4-DECEMBER-2021 శనివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 04, డిసెంబర్ 2021 శనివారం, స్థిర వారము, కార్తీక మాసం 30వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 123 / Bhagavad-Gita - 123 3-04🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 520 / Vishnu Sahasranama Contemplation - 520 🌹
4) 🌹 DAILY WISDOM - 198🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 37🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 104🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 04, డిసెంబర్‌ 2021*
*సూర్య గ్రహణం : ఉ 10.59 గం నుండి మ 3.07 గం వరకు*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 30వ రోజు 🍀*

*నిషిద్ధములు : పగటి ఆహారం*
*దానములు : నువ్వులు, తర్పణలు, ఉసిరి*
*పూజించాల్సిన దైవము : సర్వదేవతలు + పితృ దేవతలు*
*జపించాల్సిన మంత్రము :*
*ఓం అమృతాయ స్వాహా మమ సమస్త పితృదేవతాభ్యో నమః*
ఫలితము : ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,
కార్తీక మాసం
తిథి: అమావాశ్య 13:14:00 
వరకు తదుపరి శుక్ల పాడ్యమి 
నక్షత్రం: అనూరాధ 10:48:21 
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: సుకర్మ 08:40:53 
వరకు తదుపరి ధృతి
కరణం: నాగ 13:13:00 వరకు
వర్జ్యం: 15:42:00 - 17:06:00
దుర్ముహూర్తం: 08:00:52 - 08:45:28
రాహు కాలం: 09:18:55 - 10:42:32
గుళిక కాలం: 06:31:40 - 07:55:18
యమ గండం: 13:29:47 - 14:53:24
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28
అమృత కాలం: 01:40:42 - 03:04:54 
మరియు 24:06:00 - 25:30:00 ?
సూర్యోదయం: 06:31:40
సూర్యాస్తమయం: 17:40:39
వైదిక సూర్యోదయం: 06:35:32
వైదిక సూర్యాస్తమయం: 17:36:47
చంద్రోదయం: 06:18:22
చంద్రాస్తమయం: 17:44:39
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
అమృత యోగం - కార్య సిధ్ది 10:48:21 
వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం 
పండుగలు : మార్గశిర అమావాస్య, 
సూర్యగ్రహణం, Margashirsha Amavasya, 
Surya Grahan
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 123 / Bhagavad-Gita - 123 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 4 🌴*

4. న కర్మణామనారమ్భాత్ 
నైష్కర్యం పురుషోశ్నుతే |
న చ సన్న్యసనాదేవ 
సిద్ధిం సమధిగచ్ఛతి ||

🌷. తాత్పర్యం :
*కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్న్యాసము ద్వారా ఎవ్వరును సంపూర్ణత్వమును పొందలేరు.*

🌷. భాష్యము :
లౌకికజనుల హృదయములను శుద్ధిపరచుట కొరకై విధింపబడినటువంటి విధ్యక్తధర్మములను నియమముగా పాటించి పవిత్రుడైనపుడు మనుజుడు సన్న్యాసమును స్వీకరించుట ద్వారా జయము సిద్ధింపదు. సాంఖ్య తత్త్వవేత్తల ఉద్దేశ్యము ప్రకారము కేవలము సన్న్యాసము స్వీకరించినంతనే (కామ్యకర్మల నుండి విరమించినంతనే ) మనుజుడు నారాయణునితో సమానుడు కాగలడు. కాని శ్రీకృష్ణభగవానుడు ఈ సిద్ధాంతము అంగీకరించుట లేదు. 

హృదయము పవిత్రము కానిదే సన్న్యాసమును స్వీకరించినచో అది కేవలము సాంఘికవ్యవస్థ సంక్షోభమునకే కారణము కాగలదు. కాని ఒకవేళ మనుజడు తన విధ్యుక్తధర్మములను నిర్వర్తింపకున్నను భగవానుని దివ్యసేవను స్వీకరించి తన శక్త్యానుసారము పురోగమించినచో (బుద్ధియోగము) భగవానునిచో ఆమోదింపబడును. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ – అట్టి ధర్మాచరణము కొద్దిగా ఒనరింపబడినను మనుజుని గొప్ప సంకటముల నుండి తరింపజేయగలదు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 123 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 3 - Karma Yoga - 4 🌴*

4. na karmaṇām anārambhān naiṣkarmyaṁ puruṣo ’śnute
na ca sannyasanād eva siddhiṁ samadhigacchati

🌷Translation :
*Not by merely abstaining from work can one achieve freedom from reaction, nor by renunciation alone can one attain perfection.*

🌷 Purport :
The renounced order of life can be accepted when one has been purified by the discharge of the prescribed form of duties which are laid down just to purify the hearts of materialistic men. Without purification, one cannot attain success by abruptly adopting the fourth order of life (sannyāsa). According to the empirical philosophers, simply by adopting sannyāsa, or retiring from fruitive activities, one at once becomes as good as Nārāyaṇa. 

But Lord Kṛṣṇa does not approve this principle. Without purification of heart, sannyāsa is simply a disturbance to the social order. On the other hand, if someone takes to the transcendental service of the Lord, even without discharging his prescribed duties, whatever he may be able to advance in the cause is accepted by the Lord (buddhi-yoga). Sv-alpam apy asya dharmasya trāyate mahato bhayāt. Even a slight performance of such a principle enables one to overcome great difficulties.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 520 / Vishnu Sahasranama Contemplation - 520 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 520. అన్తకః, अन्तकः, Antakaḥ 🌻*

*ఓం అన్తకాయ నమః | ॐ अन्तकाय नमः | OM Antakāya namaḥ*

*అన్తం కరోతి భూతానా మిత్యన్తకః ఉదీరితః ।*
*తత్కరోతి తదాచష్ట ఇతిణిచ్ప్రత్యయేకృతే ॥*

*భూతములకు అంతమును కలిగించునుగనుక, అన్తకః. సాత్వతాం పతిః నామవివరణమునందు తత్కోరితి తదాచష్టే అను పాణిని సూత్రమునుబట్టి, ఈ నామ వివరణయందును అన్త + అక = అన్త్ + అక = అన్తకః అగుచున్నది.*

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
క. మదిఁ దలపోయఁగ జల బు, ద్బుదములు ధరఁ బుట్టి పొలియు పోలిక గల యీ
    త్రిదశాది దేహములలో, వదలక వర్తించు నాత్మవర్గము నోలిన్‍. (1224)
ఆ. ప్రళయవేళ నీవు భరియింతు వంతకుఁ, గారణంబ వగుటఁ గమలనాభ!
     భక్తపారిజాత! భవ భూరి తిమిర ది, నేశ! దుష్టదైత్యనాశ! కృష్ణ! (1225)

*నీళ్ళల్లో బుడగలు పుట్టి నశించిపోయే విధంగా ఆత్మ సమూహం దేవతాదుల దేహాలలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి శరీరాలలో అంతరాత్మవై నీవు వర్తించి ప్రళయ సమయమునందు వాటిని నీలో లీనము చేసుకుంటావు. కృష్ణా! నీవు భక్తుల పాలిటి పారిజాతానివి. భవబంధాలను దూరం చేసేవాడివి. దుష్ట శిక్షకుడవు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 520 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 520. Antakaḥ 🌻*

*OM Antakāya namaḥ*

अन्तं करोति भूताना मित्यन्तकः उदीरितः ।
तत्करोति तदाचष्ट इतिणिच्प्रत्ययेकृते ॥

Antaṃ karoti bhūtānā mityantakaḥ udīritaḥ,
Tatkaroti tadācaṣṭa itiṇicpratyayekr‌te.

*As He brings about the end of all beings, He is Antakaḥ. The 'tatkaroti tadācaṣṭe' rule of pāṇini, as used in the elucidation of the divine name Sāttvatāṃ patiḥ is also applicable here.*

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
प्रमत्तमुच्चैरिति कृत्यचिन्तया प्रवृद्धलोभं विषयेषु लालसम् ।
त्वमप्रमत्तः सहसाभीपद्यसे क्षुल्लेलिहानोऽहिरिवाखुमन्तकः ॥ ६६ ॥

Śrīmad Bhāgavata - Canto 4 Chapter 24
Pramattamuccairiti kr‌tyacintayā pravr‌ddhalobhaṃ viṣayeṣu lālasam,
Tvamapramattaḥ sahasābhīpadyase kṣullelihāno’hirivākhumantakaḥ. 66.

*My dear Lord, all living entities within this material world are mad after planning for things, and they are always busy with a desire to do this or that. This is due to uncontrollable greed. The greed for material enjoyment is always existing in the living entity, but Your Lordship is always alert, and in due course of time You strike him, just as a snake seizes a mouse and very easily swallows him.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 198 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 16. Everyone Loves a Simple Innocent Child 🌻*

*In the journey of spiritual practice, there are many halting places on the way. It is not a direct flight without any stop in between. At the very inception of this endeavour known as spiritual sadhana, there is an upheaval of the powers of aspiration, an innocent longing for God and a confidence that one would reach God—perhaps the same kind of confidence that a child has in catching the moon.*

*The innocence and the credulity do not permit the acceptance of the difficulties involved in this pursuit. There is simplicity, sincerity and honesty coupled with ignorance, and this is practically the circumstance of every spiritual seeker. There is a humble innocence, very praiseworthy, but it is also attended with ignorance of the problems on the path and the difficulties of attaining God.*

*The innocence of childhood is simplicity incarnate. Everyone loves a simple, innocent child, and everyone is happy about a simple, innocent seeker of truth. The Pandavas—we are studying certain implications of the Mahabharata—were innocent children playing with their own cousins, the Kauravas, and they would never have dreamt, even with the farthest stretch of their imaginations, of the forthcoming catastrophes in the life to come.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 37 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
 *సేకరణ : ప్రసాద్ భరద్వాజ *

*🌻 26. ధర్మ యుద్ధము 🌻*

*ధర్మమునకై యుద్ధము తప్పనిసరి. జీవితమున ధర్మము నాచరించపూనితివా, ఘర్షణము అను యుద్ధము జీవితకాల మంతయు నీయందు జరుగుచునేయుండును. ప్రశాంతతకు భంగము వాటిల్లు సంఘటనలు తారసిల్లుచునే యుండును. ధర్మయుద్ధము మొదలైనదని గ్రహించి శాంత చిత్తముతో యుద్ధము జరుపు చుండుము. నీవలె లక్షలాది జీవులు ఈ యుద్ధమున పాల్గొని యున్నారు. ఈ సత్యము నీకు ప్రోత్సాహజనకము. బుద్ధి యోగముతో చక్కని నిర్ణయములు గైకొనుచు సాగిపోవుటయే నీ కర్తవ్యము.*

*జీవన మార్గమున ధర్మాచరణమునకు సత్యమను రెక్కలు ఏర్పడగలవు. అది కారణముగ నీవు అనాయాసముగ ముందుకు సాగగలవు. అట్టి సమయమున గర్వము దరిజేరు అపాయము కలదు. అది నీ నుండి జనించిన కొమ్ములై ఇతరులను బాధ పెట్టగలవు. గర్వమును దరి జేరనీయక దయను పెంపొందించు కొనుచు, మార్గమున సాగవలెను. గర్వము నకిలీ రెక్కలు. వాటిపై ఆధార పడినచో పతనము చెందగలవు. ధర్మము, సత్యము, దయ అను త్రిభుజము నాశ్రయించి ముందుకు సాగినచో విశ్వప్రేమ మార్గమున దైవమును చేరగలవు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 104 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. దేవుడు ఒక ఉనికి కాడు. అనంతమయిన అస్తిత్వరాహిత్యం. అతను వ్యక్తి కాడు. కేవలమయిన శూన్యం. దేవుడు కేవలం ప్రత్యక్షం, అనంతం, అపరిమితం. మనమూ అట్లాంటి వాళ్ళమే. 🍀*

*నీ యథార్థాన్ని అనుభవానికి తెచ్చుకోడానికి ఈ జీవితమొక అవకాశం. నీ వ్యక్తి దైవత్వాన్ని అందుకోకుంటే జీవితం నిష్ఫలం. వ్యక్తి ఆ విషయాన్ని గుర్తించాలి. అది మనిషి జన్మహక్కు. వ్యక్తి దాన్ని అందుకోవాలి. దాని కోసం ప్రయత్నించాలి. దాని పట్ల సృజనాత్మకంగా వుండాలి. ప్రతి అవకాశాన్ని ఎదుగుదలకు ఉపయోగించాలి. మానవత్వాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మానవత్వాన్ని అధిగమించి సాగాలి. దైవత్వంగా మారటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మన యథార్థతత్వమదే.*

*మనిషి కనిపించేంత చిన్నవాడు కాడు. అతను విశాలమయిన వాడు. అనంతవిశాలుడు. సముద్రమంత విశాలుడు. సముద్రానికి సరిహద్దులుంటాయి. మనిషికి సరిహద్దులు లేవు. సముద్రం కూడా మనిషంత విశాలం కాదు. మనిషి విశాలత్వానికి దైవమే సాక్షి. మనిషి వైశాల్యానికి మరో పేరు దైవం. మనం శరీరానికి పరిమితులం కాము. మనసుకు పరిమితులం కాము. మనం ఆ రెంటినీ దాటిన వాళ్ళం.*

*సన్యాసికి సంబంధించిన సమస్త విధానం వుల్లిపాయ పొరలు తీయడం లాంటిది. గుర్తింపుకు సంబంధించిన ఎన్నో పొరలు వుంటాయి. మనం అన్ని పొరల్ని వదిలెయ్యాలి. మెల్లగా మెల్లగా చివరికి ఏమీ మిగలకుండా వదిలెయ్యాలి. ఆ ఏమీలేనితనమే నువ్వు. శూన్యమొకటే విశాలమైంది. పరిమితమయిన దానికి హద్దులుంటాయి. అపరిమితమయిన దానికి హద్దులుండవు. శూన్యమొకటే అనంతమయింది. అందువల్ల దేవుడే అంతిమమయిన శూన్యం. దేవుడు ఒక ఉనికి కాడు. అనంతమయిన అస్తిత్వరాహిత్యం. అతను వ్యక్తి కాడు. కేవలమయిన శూన్యం. దేవుడు కేవలం ప్రత్యక్షం, అనంతం, అపరిమితం. కాబట్టి మనమూ అట్లాంటి వాళ్ళమే. మనం దేవుడి కన్నా వేరు కాము. మనం అనంతంలో భాగాలం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।*
*కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 325-1. 'జగతీకందా' 🌻* 

*లోకములకు మూలము శ్రీమాత అని అర్థము. 'కంద' అనగా మూలము. 'జగతీకందా' అనగా జగత్తునకు మూలము. 'జగత్' అనగా కదలికలు కలది అని అర్థము. నిత్యము కదలునది జగత్తు. జగత్తు నందు మార్పు సహజము. అంతయూ మారుచునే యుండును కాని మారుచున్నట్లు కనిపించదు. అదియే గమ్మత్తు. భూమి తిరుగుచున్నట్లు అనిపించదు. వాతావరణమున మార్పులు ఋతువుల ద్వారా సున్నితముగ జరుగుచుండును. ఏ క్షణమున మార్పు జరిగినదో తెలియదు.*

*బీజము అంకురించుట, వృద్ధి చెందుట, మహా వృక్షముగ పుష్టించుట, ఫలించుట కాలక్రమమున జరుగుచున్ననూ స్థూలముగ తెలియును గాని సూక్ష్మముగ తెలియదు. అట్లే జీవుడు గర్భస్థుడగుట, పుట్టుట, పెరుగుట, బాల్యము, యౌవనము నడిమి వయస్సు, వార్థక్యము వంటి మార్పులు ఏ క్షణమున జరుగు చున్నవో స్థూలబుద్ధికి తెలియదు. పగలు రాత్రి అగుట, రాత్రి పగలు అగుట కూడ స్థూలముగనే గుర్తించుచున్నాము. ఇట్లు సమస్తము మార్పు చెందుచుండగ సృష్టి గమనము తెలియుటకు మేధావులు సహితము తలక్రిందులగు చుందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 325-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 325-1. Jagatī -kandā जगती -कन्दा (325) 🌻*

*She is the cause of the universe. The cause for the origin of the universe is attributed to the Brahman. Her Brahmanic stature is repeatedly emphasized in this Sahasranāma through various attributes. She is ‘prakāśa vimarśa mahā māyā svarūpinī’ by which She creates the universe.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment