మైత్రేయ మహర్షి బోధనలు - 102


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 102 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 82. చికాకు -1 🌻


నీకు కలుగు చికాకు రెండు రకములు. జీవుడుగ నిన్ను నీవు ఉద్ధరించు కొనలేకపోవుట వలన నీపై నీకు చిరాకు కలుగ వచ్చును. ఇది సాధకునకు సామాన్యము. సాధకుడు తన స్వభావముపై స్వామిత్వమునకు ప్రయత్నించు చుండును. తరచూ విఫలుడగు చుండును. వైఫల్యము నుండి చిరాకు పుట్టును. చిరాకు నుండి విషము పుట్టును. ప్రాణాయామము, వెలుగును గూర్చిన ధ్యానము పై విషమును హరింపగలవు. సాధకుని నుండి పుట్టు విషమున కిదియే ఔషధము.

దివ్య ధ్యానమునకు గాని, ప్రాణాయామమునకు గాని ఒగ్గని చిరాకేర్పడినచో అది సాధన కపాయకరము. అపుడు సత్సంగమే శరణ్యము. నిత్యము ఈ రెండింటిని సాధన చేయువారితో కూడి చేసుకొను ప్రయత్నము ఉండవలెను. ఈ విషయమున కూడ అలసత్వ మేర్పడినచో సాధకునికిక సాధన సాగదు. విష మతనిని హరించును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


11 Apr 2022

No comments:

Post a Comment