నిర్మల ధ్యానాలు - ఓషో - 163


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 163 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అహంతో అతుక్కుని వుండడం వల్ల మనకు అల్పత్వ మేర్పడింది. అహం చాలా చిన్ని విషయం. ఒకసారి నీ అహాన్ని వదిలిపెడితే నువ్వు చుక్కల్తో, సూర్యుడితో, చంద్రుడితో, చెట్లతో మనుషుల్లో సంబంధం ఏర్పరుచుకుంటావు. నీ సరిహద్దులు అదృశ్యమవుతాయి. 🍀

మనమెంత అల్పులమంటే మనం మన అహానికి అతుక్కుని వుంటాం. అహంతో అతుక్కుని వుండడం వల్ల మనకు అల్పత్వ మేర్పడింది. అహం చాలా చిన్ని విషయం. మన తెలివితక్కువ వల్ల దానికి అతుక్కునిపోతాం. అదెంతో విలువైందని, బలమైందని భ్రమప పడతాం. అది కేవలం అడ్డుకట్ట. అది జీవితంలో గుర్తింపును, కీర్తి ప్రతిష్టల్ని తెస్తుందని నిన్ను మభ్యపరుస్తుంది.

సమస్తంతో నిన్ను వేరు చేసే పల్చటి పొర అది పెళుసయిన గోడ. ఒకసారి నీ అహాన్ని వదిలిపెడితే నువ్వు చుక్కల్తో, సూర్యుడితో, చంద్రుడితో, చెట్లతో మనుషుల్లో సంబంధం ఏర్పరుచుకుంటావు. హఠాత్తుగా అడ్డు తెర తొలిగిపోతుంది. అప్పుడు నువ్వు కేవలమొక మంచుబిందువు మాత్రమే కావు. నీ సరిహద్దులు అదృశ్యమవుతాయి. నువ్వు పరిధులు లేని విస్తృతమవుతావు. అదే దేవుడికి సంబంధించిన అనుభవం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


11 Apr 2022

No comments:

Post a Comment