భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 137

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 137 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నారద మహర్షి - 11 🌻*

82. మరి కాలపరిణామం! కాలం అనేది పరిణమించాలి కదా! ఇప్పుడు ఇలా ఉంది. ఇది సాయంకాల సమయం. రేపు ఉదయం కావాలి. మధ్యలో రాత్రి ఉంది. “ఇద్ దేనివలన జరుగుతుందంటావు? కాలం ఎలా జరుగుతూ ఉంటుంది? కాలచక్రాన్ని నడిపించేదెవరు?” అని అడిగాడు నారదుడు. 

83. ‘స్వభావము అనేది ఒకటుంది జీవుల్లో, స్వభావం అంటే, జీవుడియొక్క కర్మలు, పూర్వం అనేకజన్మలలో అతడు చేసిన కర్మలలో సారాంశమైనటువంటి సుఖము, దుఃఖము, సుఖాపేక్ష, దుఃఖమంటే భయము ఈ లక్షణముల స్వభావాన్ని నావగా చేసుకుని, కాలమనేటటువంటి సముద్రంలో అతడు వెళుతుంటాడు. 

84. స్వభావం నశిస్తే అతడికి కాల స్థితి ఉండదు” అని చెప్పాడు బ్రహ్మ. స్వభావం అంటే, పురాకృతమైన కర్మ అనేకానేక సంస్కారాల రూపంలో అతడియందు నిక్షేపించబడిన, సూక్ష్మరూపంలో ఉండేటతువంటి ఒక ప్రవృత్తి. ఆ ప్రవృత్తి అతడియందు ఎంతకాలముంటుందో, కాలమనే సముద్రంలో అతడు అంతకాలం ఈదుతూనే ఉంటాడు. 

85. కాబట్టి కాలంలో ఇతడు పరణమించటం అనేది జరుగుతూనే ఉంటుంది. రాత్రి రావటం అంటే, ఆయుర్దాయంలో ఇంకొక రాత్రి గడిచిపోవటం. రేపు ఉదయం అంటే ఇంకొక రోజు గడిచిపోవటము. ఇది పరిణామమే! మృత్యువుకు ఇంకొంచెం దగ్గరగా వెళ్ళటం. నిన్న ఉన్న సంస్కారాలు ఈ రోజు పరిణామదశ కొస్తున్నాయి. 

86. ఈ రోజు మనలో ఉండే సంస్కారాలు రేపటికి వస్తాయి. నిన్న చాలా తీవ్రమయిన కోరిక ఉంది. ఇక అది ఎన్నడూ తీరదు అని తెలిసి ఇవాళ నైరాశ్యం కలిగింది. ఈ నైరాశ్యం రేపేమో తగ్గి ఆ ఉద్రేకం తగ్గి, చిత్తంలో కొంత శాంతి కలుగుతుంది. స్వభావము యొక్క క్షణక్షణ పరిణామదశ అని దీనికి పేరు. దీనికి కాలమని పేరు. 

87. కాలమందు జీవుడుంటాడు. కాబట్టి ‘కాలపరిణామహేతువు స్వభావము’ అన్నాడు బ్రహ్మ. అది ఒక్కటేమాటలో చెప్పాడు. ఈ స్వభావం ఆధారంచేసుకుని కాలాన్ని పరిణామదశలో అనుభవిస్తున్న వాడెవరు అంటే, ఈ జీవాత్మ! కాలానికి భోక్త ఇతడు. కాలము ఇతడి కర్మలను భుజిస్తుంది. ఆ కాలాన్ని భుజిస్తాడు ఇతడు.

88. కాలంలో కర్మ క్షయింస్తుందని చెప్పాడు. “అయితే ఇన్ని ఉంటాయను కుంటావేమో పొరపాటున! ఈ కాలము, జీవులు, వాళ్ళ పూర్వకర్మలు, సంస్కారాలు, వాళ్ళల్లో ఉండే స్వభావము, జన్మ మృత్యువులు, పంచభూతములు ఇవన్నీ ఒక్కటే వస్తువు సుమా! దానినే ‘శ్రీహరి’ అంటాము. 

89. ఒక్క పరమాతమ వస్తువు ఇన్ని రూపాలుగా ఉన్నది. ఆ వస్తువే వాసుదేవుడు. అతడికి మాయ అనే ఒక లక్షణముంది. ఆ లక్షణం ఆధారంగా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి పదునాలుగు భువనములుగా విభాగం చేసాడు. ఆయన కటిప్రదేశంనుంచీ పైభాగమంతా ఊర్ధ్వలోకాలైన సప్తలోకాలు. కటిప్రదేశంనుంచీ పాదాలదాకా ఉన్నవి క్రింది సప్తలోకాలు. అతడు బ్రహ్మాండానికి బయట, లోపలా ఉంటాడు. 

90. ప్రతి బ్రహ్మాండంలోనూ, దానియొక్క కారణములోనూ, దాని నాశనమందు, దాని ఉత్పత్తియందు కూడా అతడుంటాడు. ఈ విధంగా గ్రహించి, నేను అతడియొక్క నాభికమలంలోంచి పుట్టి అతడిని గురించి యజ్ఞం చేసాను. ఏం యజ్ఞం చేసాను అంటే, మానవ యజ్ఞం చేసాను. తపస్సుతో యజ్ఞంచేసాను” అని చెప్పాడు బ్రహ్మ.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment