24-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 24 బుధ వారం, సౌమ్య వారము ఆక్టోబర్ 2021 కార్తీక మాసం 20వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 118 / Bhagavad-Gita - 118 2-71🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 515 / Vishnu Sahasranama Contemplation - 515 🌹
4) 🌹 DAILY WISDOM - 193🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 32🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 99 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 322-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 322-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*24, నవంబర్‌ 2021, సౌమ్య వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 20వ రోజు 🍀*

*నిషిద్ధములు : పాలు తప్ప – తక్కినవి*
*దానములు : గో, భూ, సువర్ణ దానాలు*
*పూజించాల్సిన దైవము :*
*నాగేంద్రుడు*
*జపించాల్సిన మంత్రము :*
*ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయ పాతుమాం*
*ఫలితము : గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: కృష్ణ పంచమి 27:05:43 
వరకు తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: పునర్వసు 16:30:32 
వరకు తదుపరి పుష్యమి
యోగం: శుభ 07:30:46 వరకు 
తదుపరి శుక్ల
కరణం: కౌలవ 14:00:50 వరకు
వర్జ్యం: 03:08:00 - 04:54:56 మరియు
25:16:40 - 27:02:00
దుర్ముహూర్తం: 11:40:10 - 12:25:05
రాహు కాలం: 12:02:38 - 13:26:50
గుళిక కాలం: 10:38:25 - 12:02:37
యమ గండం: 07:50:00 - 09:14:13
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 13:49:36 - 15:36:32
సూర్యోదయం: 06:25:48
సూర్యాస్తమయం: 17:39:27
వైదిక సూర్యోదయం: 06:29:35
వైదిక సూర్యాస్తమయం: 17:35:40
చంద్రోదయం: 21:41:38
చంద్రాస్తమయం: 10:25:04
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: జెమిని
గద యోగం - కార్య హాని , చెడు 
16:30:32 వరకు తదుపరి 
మతంగ యోగం - అశ్వ లాభం 
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత-118 / Bhagavad-Gita - 118 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 71 🌴*

71. విహాయ కామాన్ య: సర్వాన్ 
పుమాంశ్చరతి నిస్పృహ: |
నిర్మమో నిరహంకార: 
స శాన్తిమధిగచ్చతి ||

🌷. తాత్పర్యం :
*ఇంద్రియభోగానుభవ కోరికల నన్నింటిని త్యజించి నిష్కామునిగా జీవించుచు, మమకారము మరియు మిథ్యాహంకారము వదిలిపెట్టినవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును.*

🌷. భాష్యము :
నిష్కామత్వమనగా ఇంద్రియభోగము కొరకై దేనిని వాచింపకుండుట యని భావము. అనగా కృష్ణభక్తియందు నిలువగోరుటయే నిజమైన నిష్కామత్వము. దేహాత్మభావనము మరియు జగమునందలి దేనిపైనను యజమానిత్వమును కలిగియుండక శ్రీకృష్ణుని దాసునిగా మనుజుని వాస్తస్థితిని అవగతము చేసికొనుటయే కృష్ణభక్తిభావనయందలి పూర్ణత్వస్థితి. అట్టి పూర్ణత్వస్థితి యందు నెలకొనినవాడు శ్రీకృష్ణుడే సకలమునకు అధిపతి కనుక సమస్తమును అతని ప్రీత్యర్థమే నియోగింపబడవలెనని ఎరిగియుండును. అర్జునుడు తొలుత తన ప్రీత్యర్థమై యుద్దమును నిరాకరించినను కృష్ణభక్తిభావనాయుతుడు అయినంతనే యుద్ధము నొనరించెను. అతడు యుద్ధము నందు పాల్గొనవలెనని శ్రీకృష్ణుడు వాంచించి యుండుటయే అందులకు కారణము. 

యుద్ధము చేయవలెననెడి కోరిక తనకు లేకున్నను కృష్ణుని కొరకై అతడు తన శక్త్యానుసారము యుద్ధము చేసెను. కృత్రిమముగా కోరికలను నశింపజేయుట కన్నను కృష్ణుని ప్రియమును వాంచించుట యనునది నిజమైన నిష్కామత్వమై యున్నది. జీవుడేజీవుడెన్నడు వాంఛారహితుడు కాజాలడు. కాని అతడు తన కోరికల పద్ధతిని(గుణమును) మార్చుకొనవలయును. భౌతికవాంఛారహితుడైన వ్యక్తి సమస్తము శ్రీకృష్ణునకే చెందినదని (ఈశావాస్యమిదం సర్వమ్) తెలిసియుండును కావున దేనిపైనను వ్యర్థముగా యజమానిత్వమును కలిగియుండడు. 

ఆధ్యాత్మికముగా శ్రీకృష్ణునికి నిత్యాంశయైన జీవుడు తన నిజస్థితి కారణముగా ఎన్నడును శ్రీకృష్ణునితో సమానుడు కాని, అధికుడు కాని కాజాలడనెడి ఆత్మానుభవము పైననే ఈ దివ్యజ్ఞానము ఆధారపడియున్నది. ఇట్టి కృష్ణభక్తిరసభావన యొక్క అవగాహనయే శాంతికి మూలసిద్ధాంతమై యున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 118 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 71 🌴*

71. vihāya kāmān yaḥ sarvān pumāṁś carati niḥspṛhaḥ 
nirmamo nirahaṅkāraḥ sa śāntim adhigacchati

🌷Translation :
*A person who has given up all desires for sense gratification, who lives free from desires, who has given up all sense of proprietorship and is devoid of false ego – he alone can attain real peace.*

🌷 Purport :
To become desireless means not to desire anything for sense gratification. In other words, desire for becoming Kṛṣṇa conscious is actually desirelessness. To understand one’s actual position as the eternal servitor of Kṛṣṇa, without falsely claiming this material body to be oneself and without falsely claiming proprietorship over anything in the world, is the perfect stage of Kṛṣṇa consciousness. 

One who is situated in this perfect stage knows that because Kṛṣṇa is the proprietor of everything, everything must be used for the satisfaction of Kṛṣṇa. Arjuna did not want to fight for his own sense satisfaction, but when he became fully Kṛṣṇa conscious he fought because Kṛṣṇa wanted him to fight. For himself there was no desire to fight, but for Kṛṣṇa the same Arjuna fought to his best ability. 

Real desirelessness is desire for the satisfaction of Kṛṣṇa, not an artificial attempt to abolish desires. The living entity cannot be desireless or senseless, but he does have to change the quality of the desires. A materially desireless person certainly knows that everything belongs to Kṛṣṇa (īśāvāsyam idaṁ sarvam), and therefore he does not falsely claim proprietorship over anything. 

This transcendental knowledge is based on self-realization – namely, knowing perfectly well that every living entity is an eternal part and parcel of Kṛṣṇa in spiritual identity, and that the eternal position of the living entity is therefore never on the level of Kṛṣṇa or greater than Him. This understanding of Kṛṣṇa consciousness is the basic principle of real peace.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 515 / Vishnu Sahasranama Contemplation - 515 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 515. ముకుందః, मुकुंदः, Mukundaḥ 🌻*

*ఓం ముకున్దాయ నమః | ॐ मुकुन्दाय नमः | OM Mukundāya namaḥ*

ముకుందః, मुकुंदः, Mukundaḥ

*ముకుం ముక్తి దదాతీతి ముకుంద ఇతి కీర్త్యతే ।*
*ముకుంద ఇతి నిరుక్తిర్నైరుక్తికపథాకృతా ॥*

*ముక్తిని ప్రసాదించువాడు ముకుందః. యాస్కుడూ మొదలగు నిరుక్త కర్తలు అక్షరసామ్య మాత్రమున అవలంబనము చేసికొనియైనను పదముల నిర్వచన చేయవచ్చును అని చెప్పియున్నందున ముక్తిం - ద = ముకుం - ద అగుచున్నది.*

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
హవరూపివి! హవనేతవు!, హవభోక్తవు! నిఖిల ఫలధారుఁడవున్‍!
హవరక్షకుఁడవు నగు నీ కవితథముగ నుతు లొనర్తుమయ్య ముకుందా! (427)

నీవు యాజ్ఞ స్వరూపుడవు. యజ్ఞకర్తవు. యజ్ఞభోక్తవు. యజ్ఞఫలప్రదాతవు. యజ్ఞ రక్షకుడవు. సమస్తము నీవే! ఓ ముకుందా! నీకు మా హృదయపూర్వక అభివందనాలు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 515 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 515. Mukundaḥ 🌻*

*OM Mukundāya namaḥ*

मुकुं मुक्ति ददातीति मुकुंद इति कीर्त्यते ।
मुकुंद इति निरुक्तिर्नैरुक्तिकपथाकृता ॥

*Mukuṃ mukti dadātīti mukuṃda iti kīrtyate,*
*Mukuṃda iti niruktirnairuktikapathākr‌tā.*

*He who confers mukti or liberation is Mukundaḥ. As per the treatise Nirukta, on etymology, lexical category and the semantics of Sanskrit words authored by Yāska, there is similarity of letters between mukti and mukunda. So Mukundaḥ means muktim dadāti i.e., confers mukti.*

:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे चतुर्थोऽध्यायः ::
यदङ्घ्र्यभिध्यानसमाधिधौतया धियानुपश्यन्ति हि तत्त्वमात्मनः ।
वदन्ति चैतत्कवयो यथारुचं स मे मुकुन्दो भगवान्प्रसीदताम् ॥ २१ ॥

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 4
Yadaṅghryabhidhyānasamādhidhautayā dhiyānupaśyanti hi tattvamātmanaḥ,
Vadanti caitatkavayo yathārucaṃ sa me mukundo bhagavānprasīdatām. 21.

It is Lord Śrī Kr‌s‌n‌a who gives liberation. By thinking of His lotus feet every second, following the footsteps of authorities, the devotee in trance can see the Absolute Truth. The learned mental speculators, however, think of Him according to their whims. May the Lord be pleased with me.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 193 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 11. The Mind is Addicted to Sense-experience 🌻*

This spirit that is implanted in us suffers for union with the spirit outside, the Absolute. There is its critical moment. It is as if we were going to embrace the ocean. This experience has been compared in many ways to merging into fire, tying a wild elephant with silken threads, swallowing fire, etc. The problem arises on account of the peculiar nature of the mind. The mind is addicted to sense experience. 

It is accustomed to the enjoyment of objects, and it is now attempting to rise above all contacts and reach the state of that yoga which great masters have called asparsha yoga—the yoga of non-contact. It is not a union of something with something else; that would be another contact. It is a contact of no contact. It is difficult to encounter because of a sorrow of the spirit, deeper than the sorrow of the feelings, which even a saintly genius has to experience. 

The deeper we go, the greater is our sorrow, because the subtle layers of our personality are more sensitive to experience than our outer, grosser vestures. We know very well that the suffering of the mind is more agonising than the suffering of the body. We may bear a little sorrow of the body, but we cannot bear sorrow of the mind—that is more intolerable.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 32 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 21. అప్రమత్తత 🌻*

*శ్రుతి లేని వీణ సంగీతమునకు పనికిరాదు. అప్రమత్తత లేని సాధన యోగమునకు పనికిరాదు. సరిగ శ్రుతి పెట్టబడిన వీణద్వారా వీచుగాలి వలన కూడ సంగీతములు పలుకును. అప్రమత్తుడైన సాధకుడు తన వంతు కర్తవ్యమును సన్నివేశముల నుండి గొనును. అప్రమత్తుడే సూక్ష్మ గ్రాహి కూడ. అప్రమత్తత బుద్ధిని పదను యందుంచును. మన చుట్టును నున్నవారు అప్రమత్తులై యుండవలెనని మనమా కాంక్షించు చుందుము. అటులనే మనమప్రమత్తులమై యుండవలెనని వారును ఆకాంక్షింతురు కదా! ఇతరులు అప్రమత్తులై యుండవలెనని ఆకాంక్షించుట కన్న తానప్రమత్తుడై యుండుట అవసరము.*

*సప్తధాతువులతో కూడిన నీ శరీరమను వాయిద్యమును శృతి పెట్టి యుంచుకొనుము. అదియే సాధన, అట్లుంచినచో సూక్ష్మ గ్రాహ్యత్వము కలుగును. వాయుతరంగముల ద్వారా మా నుండి సందేశములు కూడ అందును. మా మాటలు ఆలకించుటకు ఇట్టి అప్రమత్తత అత్యవసరము. అప్రమత్తత నీ సహజ లక్షణము కావలెను. వీణ తీగలను సడలించుట వీణ కపాయకరమని గూడ గుర్తించుము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 99 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మనం సముద్రంలో నీటి బిందువుల్లా కలిసిపోయే కళను నేర్చుకోవాలి. దానికి ధైర్యం కావాలి. ఒకడు మంచు బిందువుగా మరణించకుంటే సముద్రంగా జన్మించడం వీలుపడదు. 🍀*

*దేవుడు అనంతుడు, అవధులు లేనివారు. విశ్వవ్యాప్తుడు. దేవుడు సముద్రమయితే మనమంతా మంచు బిందువులం. మనం సముద్రంలో నీటి బిందువుల్లా కలిసిపోయే కళను నేర్చుకోవాలి. దానికి ధైర్యం కావాలి. సముద్రంలో కలిసిపోవాలంటే మంచు బిందువు మరణించాలి.*

*ఒకడు మంచు బిందువుగా మరణించకుంటే సముద్రంగా జన్మించడం వీలుపడదు. బీజం మరణిస్తే కానీ మహావృక్షం జన్మించదు. బీజం అదృశ్యమవుతుంది. కేవలం ఆ అదృశ్యం నించే వృక్షం ఆవిష్కరింప బడుతుంది.*

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 322 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 322-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 322-2. 'కామ కళారూపా' 🌻* 

పరతత్వము నుండి సంకల్ప మాత్రమున వెలువడిన మూల ప్రకృతి ఆ తత్త్వమును ఆధారముగ గొని సమస్తమును జనింప చేయుచుండును. రూపముల నేర్పరచుచున్నవి. కామకల ఆధారముగనే సమస్త రూపములు యేర్పడుచున్నవి. శివ శక్తుల సమాగమ ప్రజ్ఞ ప్రధానమగు కళ. ఈ కళను సృష్టి యందు అన్ని రూపముల మూలముగ గుర్తింప వచ్చును. 

ముందు తెలిపిన నామములో శ్రీమాత కోరబడునది అగుటచే కామ్యా అని తెలుపబడినది. తరువాత నామములో రూపము నందు గల కామకలను దర్శించుట తెలుపబడినది. సమస్తము నందును పుట్టినచోటు గుర్తించుటయే కామకలా ఉపాసనము. చేతల పుట్టుక భావముల యందు గోచరించును. 

భావముల పుట్టుక త్రిగుణముల యందు గోచరించును. త్రిగుణముల పుట్టుక చైతన్యమున గోచరించును. చైతన్యము సత్యము నుండి ఉద్భవించినది. సత్ చిత్ విలాసమే సృష్టి అంతయును. దీనినే కామకలా విలాస మందురు. ఈ కామకలా విలాసము సృష్టి అంతటను గోచరించవచ్చును. కేవలము స్త్రీ పురుషుల కామమే (లైంగిక చర్య) కామకళ అని భావింపరాదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 322-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 322-2. Kāmakalā rūpā कामकला रूपा (322)🌻*

The three bindu-s are extremely powerful. They represent sun, moon and fire. Bindu is called the highest light. The highest form of light naturally should be the origin of light from which all others should have emerged. Self illuminating light is Śiva and that is why He is called as prakāśa form. Śaktī reflects and distributes the light received from prakāśa form and that is why She is called as vimarśa form. Vimarśa can be explained as knowledge with reasoning. The light of Śiva will not be reflected unless Śaktī is by His side. These three bindu-s are therefore the three different forms of Śaktī and each of which represent three divine energies viz. Vāma, Jyeśta and Raudrī. These goddesses represent Her three acts of creation, nourishment and absorption. This is as far as the upper triangle is concerned. It must be remembered that there is no triangle here but only three bindu-s (Bindu-s are further elaborated in nāma 905). It is called as a triangle because if these dots are joined by straight lines, a triangle is formed. 

This upper conceived triangle is coupled with the lower hārda-kalā or the lower inverted triangle. Each of the three lines of the triangle represents the three kūṭa-s of Pañcadasī mantra. From this lower triangle which is formed out of the three kūṭa-s of the supreme Pañcadasī mantra, all other mantra-s are born leading to the creation of the universe. Thus the lower triangle is known as the organ of creation from which the universe was created. In the upper triangle the two lower bindu-s mean the sustenance or nourishment and the upper most triangle is the bindu for destruction. These bindu-s are also known as sun, moon and fire possibly indicating sustenance (sun-without which the universe cannot function), sustenance (moon – moon is the symbolic representation of love) and fire (one of the qualities of fire is destruction). This can be in fact compared to the three kūṭa-s of Pañcadasī where the kūṭa-s are also known as agni (fire) kūṭa, Sūrya (sun) kūṭa and Chandra (moon) kūṭa. 

The same interpretation is given in Saundarya Laharī (verse 19) which says, “The one who meditates on your Kāmakalā form, treating your face as the bindu (the upper bindu) and the pair of your bosom (the two lower bindu-s) and the half of the letter H below it (the lower triangle), at once impassions women, is but a triviality.” 

The usage of this Kāmakalā in ṣoḍaśī mantra in an appropriate place will provide early siddhi of the mantra.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment