనుసరిస్తూ పెద్దల సలహాలను పాటిస్తూ సాధనను నిష్కామంగా, మోక్ష లక్ష్యంగా చెయాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

06.Sep.2020

No comments:

Post a Comment