అద్భుత సృష్టి - 56

*🌹. అద్భుత సృష్టి - 56 🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


*🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 6 🌻*
          
🌟. *12వ లెవెల్*

ఇది చివరి స్థాయి మెర్కాబా యాక్టివేషన్. దీని ద్వారా భూమిపైన డివైన్ ప్లాన్ ని నిర్మించడం జరుగుతుంది. 

భూమిపై అసెన్షన్ కోసం విచ్చేసిన సోల్ ఫ్యామిలీని, సోల్ ప్రభుత్వాలను కౌన్సిల్స్ ని కలుస్తారు. వివిధ కమ్యూనిటీస్ తో కొత్త ఆచారాలు అన్నీ కూడా ఆత్మ సార్వభౌమత్వంలో భాగాలుగా మారుతాయి లేదా మేల్కొంటాయి.

✨. నిరంతరం సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ క్రొత్త ప్రపంచాలను సృష్టించడం జరుగుతుంది. మనం సంపూర్ణత్వంలో ఉంటాం మరి ఈ ప్రపంచంలోనే మరొక క్రొత్త కాంతి ప్రపంచాలను సృష్టిస్తాం.

*🌻. భూమిలో వచ్చే మార్పులు: 🌻*

కొత్త ప్రపంచం వ్యవస్థల సృష్టి అమలు కొనసాగించడం జరుగుతుంది. సరికొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. కొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. 

మెరుగైన విద్యావ్యవస్థలు, మెరుగైన ఆహారవ్యవస్థలు, వనరుల కేటాయింపులు మొదలైనవి ఉనికిలోనికి వస్తాయి. భూమి అసెన్షన్ చివరిదశ కొరకు DNA 12వ స్థాయి దీక్షను చేపడుతుంది. తద్వారా అందరూ ఆనందంగా సమానత్వం, సామరస్యంతో ఉంటారు.

✨. జనులు కాంతి గ్రేడ్లకు అనుసంధానం చేయబడి.. గ్రహం, గ్రహంపై ఉన్న మానవాళి అంతా దైవిక ప్రణాళిక అయిన చివరి దశకు చేరుకొని మరింతగా కీర్తి ప్రకాశంతో, కాంతి అనుసంధానంతో ప్రకాశిస్తూ ఉంటారు.

✨. గ్రహం కాంతిని మరింతగా స్వీకరిస్తూ తన స్థాయిని అభివృద్ధి పరుచుకుంటూ మల్టీస్టార్ సిస్టంలోకి వెళుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ లైట్ బాడీగా మరి ఆత్మ యొక్క పూర్తి స్థాయిశక్తితో ప్రతిబింబిస్తూ ఉంటారు.
*-జాన్ముహీన్ వ్రాసిన "ఇన్ రెసొనెన్స్"* పుస్తకం నుండి.

✨. భౌతిక స్థాయిలో 12 లెవెల్స్ లో మార్పులు జరిగిన తర్వాత మన 7 దేహాలు 7 కాంతి శరీరాలుగా అభివృద్ధి చెందుతూ...ఆ స్థాయిలో మూలం వరకూ విస్తరిస్తూ.. విశ్వవ్యాప్తమైన మనం విశ్వమానవునిగా.. దైవిక జీవిగా మారుతాము. ఈ దేహం అమరదేహం అవుతుంది.

*అన్నమయకోశం-- ప్లానెటరీ లైట్ బాడీ*

*ప్రాణమయకోశం--సోలార్ లైట్ బాడీ*

*మనోమయకోశం--ఇంటర్ స్టెల్లార్ లైట్ బాడీ*

*విజ్ఞానమయకోశం--గెలాక్టిక్ లైట్ బాడీ*

*ఆనందమయకోశం--ఇంటర్ గెలాక్టిక్ లైట్ బాడీ*

*విశ్వమయకోశం--యూనివర్సల్ లైట్ బాడీ*

*నిర్వాణమయ కోశం-- మల్టీయూనివర్సల్ లైట్ బాడీ*

ఈ స్థాయికి ఎదిగి మనం అమరులుగా మారుతాం. ఈ దేహం అమరదేహం అవుతుంది. ఈ భూమి మీద ఉంటూనే విశ్వకార్యక్రమాలన్నింటికీ బాధ్యత వహిస్తాం. *"డివైన్ గైడ్ ( దివ్య మానవునిగా దివ్య మార్గదర్శకులుగా) మారుతాం.*
*ఉదా:- మహావతార్ బాబాజీ"*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment