2) 🌹 కపిల గీత - 21 / Kapila Gita - 21🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 61 / Agni Maha Purana - 61🌹
4) 🌹. శివ మహా పురాణము - 577 / Siva Maha Purana - 577🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 196 / Osho Daily Meditations - 196🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 378 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 378-2 🌹
*🌹. ఆత్మ ప్రయాణం - భగవంతుడిగా మారడమే లక్ష్యం - Soul journey - The goal is to become God 🌹*
*✍️. ప్రసాద్ భరధ్వాజ.*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య పంచాగము - Daily Panchagam 10, June 2022, శుభ శుక్రవారం, భృగు వాసరే 🌹*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : నిర్జల ఏకాదశి, Nirjala Ekadashi 🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 1 🍀*
*1. ఓం శ్రీలక్ష్మి శ్రీమహాలక్ష్మి క్షీరసాగరకన్యకే*
*ఉత్తిష్ఠ హరిసమ్ప్రీతే భక్తానాం భాగ్యదాయిని ||*
*ఉత్తిష్ఠోత్తిష్ఠ శ్రీలక్ష్మి విష్ణువక్షస్థలాలయే*
*ఉత్తిష్ఠ కరుణాపూర్ణే లోకానాం శుభదాయిని ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మానవుడు ఎన్ని రకముల బాహ్యమైన పూజలు చేసిననూ హృదయమును శుద్ధి చేసుకోనిదే సత్పురుషుడు కాలేడు. - మాస్టర్ ఆర్.కె. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల-దశమి 07:27:51 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: చిత్ర 27:37:43 వరకు
తదుపరి స్వాతి
యోగం: వరియాన 23:35:38 వరకు
తదుపరి పరిఘ
కరణం: గార 07:24:51 వరకు
వర్జ్యం: 12:10:20 - 13:43:00
దుర్ముహూర్తం: 08:18:50 - 09:11:26
మరియు 12:41:49 - 13:34:25
రాహు కాలం: 10:36:54 - 12:15:31
గుళిక కాలం: 07:19:40 - 08:58:17
యమ గండం: 15:32:45 - 17:11:22
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41
అమృత కాలం: 21:26:20 - 22:59:00
సూర్యోదయం: 05:41:03
సూర్యాస్తమయం: 18:49:59
చంద్రోదయం: 14:40:22
చంద్రాస్తమయం: 02:02:38
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కన్య
ముసల యోగం - దుఃఖం 27:37:43
వరకు తదుపరి గద యోగం -
కార్య హాని , చెడు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 21 / Kapila Gita - 21🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. సాధువు లక్షణములు - 1 🌴*
*21. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినామ్*
*అజాతశత్రవః శాన్తాః సాధవః సాధుభూషణాః*
*తితిక్షవః - ఓర్పు, క్షమ. ఎదుటివారి దుఃఖాలను చూచి సహించ లేక పోవుట కరుణ అంటాము. శత్రువు లేని వారు, అంతరింద్రియ నిగ్రహం కలిగిన వారు సాధువులు, సజ్జనులందరికీ అలంకారము.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 21 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 The Symptoms of a Sadhu - 1 🌴*
*21. titiksavah karunikah suhrdah sarva-dehinam*
*ajata-satravah santah sadhavah sadhu-bhusanah*
*The symptoms of a sadhu are that he is tolerant, merciful and friendly to all living entities. He has no enemies, he is peaceful, he abides by the scriptures, and all his characteristics are sublime.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 577 / Sri Siva Maha Purana - 577 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴*
*🌻. శివ విహారము - 4 🌻*
శంభునకు అభిమతమగు విహారమును అడ్డగించగల సమర్థుడు ఇచట ఎవరున్నారు? వేయి సంవత్సరముల తర్వాత ఆయన స్వేచ్ఛచే విరమించగలడు(28).
స్త్రీ పురుషుల విహారమునకు ఉపాయము పన్ని భంగమును కలిగించు వానికి జన్మ జన్మలయందు భార్యాపుత్రుల వియోగము కలుగును (29). అట్టి పాపి భ్రష్టమైన జ్ఞానము గలవాడై, నశించిన కీర్తి గలవాడై, తొలగిన సంపదలు గలవాడై ఇహలోకములో దుఃఖములను పొంది, దేహత్యాగము తరువాత లక్షసంవత్సరములు కాలసూత్రమను నరకమును పొందును (30).
దుర్వాస మహర్షి ఈ ఇంద్రుడు రంభతో విహరించు చుండగా విఘ్నమును కలిగించి భార్యా వియోగమును పొందెను (31). ఆతడు మరియొక స్త్రీతో పాణి గ్రహణము చేసి తొలగిన విరహ జ్వరము గలవాడై వేయి దివ్యసంవత్సరములు రమించెను (32). కాముడు ఘృతాచితో కూడి యుండగా అడ్డుపడిన బృహస్పతి యొక్క భార్యను ఆరు మాసముల లోపులో చంద్రుడు అపహరించెను (33). ఆయన మరల శివుని ఆరాధించి యుద్ధమును చేసి గర్భవతి యగు తారను పొంది విరహజ్వరమును తొలగించుకొనెను (34).
గౌతమ మహర్షిమోహినితో కూడి యున్న చంద్రుని విహారమునకు భంగమును కలిగించగా, ఆయనకు స్త్రీ వియోగము కలిగెను (35). హరిశ్చంద్రుడు రైతుదంపతులకు వియోగమును కలిగించి నిర్జన స్థానమునకు పంపగా ఆతనికి లభించిన ఫలమును వినుము (36). భార్యను, పుత్రుని, రాజ్యమును పోగొట్టుకొని విశ్వామిత్రునిచే పీడింపబడెను. ఆతడు తరువాత శివుని ఆరాధించి ఆ పాపమును పొగొట్టుకొనెను (37). శివుడు వేయి దివ్యసంవత్సరములు రమించును. ఓ దేవతాశ్రేష్ఠురాలా! వేయి సంవత్సరములు కాగానే అచటకు వెళ్లుడు (38).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 577 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴*
*🌻 The dalliance of Śiva - 4 🌻*
28. If the enjoyment is desired by Śiva who can check it? When another thousand years are completed He will desist from it, out of his own will.
29. If any one separates the copulated pair by a tricky expedient, he will have the pangs of separation from his wife and sons in every birth.
30. He will fall from perfect wisdom. His glory will be destroyed. He will lose his fortune. That sinner after his death will suffer the tortures of the hell Kālasūtra[5] for a hundred thousand years.
31. The sage Durvāsas[6] separated Indra in copulation with Rambhā[7] and the sage got separation from his wife as a result thereof.
32. He took another woman as his wife and thus put an end to the pangs of separation lasting for a thousand years of the gods.
33. Bṛhaspati hindered Kāma in copulation with Ghṛtācī[8] but within six months the moon abducted his wife.
34. He then propitiated Śiva, fought a battle over Tārā, enjoyed her even as she was pregnant and tried to dispel his pangs of separation.
35. The sage Gautama forced the moon in the company of Rohiṇī to desist from sexual dalliance and he suffered the pangs of separation from his wife.
36-37. Hariścandra expelled a ploughman in copulation with a Śūdra woman, to wander in a lonely forest. Listen to the effect thereof. He lost his wife, son and kingdom. He was tarmented by Viśvāmitra. It was only after propitiating Śiva that he could get released from that sin.
38. Though Ajāmila,[9] a noble brahmin, was in copulation with a Śūdra woman, gods did not interfere due to this fear.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 61 / Agni Maha Purana - 61 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 23*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. ఆదిమూర్త్యాది పూజావిధి -2 🌻*
జలకుంభమును ఎడమ వైపునను, పూజాద్రవ్యములను కుడి వైపునను ఉంచవలెను. అస్త్రముచే ప్రక్షాళనచేసి గంధపుష్పాన్వితము నైన అర్ఘ్యములను ఉంచవలెను. సర్వవ్యాప్తము, జ్యోతిఃస్వరూపము అయిన చైతన్యములను "అస్త్రాయఫట్" అని అభిమంత్రించిన, ఉదరముచే యోగబీజము నడిపి. హరిని ధ్యానించి, పూర్వాదియోగ పీఠము నందు ధర్మమును.
వైరాగ్యమున, ఐశ్వర్యమును, ఆగ్నేయదిక్కు మొదలైన వాటిని, ఆధర్మము మొదలగు అంగములకు, పీఠమునందు కూర్మమును, అనంతుని, యముని, సూర్యాదుల మండలములను, విమల మొదలగు కేసరస్థానము నందున్న గ్రహణములను, కర్ణిక (ఈ పద్మము మధ్యనున్న దుద్దు యందున్న గ్రహణములనుముందు తన హృదయము నందు ధ్యానము చేసి పిమ్మట మండలము పై ఆవాహనము చేసి అర్చించవలెను.
వైష్ణవ విద్యానుసారముగా అర్ఘ్య-పాద్య- ఆచమన - మధుపర్క - స్నాన, వస్త్ర - యజ్ఞోపవీత - అలంకార - గంధ - పుష్ప - ధూప - దీప- నైవేద్యములను సమర్పింపవలెను. పూర్వాది దిక్కులందు అంగదేవతలను పూజించవలెను. తూర్పు-పడమర దిక్కులందు గరుత్మ తుని, కుడివైపున చక్రమును, గదను, ఎడమవైపున శంఖమును, ధనస్సును ఉంచవలెను దేవుని ఎడమవైపున అంబుల పొదులను, కుడివైపున ఖడ్గమును. ఎడమ వైపున డాలును ఉంచవలెను. కుడి వైపున అగ్రభాగమున పుష్టిని ఉంచవలెను. 9-16
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 61 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 23*
*🌻 Mode of performing worship - 2🌻*
9. Having placed the water-jar on the left and the materials for worship on the right and having washed (them) with the implements and water offerings, they are placed together with flowers and scents.
10-11. Having sprinkled the radiant (form) of consciousness and omnipresence with waters (purified) by the repetition (of the mantra of the lord) eight times (and) having sprinkled the hand with mantra ending with phaṭ and then having meditated on Hari, with his face directed towards the (southeast) direction (presided over by) Agni, (one has to pray) for virtue, knowledge, detachment, (and) supremacy. (Facing) the east (and other directions), (one has to get rid) of his sins and physical impurities remaining in yogic postures.
12. (Remaining) in Kūrma (tortoise) posture, one should adore Ananta, Yama, the solar and other luminous regions and other planets (occupying) the filament and pericarp (of the lotus).
13-14. Having first meditated (on them) in one’s heart and having invoked and worshipped in a circle, (offerings) of waters of respect, waters for washing feet, waters for rinsing, madhuparka[1] (respectful offering), bath, cloth, sacred thread, scents, flowers, incense, lamp and eatables (are made) (along) with the formula (known as) Puṇḍarīkākṣa.
15. First, one has to worship the limbs and then Brahmā at the doorway in the eastern (direction), the disc and the club in the southern (direction); the conch, and the bow have to be assigned in the corner (governed by) the moon.
16. One should assign the quiver and sword to the left and right side of the deity, the armour and nourishment on the left, and the prosperity on the right in front.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 196 / Osho Daily Meditations - 196 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 196. తటస్థ బిందువు 🍀*
*🕉. ఎత్తుపల్లాలకు అలవాటు పడ్డాం: పైకి ఉన్నప్పుడు మంచిగా, కిందకు దిగినప్పుడు చెడుగా అనిపిస్తుంది. కానీ మధ్యలో పైకి లేదా క్రిందికి లేని మధ్య బిందువు; అది తటస్థ అంశం. 🕉*
*కొన్నిసార్లు ఈ తటస్థ బిందువు చాలా భయానకంగా ఉంటుంది, ఎందుకంటే ఒకరు చెడుగా భావిస్తే సమస్య ఏమిటో తెలుసు; ఒకరికి మంచిగా అనిపిస్తే సమస్య ఏమిటో తెలుస్తుంది. కానీ మీరు రెండూ అనుభూతి చెంద లేనప్పుడు, వారు కేవలం ఒక రకమైన అస్థిరత్వంలో ఉంటారు మరియు భయపడతారు. కానీ ఆ బిందువు చాలా అందంగా ఉంటుంది. మీరు దానిని అంగీకరించ గలిగితే, ఆ బిందువు మీ జీవితం గురించి మీకు అపారమైన అంతర్దృష్టిని ఇస్తుంది. మీరు పైకి ఉన్నప్పుడు, అది మిమ్మల్ని కలవర పెడుతుంది; సుఖ సంతోషాలు ఉష్ణాన్ని, ఉత్సాహాన్ని తెస్తాయి. మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు, మళ్లీ మీరు ప్రతికూల మార్గంలో కలవరపడతారు. మీరు పైకి ఉన్నప్పుడు, మీరు ఆ స్థితిని అంటి పెట్టుకుని ఉండాలను కుంటున్నారు; మీరు పడిపోయినప్పుడు మీరు దాని నుండి బయట పడాలను కుంటున్నారు.*
*పని చేయడానికి మరియు నిమగ్నమై ఉండటానికి ఏదో ఉంది, కానీ మీరు మధ్యలో ఉన్నప్పుడు, అన్ని ఉష్ణ శీతలాలు పోయాయి; అది సున్నా బిందువు, శూన్యము. నిశ్శబ్దంగా ఉన్నందున ఆ జీరో పాయింట్ ద్వారా ఒకరు తన గురించి అపారమైన అంతర్దృష్టిని కలిగి ఉంటారు. ఆనందం లేదు, దుఃఖం లేదు, కాబట్టి ఏ రకమైన శబ్దం లేదు, పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. బుద్ధుడు తన శిష్యులందరితో తన పనిలో ఈ అంశాన్ని చాలా లోతుగా ఉపయోగించాడు. ఇది తప్పనిసరి, ప్రతి ఒక్కరూ మొదట దాన్ని సాధించాలి, ఆపై నిజమైన పని ప్రారంభము అవుతుంది. అతను దానిని ఉపేక్ష అని పిలుస్తాడు - తటస్థతకు మరొక పేరు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 196 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 196. ZERO POINT 🍀*
*🕉 We have become accustomed to ups and downs: When we are up, we feel good, when we are down we feel bad. But just in the middle is a point that is neither up nor down; that is the neutral point. 🕉*
*Sometimes the neutral point is very frightening, because if one feels bad one knows what the case is; if one feels good one knows what is the case. But when one cannot feel either, one is simply in a kind of limbo and one is afraid. But that point is very beautiful. If you can accept it, that point will give you immense insight into your life. When you are up, the up disturbs you; ail pleasures bring fever, excitement. And when you are down, again you are disturbed in a negative way. When you are up, you want to cling to that state; when you are down you want to get out of it.*
*Something is there to work on and to remain occupied with, but when you are just in the middle, all fever is gone; it is a zero point. Through that zero point one can have immense insight into oneself because all is silent. There is no happiness, there is no unhappiness, so there is no noise of any kind, there is utter quiet. Buddha used this point very deeply in his work with all his disciples. It was a must, everybody had to attain it first, and then the real work started. He calls it upeksha-another name for neutrality.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 378-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 378-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*
*🌻 378-2. 'జాలంధర స్థితా’ 🌻*
*ఇందలి రహస్య మేమనగా జలంధరుడు శ్రీమాత జాలము. ఆ జాలము నెఱిగినవాడు ఆమె గాక పరమ శివుడొక్కడే అని అర్థము. శ్రీమాత ఈ జాలము వలననే జీవులు మాయకు లోనై తాము ఇతరులు అన్న భావముతో పరస్పరత్వమున అనేకానేక అనుభూతులను చెందుచున్నారు. మనయందు జలపీఠమైన మణిపూరకమును అధిష్ఠించి శ్రీమాత యున్నది. ముందు నామమున హృదయ పీఠము తెలుపబడినది.*
*ఈ నామమున మణిపూరక పీఠము నందున్న 'జాలంధరీదేవి'గా శ్రీమాత వర్ణింపబడినది. నీరు కారణముగ వున్నది వక్రస్థితి చెందుట, కదలనిది కదలుచున్నట్లుగ కనబడుట ఇత్యాదివి జరుగును కదా! మనస్సు యందు కలుగు భ్రమలకు, భ్రాంతులకు, అపోహలకు కారణము జాలంధర పీఠమున ప్రజ్ఞ నిలచి యుండుటయే. చంచల మనస్కులందరూ ఇందే బంధింపబడి యుందురు. జాలంధరీ దేవిని తెలిసి పూజించినవారు ఈ అవస్థితిని శ్రీమాత అనుగ్రహముచే దాటుదురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 378 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*
*🌻 378. Jālandhara-sthitā जालन्धरा-स्थिता 🌻*
*A reference is invited to jālandhara pīṭha or the heart cakra, where the sound is further refined, to become madhyama, the penultimate stage of sound before its actual delivery. This is one of Her Śabda Brahman forms.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఆత్మ ప్రయాణం - భగవంతుడిగా మారడమే లక్ష్యం - Soul journey - The goal is to become God 🌹*
*✍️. ప్రసాద్ భరధ్వాజ.*
*☘️. మనం పుడతాము, మరణిస్తాము, కానీ ఇదేనా మన మొత్తం జీవితం? మరణంతో మొత్తం ముగిసి పోతుందా? కాదు. ఇది ఒక చిన్న భాగం మాత్రమే. మనం ఈ శరీరం కాదు, జీవాత్మలం అనే విషయం సదా గుర్తుంచుకోవాలి. ఈ పరిధిని దాటి కూడా ఉన్న భగవంతుని యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన అణు అంశలం. పరమ భగవంతుని యొక్క శాశ్వతమైన సేవకులం. ఇది గుర్తించి భౌతిక పరిధిని దాటి కూడా భగవంతుని సేవించ గలిగే విధంగా జీవన సాధన చేస్తూ, భగవద్దామానికి పూర్ణాత్మగా తిరిగి వెళ్లడమే జీవితం యొక్క లక్ష్యం. ఇది మొత్తం ఆత్మ ప్రయాణం - భగవంతుడిగా మారడమే లక్ష్యం. - ఇదే జీవిత సాఫల్యత. ☘️*
*☘️ We are born and die, but is this our whole life? Does death end the whole thing? No. This is only a small part of whole Life journey. We must always remember that we are not only the body, but the spirit having life beyond this range and subtle atomic elements of God. Eternal servants of the Supreme Lord. Recognizing this, the goal of life is to practice life in such a way that one can serve God even beyond the physical realm and able to return as Supreme Soul to Divine Adobe. This is the whole Soul journey - the goal is to become God. ☘️*
*✍️ Prasad Bhardwaj.*
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment