✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 24 🌻
314. భౌతిక గోళములో కొన్ని ప్రపంచములు లోహములు , వృక్షజాతులతో కూడియున్నవి , కొన్నింటిలో అగణితమైన జీవరాసులున్నవి .మరికొన్ని మానవులతో కూడియున్నవి. ఈ భౌతిక గోళములో అతి ప్రధానమైనది మన భూమి ,ఇక్కడ కొద్దిగనో గొప్పగనో భౌతిక స్పృహగల జీవులన్నింటిలో , అన్నిభౌతిక ప్రపంచములలోని అన్ని జీవులకంటె పూర్ణ చైతన్యము గల మానవుడు శ్రేష్ఠుడు .
315. ఆధ్యాత్మిక విషయములను ఎంత చదివినను ఎంత చర్చించినను , ఎంత యోచించిననూ మానవుడు సూక్ష్మగోళములో మేల్క్నునంతవరకు ఆతని చైతన్యము పూర్తిగా భౌతికమునే ఆవరించి యుండును .
316. మన భూమిమీదనున్న మానవులు , భౌతికగోళము లో అందరి మానవుల కంటే ఆధ్యాత్మికముగా శ్రేష్ఠులు .
317. భౌతికగోళము లో మానవులు నివసించు మూడు ప్రపంచములున్నవి . ఈ మూడింటిలో మన భూమియందున్న మానవులు ఆధ్యాత్మికముగా శ్రేష్ఠతములు .
318. మనభూమియందున్న మానవుడు సమపాళ్ళు గల హృదయమస్తిష్కములను కలిగియున్నాడు .
50 పాళ్ళు హృదయము + 50 పాళ్ళు తెలివి .
319. మిగిలిన రెండు ప్రపంచములోనున్న మానవులు ఒక ప్రపంచములో నూటికి నూరు పాళ్ళు తెలివితేటలే.
మూడవ ప్రపంచములో 75 పాళ్ళు హృదయమును 25 పాళ్ళు తెలివిని కలిగియున్నారు .
320. మానవుడు 84 లక్షల పునర్జన్మలలో, ఈ మూడు ప్రపంచములో ఏ దేని యొక ప్రపంచములో జన్మించుచున్నాడు, కానీ చరమముగా భగవధైక్యము యనెడు తన దివ్య భాగదేయమును కృతకృత్య మొనర్చుటకు ఈ భూమిపై పుట్టుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment