✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 26. ధర్మ యుద్ధము 🌻
ధర్మమునకై యుద్ధము తప్పనిసరి. జీవితమున ధర్మము నాచరించపూనితివా, ఘర్షణము అను యుద్ధము జీవితకాల మంతయు నీయందు జరుగుచునేయుండును. ప్రశాంతతకు భంగము వాటిల్లు సంఘటనలు తారసిల్లుచునే యుండును. ధర్మయుద్ధము మొదలైనదని గ్రహించి శాంత చిత్తముతో యుద్ధము జరుపు చుండుము. నీవలె లక్షలాది జీవులు ఈ యుద్ధమున పాల్గొని యున్నారు. ఈ సత్యము నీకు ప్రోత్సాహజనకము. బుద్ధి యోగముతో చక్కని నిర్ణయములు గైకొనుచు సాగిపోవుటయే నీ కర్తవ్యము.
జీవన మార్గమున ధర్మాచరణమునకు సత్యమను రెక్కలు ఏర్పడగలవు. అది కారణముగ నీవు అనాయాసముగ ముందుకు సాగగలవు. అట్టి సమయమున గర్వము దరిజేరు అపాయము కలదు. అది నీ నుండి జనించిన కొమ్ములై ఇతరులను బాధ పెట్టగలవు. గర్వమును దరి జేరనీయక దయను పెంపొందించు కొనుచు, మార్గమున సాగవలెను. గర్వము నకిలీ రెక్కలు. వాటిపై ఆధార పడినచో పతనము చెందగలవు. ధర్మము, సత్యము, దయ అను త్రిభుజము నాశ్రయించి ముందుకు సాగినచో విశ్వప్రేమ మార్గమున దైవమును చేరగలవు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
04 Dec 2021
No comments:
Post a Comment