మైత్రేయ మహర్షి బోధనలు - 32



🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 32 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 21. అప్రమత్తత 🌻

శ్రుతి లేని వీణ సంగీతమునకు పనికిరాదు. అప్రమత్తత లేని సాధన యోగమునకు పనికిరాదు. సరిగ శ్రుతి పెట్టబడిన వీణద్వారా వీచుగాలి వలన కూడ సంగీతములు పలుకును. అప్రమత్తుడైన సాధకుడు తన వంతు కర్తవ్యమును సన్నివేశముల నుండి గొనును. అప్రమత్తుడే సూక్ష్మ గ్రాహి కూడ. అప్రమత్తత బుద్ధిని పదను యందుంచును. మన చుట్టును నున్నవారు అప్రమత్తులై యుండవలెనని మనమా కాంక్షించు చుందుము. అటులనే మనమప్రమత్తులమై యుండవలెనని వారును ఆకాంక్షింతురు కదా! ఇతరులు అప్రమత్తులై యుండవలెనని ఆకాంక్షించుట కన్న తానప్రమత్తుడై యుండుట అవసరము.

సప్తధాతువులతో కూడిన నీ శరీరమను వాయిద్యమును శృతి పెట్టి యుంచుకొనుము. అదియే సాధన, అట్లుంచినచో సూక్ష్మ గ్రాహ్యత్వము కలుగును. వాయుతరంగముల ద్వారా మా నుండి సందేశములు కూడ అందును. మా మాటలు ఆలకించుటకు ఇట్టి అప్రమత్తత అత్యవసరము. అప్రమత్తత నీ సహజ లక్షణము కావలెను. వీణ తీగలను సడలించుట వీణ కపాయకరమని గూడ గుర్తించుము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


24 Nov 2021

No comments:

Post a Comment