శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 81 / Sri Gajanan Maharaj Life History - 81

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 81 / Sri Gajanan Maharaj Life History - 81 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


*🌻. 16వ అధ్యాయము - 3 🌻*

శ్రీమహారాజు తన భక్తుల కోరికలు ఎలాతీరుస్తారు అనే కధగూర్చి ఇప్పుడు వినండి: అకోలాలో బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు వ్యాపారంచేసే రాజారాం కావర్ అనే పేరుగల బ్రాహ్మణుడు ఉన్నాడు.

శ్రీమహారాజుమీద రాజారాంకు గొప్ప విశ్వాసం ఉంది. అందుకే అతని కొడుకులు కూడా శ్రీమహారాజును గౌరవించేవారు. 

అతనికి గోపాల్ మరియు త్రయంబక్ అనే ఇద్దరు కొడుకులు. చిన్నవాడయిన త్రయంబక్ ముద్దుపేరు భవ్, హైదరాబాదులో వైద్యకళాశాల విద్యార్ధి. చిన్నప్పటినుండి కూడా ఇతను చాలానమ్మకం కలవాడు, అందువల్ల ఎటువంటి క్లిష్టపరిస్థితి వచ్చినా, శ్రీగజానన్ మహారాజును గుర్తుచేసుకునేవాడు. ఆవిధంగా అతను శ్రీమహారాజు భక్తుడు. 

ఒకసారి శెలవులకు ఇంటికి వచ్చినప్పుడు, శ్రీమహారాజుకు ఇష్టమయిన భోజనం ఇవ్వాలని కోరుకున్నాడు. కాని ఎలాచెయ్యడం ? అతని తల్లి అతని చిన్నతనంలోనే చనిపోయింది. అతని అన్నభార్య నాని కోపిష్టి. అతను శ్రీమహారాజును ప్రార్ధించాడు.....ఓ మాహారాజ్ నేను మీరు ఇష్టపడే రొట్టె, ఉల్లిపాయ, శెనగపిండి కూర మరియు పచ్చిమిరపకాయలు మీకు ఇవ్వాలని కోరుకున్నాను. 

కానీ మావదినకు ఇవి తయారు చెయ్యమని ఎలా చెప్పడం ? తల్లి ఒక్కర్తే తన కుమారుని కోసం ఏదయినా చేస్తుంది. అతను అలా ఆలోచిస్తూ ఉండగా, అతని వదిన అక్కడికి రావడం తటస్థపడింది, మరియు అతను ఉదారంగా ఉండడం చూసి, చింతకు కారణం అడిగింది. అతను చెప్పడానికి సంకోచిస్తూఉంటే, అన్న భార్యను తల్లిగా భావించి తన మనసు విప్పి చెప్పాలని ఆమెఅంది. 

ఈ మాటలు అతన్ని ప్రోత్సాహపరచగా, శ్రీమహారాజుకు ఇష్టమయిన భోజనం షేగాంవెళ్ళి ఇవ్వాలని కోరికగా ఉన్నట్టు ఆమెకు చెప్పాడు. ఆమెనవ్వి ఏపదార్ధాలు చెయ్యాలి అని అడిగింది. భవ్ శ్రీమహారాజుకు ఇవ్వాలని కోరుకున్న పదార్ధలు ఆమెకు చెప్పాడు. సంతోషంగా ఆమె వంటగదికి వెళ్ళి, పదార్ధాలు తయారుచేసి వెన్నరాసిన మూడు రొట్టెలు, మూడు ఉల్లిపాయలు మరియు శెనగపిండికూర ఒక టిఫిన్ డబ్బాలోపెట్టి తీసుకుని వెనక్కి వచ్చింది. 

ఆమె అది భవకు ఇచ్చి సమయానికి రైలు పట్టుకుందుకు త్వరగా స్టేషనుకు వెళ్ళమని అడిగింది. భవ్ అప్పుడు తన తండ్రి అనుమతి తీసుకుని రైల్వేస్టేషనుకు వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు 12 గం. బండి తప్పి పోయింది. అతను చాలా నిరాశపొందాడు, కళ్ళలో నీళ్ళు వచ్చాయి. 

ఓమాహారాజ్ ఎందుకు నన్ను నిరాశపరిచారు ? పుణ్యకార్యంచేసి ఆనందం పొందడాన్ని ఎప్పుడూ తప్పిపోతున్న ఒకచిన్న అనాధను నేను. నేను మానసరోవరం చేరలేని ఒక కాకిలాంటి వాడిని. 12 గం. బండి తప్పిపోవడానికి నేను చేసినటువంటి క్షమించరాని తప్పుపమిటో చెప్పండి. ఇది నాదురదృష్టం తప్ప మరేమీకాదు. 

ఇవ్వాల ఈభోజనం మీకు ఇవ్వలేకపోతే నేనుకూడా నాకొరకు ఏమీ తినని ఒట్టు పెట్టుకుంటున్నాను. ఓగురుదేవా దయచేసి మీఈ బాలకుడిని విశ్మరించకుండా, మీకోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈపదార్ధాలను స్వీకరించేందుకు పరుగునరండి. మీరు అత్యంత శక్తివంతులు. ఒక్క క్షణంలో కేదారేశ్వరు చేరగలరు. ఆజ్ఞాపించడంలేదు, కావున ఇందులో మీకు ఏమీ అవమానంలేదు. తరువాత బండి వచ్చేందుకు ఇంకా 3 గం. సమయంఉంది, ఆపాటికి మీ భోజనం అయిపోతుంది అనినేను అనుకుంటున్నాను అని అతను అన్నాడు. 

భవ్ ఏమీ తినకుండా స్టేషనులోనే ఉండి 3 గం. బండిలో షేగాం వెళ్ళాడు. షేగాంచేరిన పిదప శ్రీమహారాజుకూడా భోజనం చెయ్యకుండా ఉండడం భవ్ చూసాడు. తిను పదార్థాలతో నిండిన అనేక మయినపళ్ళాలు ఆయనముందు స్వీకరించడానికి పెట్టబడి ఉన్నాయి. వాటిలో జిలేబి, నేతిమిఠాయి, మొతిచూర్, పాయసం, శ్రీఖండ్, పూరి వంటివి ఉన్నాయి. బాలాభన్ ఈ పళ్ళాలు తెచ్చి శ్రీమహారాజు ముందుఉంచి, భక్తులకు ప్రసాదం దొరకడం కొరకు ఆయనను భోజనం చెయ్యవలసిందిగా అర్ధించాడు, 

కానీ ఆయన దేనినీ ముట్టుకోలేదు. తను సాయంత్రమే భోజనం చేస్తానని, ఈ భోజనం సమర్పిస్తున్నవారు ఇష్టమయితే ఆగవచ్చు లేదా వెళ్ళిపోవచ్చు అని శ్రీమహారాజు అన్నారు. భవ్ అక్కడికిచేరి శ్రీమహారాజును చూసి, చాలా సమయం తరువాత పిల్ల తల్లిని చూసినట్టు అమిత ఆనందంపొందాడు. భవ్ శ్రీమహారాజుకు సాష్టాంగ నమస్కారంచేసి లేచి నిలుచుని, చేతులుకట్టుకుని గురువు తదుపరి ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 81 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 16 - part 3 🌻*

There was one Rajaram Kavar, a Brahmin at Akola, who was a dealer in gold and silver ornaments. This Rajaram had great faith in Shri Gajanan Maharaj , and so his sons also respected Maharaj. He had two sons named Gopal and Trimbak. Trimbak, the younger, nicknamed as Bhau, was a student of the Medical College at Hyderabad. 

He was a great believer, right from his childhood, and so in times of any difficulty used to remember Shri Gajanan Maharaj. Thus, he was a devotee of Shri Gajanan Maharaj . He once came home during vacations and wished to offer meals of His liking to Shri Gajanan Maharaj . But how to do it? His mother had died when he was a child, and his brother's wife, named Nani, was hot tempered. 

So, he prayed to Shri Gajanan Maharaj , “O Maharaj! I wish to offer you the food of your liking: bread, onion, curry of Ambadi and green chilies. But how can I tell my sister-in-law to prepare all this? Only a mother can do everything for her son..

” When he was thinking like that, his sister-in-law, Nani, happened to come there, and, looking to his depressed mood, asked him the reason for his worry. When he hesitated to tell, she said that he should treat his elder brother's wife as a mother and open his mind. 

These words encouraged him, and he told her that he wanted to go to Shegaon and offer Shri Gajanan Maharaj the food of His liking. She smiled and asked the menu to be prepared. Bhau told her what he wished to offer to Shri Gajanan Maharaj . 

She happily went to kitchen, prepared the food and came back with a tiffin containing three breads, with butter on, three onions and Besan. She gave it to Bhau and asked him to hurry to the station and catch the train in time. Bhau then took permission from his fathe and went to the railway station, but unfortunately missed the 12 O’clock train. 

He was greatly disappointed and tears began to come from his eyes. He said, “O Maharaj! Why have you disappointed me? I am a small orphan always missing the pleasure of doing punya (Good deed). I am like a crow who cannot reach Maansarovar. 

Tell me, what is the unpardonable mistake committed by me that made me miss the 12 O'clock train? This is my ill luck and nothing else. But I vow that if this food is not served to You today, I will not eat anything, myself. 

O Gurudev! Please do not ignore this child of Yours, and come running to accept this food which is especially prepared for You only. You are all powerful, You can reach Kedareshwar in a moment; then why this hesitation to come here? I am not ordering You, but calling You with love, so it does not mean any disrespect to You. 

There are still three hours for the next train to come, and I think that by that time you would have finished Your lunch.” Bhau stayed at the station without eating anything and went to Shegaon by the 3 O'clock train. On reaching Shegaon, Bhau saw that Shri Gajanan Maharaj also had not taken His meals. 

A lot of thalis (plates) full of all sorts of food were put before him as offerings. They included sweets like jalebi, gheever, motichur, kheer, shrikhand and puri. Balabhau brought and put these plates before Shri Gajanan Maharaj and requested Him to take the food so that the devotees would get the prasad, but He did not touch any of them. 

Shri Gajanan Maharaj said that He would take His food in the evening and the persons offering this food to Him, may, if they like, wait or go away. Bhau reached there and was immensely happy to see Shri Gajanan Maharaj like a child seeing a long lost mother. 

Bhau prostrated before Shri Gajanan Maharaj and stood up with folded hands awaiting further orders from his Guru.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment