*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 7 / Sri Devi Mahatyam - Durga Saptasati - 7 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
*మహాలక్ష్మీ ధ్యానమ్*
తన (పద్దెనిమిది) చేతులలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం, కమలం, ధనస్సు, కలశం, దండం, శక్తి, ఖడ్గం, డాలు, శంఖం, ఘంట, మద్యపాత్ర, శూలం, పాశం, సుదర్శనచక్రం ధరించి; ప్రవాళమణి (పగడపు) వర్ణం కలిగి, మహిషాసురుణ్ణి సంహరించిన దేవి; తామరపూవుపై కూర్చొని ఉండే తల్లి అయిన మహాలక్ష్మిని సేవిస్తున్నాను.
*అధ్యాయము 2*
*🌻. మహిషాసుర సైన్యవధ - 1 🌻*
ఋషి పలికెను :
పూర్వం అసురులకు మహిషాసురుడు, దేవతలకు ఇంద్రుడు అధిపతులుగా ఉన్నప్పుడు దేవాసురులకు పూర్ణంగా నూడేళ్ళు ఒక యుద్ధం జరిగింది. అందు దేవసైన్యం మహావీర్య సంపన్నమైన అసురసైన్యం చేతిలో ఓడిపోయింది.
దేవతలందరినీ జయించిన పిదప మహిషాసురుడు ఇంద్రపదవిని అధిష్ఠించాడు. (1-3)
అంతట ఓటమిపొందిన దేవతలు ప్రజాపతియైన బ్రహ్మ వెంట శివుడు, విష్ణువు ఉన్న చోటికి వెళ్ళారు. మహిషాసురుడు తమని ఓడించిన విధాన్ని జరిగినది జరిగినట్టే సవిస్తరంగా దేవతలు వారికి తెలియపఱచారు. (4-5)
"సూర్యచంద్రుల, ఇంద్రాగ్ని వాయు యమ వరుణుల, ఇతర దేవతల అధికారాలనన్నిటిని అతడు (మహిషుడు) స్వయంగానే అధించాడు. దురాత్ముడైన మహిషునిచే స్వర్గం నుండి నిరాకరింపబడి దేవగణములందరూ భూమిపై మనుష్యులవలె సంచరిస్తున్నారు. అమరవైరి యొక్క దుశ్చేష్టిత మంతా మీ ఇరువురికీ తెలుపబడింది. మిమ్మల్ని శరణమర్థిస్తున్నాము. మీరు ఇరువురూ వాణ్ణి వధించే మార్గాన్ని చిత్రించి మాకు దయ చూపుతారుగాక”
ఇలా దేవతల పలుకులను విని విష్ణువు, శివుడు కోపము నొందిరి. వారి ముఖాలు బొమముడిపాటుతో భయంకరములయ్యాయి. అంతట కోపపూర్ణుడైన విష్ణువు వదనం నుండి ఒక గొప్ప తేజస్సు వెలువడింది. బ్రహ్మ, శివుడు ముఖాల నుండి కూడా అలాగే వెలువడింది. (6-10)
ఇంద్రాది ఇతర దేవతల శరీరాల నుండి కూడా ఒక మహాతేజం వెలువడింది. ఈ తేజస్సు (అంతా) ఏకమయ్యింది. అక్కడ మహోజ్వలంగా వెలుగుతున్న పర్వతం వలె, సర్వదిశా వ్యాప్తమైన జ్వాలలు గల ఒక తేజోరాశిని దేవతలు చూసారు. అంతట సర్వదేవ శరీరాల నుండి ఉత్పన్నమైన అసమానమైన ఆ తేజస్సు, ల్లోకాలను వ్యాపించిన వెలుగుతో, ఒకటిగా కూడి స్త్రీరూపాన్ని ధరించింది. (11-13)
శివుని తేజస్సు ఆమె ముఖంగా రూపొందింది. యమునిది ఆమె వెంట్రుకలుగా, విష్ణుతేజస్సు ఆమె బాహువులుగా, చంద్రునిది ఆమె కుచద్వయంగా, ఇంద్రునిది ఆమె నడుముగా, వరుణునిది ఆమె పిక్కలు తొడలుగా, భూమితేజస్సు ఆమె పిరుదులుగా రూపొందాయి.
(14-15)
బ్రహ్మతేజస్సు ఆమె పాదములుగా, సూర్యతేజస్సు ఆమె కాలివ్రేళ్ళుగా, వసువుల (తేజస్సు) ఆమె చేతి వ్రేళ్లుగా, కుబేర (తేజస్సు) ఆమె ముక్కుగా, ప్రజాపతి తేజస్సు ఆమె దంతాలుగా, అగ్ని (తేజస్సు) ఆమె మూడుకన్నులుగా, రెండు సంధ్యల తేజస్సు ఆమె కనుబొమలుగా, వాయు (తేజస్సు) ఆమె చెవులుగా రూపొందాయి. (16-18)
ఇతర దేవతల నుండి వెలుడలిన తేజస్సులు కూడా శుభమూర్తి అయిన (ఆ దేవి రూపొందుటకు) తోడ్పడ్డాయి. సర్వదేవతా తేజోరాశి నుండి సముద్భవించిన ఆమెను చూసి మహిషాసుర పీడితులైన దేవతలు సంతసించారు. (19)
పినాకపాణి (శివుడు) తన శూలం నుండి ఒక శూలాన్ని, విష్ణువు తన చక్రము నుండి ఒక చక్రాన్ని తీసి ఆమెకు ఇచ్చారు. (20)
వరుణుడొక శంఖాన్ని, అగ్ని దేవుడు ఒక బల్లాన్ని ఆమెకు ఇచ్చారు. వాయుదేవుడొక వింటిని బాణాలతో నిండిన రెండు అమ్ములపొదులను ఇచ్చాడు. వేల్పుటేడు, సహస్రాక్షుడు అయిన ఇంద్రుడు తన వజ్రాయుధము నుండి ఒక వజ్రాయుధాన్ని, తన ఐరావతగజం ఘంట నుండి ఒక ఘంటను తీసి ఆమెను ఇచ్చాడు.
యముడు తన కాలదండం నుండి ఒక దండాన్ని, వరుణుడొక పాశాన్ని ఇచ్చారు. ప్రజాపతియైన బ్రహ్మ ఒక అక్షమాలను, ఒక కమండలువును ఇచ్చాడు.
సూర్యుడు ఆమె సమస్త రోమకూపములలో తన కిరణాలను ఇచ్చాడు. కాలుడు (యముడు) ఖడ్గాన్ని, నిర్మలమైన డాలును ఆమెకు ఇచ్చాడు. (21-24)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 7 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
*Meditation of Mahalakshmi*
I resort to Mahalakshmi, the destroyer of Mahishasura, who is seated on the lotus, is of the complexion of coral and who holds in her (eighteen ) hands rosary, axe, mace, arrow, thunderbolt, lotus, bow, pitcher, rod, sakti, sword, shield, conch, bell, wine-cup, trident, noose and the discus Sudarsana.
*CHAPTER 2:*
*🌻 Slaughter of the armies of Mahisasura - 1 🌻*
The Rishi said:
1-3. Of yore when Mahishasura was the lord of asuras and Indra the lord of devas, there was a war between the devas and asuras for a full hundred years.
In that the army of the devas was vanquished by the valorous asuras. After conquering all the devas, Mahishasura became the lord of heaven( Indra).
4-5. Then the vanquished devas headed by Brahma, the lord of beings, went to the place where Siva and Vishnu were. The devas described to them in detail, as it had happened, the story of their defeat wrought by Mahishasura.
6-8. 'He (Mahishasura) himself has assumed the jurisdictions of Surya, Indra, Agni, Vayu, Chandra, Yama and Varuna and other (devas).
Thrown out from heaven by that evil-natured Mahisha, the hosts of devas wander on the earth like mortals. All that has been done by the enemy of the devas, has been related to you both, and we have sought shelter under you both.
May both of you be pleased to think out the means of his destruction.'
9. Having thus heard the words of the devas, Vishnu was angry and also Siva, and their faces became fierce with frowns.
10-11. The issued forth a great light from the face of Vishnu who was full of intense anger, and from that of Brahma and Siva too. From the bodies of Indra and other devas also sprang forth a very great light. And (all) this light united together.
12-13. The devas saw there a concentration of light like a mountain blazing excessively, pervading all the quarters with its flames. Then that unique light, produced from the bodies of all the devas, pervading the three worlds with its lustre, combined into one and became a female form.
14-15. By that which was Siva's light, her face came into being; by Yama's (light) her hair, by Vishnu's light her arms; and by Chandra's (light) her two breasts. By Indra's light her waist, by Varuna's (light) her shanks and thighs and by earth's light her hips.
16-18. By Brahma's light her feet came into being; by Surya's light her toes, by Vasus (light) her fingers, by Kubera's (light) her nose; by Prajapati's light her teeth came into being and similarly by Agni's light her three eyes were formed.
The light of the two sandhyas became her eye-brows, the light of Vayu her ears; the manifestation of the lights of other devas too (contributed to the being of the ) auspicious Devi.
19. Then looking at her, who had come into being from the assembled lights of all the devas, the immortals who were oppressed by Mahishasura experienced joy.
20-21. The bearer of Pinaka (Siva) drawing forth a trident from his own trident presented it to her; and Vishnu bringing forth a discus out of his own discus gave her. Varuna gave her a conch, Agni a spear; and Maruta gave a bow as well as two quivers full of arrows.
22-23. Indra, lord of devas, bringing forth a thunderbolt out of (his own) thunderbolt and a bell from that of his elephant Airavata, gave her. Yama gave a staff from his own staff of Death and Varuna, the lord of waters, a noose; and Brahma, the lord of beings, gave a string of beads and a water-pot.
24. Surya bestowed his own rays on al the pores of her skin and Kala (Time) gave a spotless sword and a shield.
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment