🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 22 🌹
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*16. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కతీతటీ*
*రత్నకింకిణి కారమ్య రశనా దామ భూషిత*
*🌻 37. 'అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కతీతటీ 🌻*
ఎల్లని వస్త్రమును కటి ప్రదేశమున ధరించిన దేవియని భావము.
అరుణారుణ మనగా ఎఱ్ఱని ఎరుపుయని అర్థము. ఇది సూర్యుడు ఉదయించినపుడు ఆకసమున మరియు సూర్యబింబమున కనపడు ఎరుపు. కౌస్తుంభ మనగా కుంకుమపువ్వు రంగు.
అట్టి రంగుతో వెలుగొందుచున్న వస్త్రమును కటి ప్రదేశమున ధరించినది. ఎరుపురంగు ఇచ్ఛాశక్తి స్వరూపము. అందుండియే జ్ఞాన క్రియా శక్తులు కూడ క్రమశః ఉద్భవించగలవు. అమ్మ తిరుగులేని సంకల్పశక్తి కలది. సంకల్పబలము దృఢముగ ఏర్పడవలె నన్నచో ఉపాసకులు ఈ అరుణారుణ వర్ణమును బాగుగ ధ్యానము చేయవలసి యుండును.
రంగు మనస్సునందు అపవిత్రతను దగ్ధము చేయగలదు. ఇంద్రియ ప్రవృత్తులను నిర్దేశము చేసి నియమించగలదు. జీవునకు అమితమైన సంకల్ప శక్తిని ప్రసాదించ గలదు. కావుననే అమ్మవారికి కుంకుమతో పూజ చేయుట.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 37 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 37. Aruṇaruṇa- kausumbha- vastra- bhāsvat- kaṭītaṭī* *अरुणरुण-कौसुम्भ-वस्त्र-भास्वत्-कटीतटी (37) 🌻*
She wears a red silk cloth around Her waist. Red colour means compassion.
Everything associated with Her is red in colour, indicating that Her form is full of compassion (one of the reasons of being Śrī Mātā). It can be said that She performs Her three acts (creation, sustenance and dissolution) with compassion.
This could also refer to one of the Vāc Devi-s, Arunā. This Sahasranāma was composed by eight Vāc Devi-s.
They are Vasini, Kāmeśvari (not Śiva ’s wife), Modhini, Vimalā, Arunā, Jainī, Sarveśvariī and Koulinī. Arunā Vāc Devi is in Her waist.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 38 / Sri Lalitha Chaitanya Vijnanam - 38 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*16. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కతీతటీ*
*రత్నకింకిణి కారమ్య రశనా దామ భూషిత*
*🌻 38. రత్నకింకిణి కారమ్య రశనా దామ భూషిత 🌻*
రత్నమయములైన చిరుగంటలచే, రమ్యమైన బంగారు మొలనూలుచే అలంకరింపబడినది. ప్రాచీన కాలమున స్త్రీలు కూడ మొలత్రాటిని ధరించు అలవాటు కలదు. ఉపనయనాది సంస్కారములు కూడ స్త్రీలకు చేయుచుండెడివారు. శ్రీదేవికి సదాచారమన్న అత్యంత ప్రీతి. సదాచార బోధకురాలు కావున తాను మొలత్రాడు ధరించి లోకమునకు బోధించుచున్నది.
బంగారము, రత్నములతో పొదిగిన గంటలు గల మొలత్రాడు కటి ప్రదేశమున యమ నియమాది గుణముల నేర్పరచుటకు తోడ్పడును. కామము, మోహము కలిగించు ప్రదేశము కటి భాగము.
ఆ భాగమునకు రత్నమయము, హిరణ్మయము అగు కాంతులను స్పృశింపచేయుట, ప్రసరింపచేయుట వలన జీవుడతి కాముకుడు కాక యుండును. వైదిక సంస్కారము లన్నియు కూడ జీవుడు కామలోలుడై పతనము చెందకుండుటకు ఏర్పరుపబడిన సదాచారములు.
సదాచారమున్నచోట సంపద యుండును. విద్య కూడ అభివృద్ధి చెందును. సదాచారమును నిర్లక్ష్యము చేయకుమని తాను మొలనూలు ధరించి జీవులను హెచ్చరించుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 38 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 38. Ratna- kiṅkiṇikā- ramya- raśanā-dāma-bhūṣitā* *रत्न-किङ्किणिका-रम्य-रशना-दाम-भूषिता (38) 🌻*
She is adorned with girdle studded with mini bells and gems.
Devi’s Pañcadaśī mantra consists of three parts or kūṭa-s. Vāgbhava kūṭa was discussed from nāma 13 to 29.
Madhya kūṭa was discussed from 30 to 38 and Śaktī kūṭa will be discussed from 39 to 47. Devi’s face is vāgbhava kūṭa, from face to hip is madhya kūṭa (also known as kāmarāja kūṭa) and Śaktī kūṭa is hip downwards.
The entire Pañcadaśī mantra is hidden in nāma-s 13 to 47. Her gross description is also discussed from nāma-s 13 to 54.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment