నిర్మల ధ్యానాలు - ఓషో - 104


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 104 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దేవుడు ఒక ఉనికి కాడు. అనంతమయిన అస్తిత్వరాహిత్యం. అతను వ్యక్తి కాడు. కేవలమయిన శూన్యం. దేవుడు కేవలం ప్రత్యక్షం, అనంతం, అపరిమితం. మనమూ అట్లాంటి వాళ్ళమే. 🍀

నీ యథార్థాన్ని అనుభవానికి తెచ్చుకోడానికి ఈ జీవితమొక అవకాశం. నీ వ్యక్తి దైవత్వాన్ని అందుకోకుంటే జీవితం నిష్ఫలం. వ్యక్తి ఆ విషయాన్ని గుర్తించాలి. అది మనిషి జన్మహక్కు. వ్యక్తి దాన్ని అందుకోవాలి. దాని కోసం ప్రయత్నించాలి. దాని పట్ల సృజనాత్మకంగా వుండాలి. ప్రతి అవకాశాన్ని ఎదుగుదలకు ఉపయోగించాలి. మానవత్వాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మానవత్వాన్ని అధిగమించి సాగాలి. దైవత్వంగా మారటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మన యథార్థతత్వమదే.

మనిషి కనిపించేంత చిన్నవాడు కాడు. అతను విశాలమయిన వాడు. అనంతవిశాలుడు. సముద్రమంత విశాలుడు. సముద్రానికి సరిహద్దులుంటాయి. మనిషికి సరిహద్దులు లేవు. సముద్రం కూడా మనిషంత విశాలం కాదు. మనిషి విశాలత్వానికి దైవమే సాక్షి. మనిషి వైశాల్యానికి మరో పేరు దైవం. మనం శరీరానికి పరిమితులం కాము. మనసుకు పరిమితులం కాము. మనం ఆ రెంటినీ దాటిన వాళ్ళం.

సన్యాసికి సంబంధించిన సమస్త విధానం వుల్లిపాయ పొరలు తీయడం లాంటిది. గుర్తింపుకు సంబంధించిన ఎన్నో పొరలు వుంటాయి. మనం అన్ని పొరల్ని వదిలెయ్యాలి. మెల్లగా మెల్లగా చివరికి ఏమీ మిగలకుండా వదిలెయ్యాలి. ఆ ఏమీలేనితనమే నువ్వు. శూన్యమొకటే విశాలమైంది. పరిమితమయిన దానికి హద్దులుంటాయి. అపరిమితమయిన దానికి హద్దులుండవు. శూన్యమొకటే అనంతమయింది. అందువల్ల దేవుడే అంతిమమయిన శూన్యం. దేవుడు ఒక ఉనికి కాడు. అనంతమయిన అస్తిత్వరాహిత్యం. అతను వ్యక్తి కాడు. కేవలమయిన శూన్యం. దేవుడు కేవలం ప్రత్యక్షం, అనంతం, అపరిమితం. కాబట్టి మనమూ అట్లాంటి వాళ్ళమే. మనం దేవుడి కన్నా వేరు కాము. మనం అనంతంలో భాగాలం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


04 Dec 2021

No comments:

Post a Comment