శివగీత - 54 / ƬΉΣ ƧIVΛ-GIƬΛ - 54




🌹. శివగీత - 54 / The Siva-Gita - 54 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

ఏడవ అధ్యాయము

🌻. విశ్వరూప సందర్శన యోగము - 8 🌻

మీలితాక్ష: పునర్హార్షా - ద్యావ ద్రామః ప్రపశ్యతీ,
తాపదేవ గిరే స్సృంగే - వ్యాఘ్రచర్మో పరిస్థితమ్ 41

దదర్శ పంచవదనం - నీలకంటం త్రిలోచనమ్
వ్యాఘ్రాచర్మాం బరధరం - భూతి భూషిత విగ్రహమ్

ఫణి కంకణ భూషాడ్యం - నాగ యజ్ఞోప వీతినమ్
వ్యాఘ్ర చర్మొత్తరీయం చ - విద్యుత్పింగ జాటాధరమ్ 43

ఏకాకినం చంద్రమౌళిం - వరే ణ్య మభయ ప్రదమ్,
చతుర్భుజం ఖండ పరుశుం - మృగహస్తం జగత్పతిమ్ 44

అథాజ్ఞ యా పురస్తస్య - ప్రణమ్యో పవివేశ సః
అథా హ రామం దేవేశో - యద్య త్ర్ప్రష్టు మభీచ్చసి 45

తత్సర్యం పృచ్చ రామత్వం - మత్తో నాన్యోస్తి తే గురు:
ఇతి శ్రీపద్మ పురాణే శివగీతాయాం సప్తమో ధ్యాయః

ఆ పిదప శ్రీరామచంద్రుడు సంతసించినవాడై ఎంత సమయంలో తన కనులు మూసి తెరుచునంతలో తన ముందట పర్వతశిఖరముపై వ్యాఘ్రాసనమున ఉపస్థితుడైయున్న త్రినేత్రుని, పంచముఖుని, నీలకంటుని వ్యాఘ్ర చర్మాంబరధరుని, పైనిండ విభూతిని దాల్చినట్టి జటాధారిని, చంద్రశేఖరుని,

అభయహస్తుని ముఖ్యుని చతుర్భుజుని ఖండ పరశు, మృగముల బట్టిన వాని లోకైక నాయకుని సర్పవేష్టితుని మహాదేవుని గాంచెను.

తదుపరి శ్రీరాముడు సమస్కరించి శివుని యానతి వలన ఆతని ముందట కూర్చుండెను.

ఓయీ ! శ్రీరామా! నీవే విషయములను ప్రశ్నించెదవో ప్రశ్నించుము, నీకు బోధించే విషయమై నా కంటెను మరొక గురువు లేడు అని ఈశ్వరుడు ఆనతి నిచ్చెను.

ఇతి వ్యాపోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గతం బైన శివ గీతలో ఏడవ అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹  The Siva-Gita - 54  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj


Chapter 07 :
🌻 Vishwaroopa Sandarshana Yoga - 8 🌻

After that Sri Ramachandra became extremely satisfied and within the split second of his eyes closing and opening the eyes, he beheld in front of him sitting in Vyaghrasana (tiger kind of yogic sitting posture) on the hill, the three eyed, five faced blue necked lord Shiva who wore tiger skin as garments, who had ash smeared on all over his body who had matted hair, who had a crescent moon, whose one hand was in blessing posture, who had many hands which held axe, deer etc., who is the one leader of the entire world.

Such a Mahadeva was seen by rama once again. Then Rama saluted him once again and with permission from Shiva he sat in front of him.

Sri Bhagawan said:
O SriRama! Whatever other topics you have queries and want to get clarified from me, you may enquire. There is no better Guru than me to clarify your doubts O Rama!

here ends the seventh chapter Shiva Gita of Padma Purana Uttara Khanda..

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

06.Sep.2020

No comments:

Post a Comment