శివగీత - 92 / The Siva-Gita - 92

*🌹. శివగీత - 92 / The Siva-Gita - 92 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 


ఏకాదశాధ్యాయము 
*🌻. జీవ గత్యాది నిరూపణము - ఉపాసనా మాహాత్మ్యము - 6 🌻*

ఆత్మ జ్ఞానాత్పరం నాస్తి - తస్మాద్ద శరథాత్మజ !
బ్రాహ్మణ : కర్మభిర్నైవ - వర్దతే నైవ హీయతే . 41
నలిప్యతే పాత కేన - కర్మణా జ్ఞానవాన్యది ,
తస్మాత్సర్వాధి కో విప్రో - జ్ఞాన వానేవ జాయతే . 42
జ్ఞాత్వాయః కురుతే కర్మ - త్స్యక్ష య్య ఫలంభవేత్,
యత్ఫలంలభతే మర్త్య :- కోటి బ్రాహ్మణ భోజనై 43
తత్ఫలం సమవా ప్నోతి - జ్ఞానినం యస్తుభోజయేత్,
జ్ఞాన వంతంద్విజం యస్తు - ద్విష్యతేచన రాధమః 44
సశూష్యమాణోమ్రియతే - యస్మాదీశ్వరఏవస:,
ఉపాసకోనయాత్యేవ - యస్మాత్సునర ధోగతిమ్,
ఉపాసనరతో భూత్వా - తస్మాదాస్స్వ సుఖీభవ ! 45
ఇతి శ్రీ పద్మ పురాణే శివగీతాయాం ఏకాదశో ధ్యాయ :

బ్రహ్మ జ్ఞాని కర్మల చేత వృద్ది - క్షయ దశలను పొందడు, బ్రాహ్మణుడు బ్రహ్మ జ్ఞాని యైన యెడల పాప కర్మలకు దూరముగా నుండును . జ్ఞానియగుట వలన బ్రాహ్మణుడు సర్వాధికుడు గా ఎన్న బడుచున్నాడు. 

 ఎవ్వడైతే తెల్సి సత్కర్మ నా చరించునో వాడు క్షయ ఫలమును పొందును లోకము నందు మానవుడు కోటి బ్రాహ్మణ భోజనము వలన ఎటువంటి 
ఫలమును పొందునో జ్ఞాని కన్నము వడ్డించుట వలన అంతటి ఫలమును బరింతురు.  
 అది ఈ పై శ్లోకమునకు సరి పోలుచున్నది . 

శ్లో l l శివ యోగి ని సంతృప్తే - తృప్తో భవతి శంకరః l
తత్త్త్రుప్త్యాతన్మయం విశ్వం - తప్త మేతి చరా చరమ్ l l

ఇట శివ యోగి యన గా దివ్య జ్ఞాని యనె అర్ధమగు చున్నది. అట్టి జ్ఞాని కన్నమును పెట్టి దృప్తి పరచిన చో సాక్షాత్తు గా పరమ శివుడే తృప్తి చెందుననియు, అతడు దృప్తి చెందినచో సమస్త చరచరాత్మకమగు ప్రాణి కోటి తృప్తి చెందుతుందని అర్ధము.

 ఏలన శంకరుని హృదయము చతుర్ధ శభువన లుండునని వాడుక యున్నది. అది యిక్కడ సమన్వయించు కోవాలి ) జ్ఞానిని ద్వేశించిన వాడు క్షయ రోగ గ్రస్తుడై మరణించును. ఉపాస కుండెప్పుడు ను అధో గతిని పొందడు. కనుక నీవు కూడా ఉపాసన మొనర్చి ఆనందమును పొందు మని రామునకు శివుడాశీర్వదించెను.  

ఇది వ్యసోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గతం భైన శివ గీతలోనెకా దశ అధ్యాయము సమాప్తము.  

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 92 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 11 
*🌻 Jiva Gatyaadi Niroopanam - Upasana Mahatya - 6 🌻*

But a Brahmajnani doesn't follow this path of Karmas and hence doesn't attain the ephemeral states of happiness. 

A brahmana after becoming a Brahmajnani remains untouched with sinful activities. Because of attainment of knowledge, that Brahmana surpasses everything. 

One who deliberately does good karmas, he gains Kshaya Phalam (fruit which would decline). Whatever merit is obtained by giving food to one crore Brahmanas such an equal merit lies in giving food to a Brahmajnani. 

A man who shows hatred or repulsion towards a brahmajnani, he dies with Kshaya disease (tuberculosis). An upasaka (spiritual practitioner) never lands in soup. Hence O Rama! you too should follow Upasana path and gain eternal bliss.

 Here ends the 11th chapter of Shiva Gita from Padma Purana Uttara Khanda .

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment