నిత్య ప్రజ్ఞా సందేశములు - 263 - 19. ప్రజలను పరిపాలన చేయడానికి ప్రజలు చట్టాన్ని రూపొందించారు / DAILY WISDOM - 263 - 19. People Make the Law to Administer People


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 263 / DAILY WISDOM - 263 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 19. ప్రజలను పరిపాలన చేయడానికి ప్రజలు చట్టాన్ని రూపొందించారు 🌻


'సమాజం' అనే పదం స్థూలంగా, వారి ఉమ్మడి భావజాలం, సాంస్కృతిక విలువలు, మతపరమైన దృక్పథం మరియు సంబంధ బాంధవ్యాలు కారణంగా ఒక సమూహం కలిసి రావడం తప్ప మరొకటి కాదు. ప్రశ్న ఏమిటంటే: సమాజం అంటే ప్రతి మానవుని వ్యక్తిగత వ్యక్తిత్వ సమాహారమా లేదా సామూహిక అభౌతిక బంధమా? వారి భాగస్వామ్య సభ్యులు భౌగోళికంగా ఒకరికొకరు దూరంగా జీవించినప్పటికి వారు ఒక సమాజంగా వ్యవహరించ గల్గుతారు. కానీ ఒకే గదిలో కూర్చున్న వ్యక్తుల సమూహం సైతం వారి మధ్య ఒక సామూహిక కారణం లేకపోతే సమాజం అనిపించుకోదు.

వాస్తవానికి, సామూహిక సిద్ధాంతం మాత్రమే సమాజం అని పిలవబడేది, కేవలం వ్యక్తులు కాదు. రైల్వే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నపటికీ వారు ఒక సమాజంగా పిలవబడరు. అలాంటప్పుడు సమాజం అంటే ఏమిటి? ఒక సమాజం తనకి తాను ప్రభుత్వం వంటి పరిపాలనా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు మరియు ప్రజల జీవితాన్ని మరియు ప్రవర్తనను సిద్ధాంతపరంగా నిరోధించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి చట్టాలు మరియు నియమాలను రూపొందించవచ్చు. ఎవరిని పరిపాలించడానికి చట్టాన్ని ఎవరు చేస్తారు? ప్రజలను పరిపాలించేందుకే ప్రజలు చట్టం చేస్తారని స్పష్టమవుతోంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 263 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 19. People Make the Law to Administer People 🌻


The word ‘society', for all outward look, would just mean nothing more than a group of people come together on account of their common ideology, cultural values, religious outlook and kindred characteristics which unite them as a bond commonly linking them into the pattern of a whole. The question is: Does society consist of individual personalities, as human beings, or does it consist of the bond mentioned, which is ideational? A society of people can be there even if their constituent members happen to live geographically away from one another, but even a group of people sitting in a single room may not form a society if among them there is nothing to call a common cause.

Actually, the common cause is what can be called society, and not merely the persons. A large number of people travelling in a railway compartment do not necessarily form a society. What then is society? A society can constitute itself into an administrative organisation, such as a government, and frame laws and rules to restrain and order the life and conduct of people. Who makes the law to administer whom? It is clear that people make the law to administer people.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Apr 2022

No comments:

Post a Comment