శ్రీ శివ మహా పురాణము - 577 / Sri Siva Maha Purana - 577


🌹 . శ్రీ శివ మహా పురాణము - 577 / Sri Siva Maha Purana - 577 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴

🌻. శివ విహారము - 4 🌻


శంభునకు అభిమతమగు విహారమును అడ్డగించగల సమర్థుడు ఇచట ఎవరున్నారు? వేయి సంవత్సరముల తర్వాత ఆయన స్వేచ్ఛచే విరమించగలడు(28).

స్త్రీ పురుషుల విహారమునకు ఉపాయము పన్ని భంగమును కలిగించు వానికి జన్మ జన్మలయందు భార్యాపుత్రుల వియోగము కలుగును (29). అట్టి పాపి భ్రష్టమైన జ్ఞానము గలవాడై, నశించిన కీర్తి గలవాడై, తొలగిన సంపదలు గలవాడై ఇహలోకములో దుఃఖములను పొంది, దేహత్యాగము తరువాత లక్షసంవత్సరములు కాలసూత్రమను నరకమును పొందును (30).

దుర్వాస మహర్షి ఈ ఇంద్రుడు రంభతో విహరించు చుండగా విఘ్నమును కలిగించి భార్యా వియోగమును పొందెను (31). ఆతడు మరియొక స్త్రీతో పాణి గ్రహణము చేసి తొలగిన విరహ జ్వరము గలవాడై వేయి దివ్యసంవత్సరములు రమించెను (32). కాముడు ఘృతాచితో కూడి యుండగా అడ్డుపడిన బృహస్పతి యొక్క భార్యను ఆరు మాసముల లోపులో చంద్రుడు అపహరించెను (33). ఆయన మరల శివుని ఆరాధించి యుద్ధమును చేసి గర్భవతి యగు తారను పొంది విరహజ్వరమును తొలగించుకొనెను (34).

గౌతమ మహర్షిమోహినితో కూడి యున్న చంద్రుని విహారమునకు భంగమును కలిగించగా, ఆయనకు స్త్రీ వియోగము కలిగెను (35). హరిశ్చంద్రుడు రైతుదంపతులకు వియోగమును కలిగించి నిర్జన స్థానమునకు పంపగా ఆతనికి లభించిన ఫలమును వినుము (36). భార్యను, పుత్రుని, రాజ్యమును పోగొట్టుకొని విశ్వామిత్రునిచే పీడింపబడెను. ఆతడు తరువాత శివుని ఆరాధించి ఆ పాపమును పొగొట్టుకొనెను (37). శివుడు వేయి దివ్యసంవత్సరములు రమించును. ఓ దేవతాశ్రేష్ఠురాలా! వేయి సంవత్సరములు కాగానే అచటకు వెళ్లుడు (38).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 577 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴

🌻 The dalliance of Śiva - 4 🌻


28. If the enjoyment is desired by Śiva who can check it? When another thousand years are completed He will desist from it, out of his own will.

29. If any one separates the copulated pair by a tricky expedient, he will have the pangs of separation from his wife and sons in every birth.

30. He will fall from perfect wisdom. His glory will be destroyed. He will lose his fortune. That sinner after his death will suffer the tortures of the hell Kālasūtra[5] for a hundred thousand years.

31. The sage Durvāsas[6] separated Indra in copulation with Rambhā[7] and the sage got separation from his wife as a result thereof.

32. He took another woman as his wife and thus put an end to the pangs of separation lasting for a thousand years of the gods.

33. Bṛhaspati hindered Kāma in copulation with Ghṛtācī[8] but within six months the moon abducted his wife.

34. He then propitiated Śiva, fought a battle over Tārā, enjoyed her even as she was pregnant and tried to dispel his pangs of separation.

35. The sage Gautama forced the moon in the company of Rohiṇī to desist from sexual dalliance and he suffered the pangs of separation from his wife.

36-37. Hariścandra expelled a ploughman in copulation with a Śūdra woman, to wander in a lonely forest. Listen to the effect thereof. He lost his wife, son and kingdom. He was tarmented by Viśvāmitra. It was only after propitiating Śiva that he could get released from that sin.

38. Though Ajāmila,[9] a noble brahmin, was in copulation with a Śūdra woman, gods did not interfere due to this fear.


Continues....

🌹🌹🌹🌹🌹


10 Jun 2022

No comments:

Post a Comment