ఓషో రోజువారీ ధ్యానాలు - 292. ముసుగులు / Osho Daily Meditations - 292. MASKS
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 292 / Osho Daily Meditations - 292 🌹
✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 292. ముసుగులు 🍀
🕉. మీరు ఏమి చేస్తున్నా, కేవలం స్పృహతో ఉండండి. మీరు ముసుగు ధరించినట్లయితే, స్పృహతో ఉండండి; తెలిసి ధరించండి. ఇది తెలియకుండా జరిగే విషయం కాకూడదు. 🕉
మీరు విచారంగా ఉన్నారనుకోండి. అలాంటప్పుడు ఎవరైనా మీ వద్దకు వచ్చినప్పుడు కూడా మీరు విచారాన్ని కొనసాగిస్తే, మీరు అతనిని కూడా బాధ పెట్టిన వారవుతారు. మీ విచారానికి అతను ఏమీ చేయలేదు కదా. అతను ఏ విధంగానూ దానికి అర్హత పొందలేదు, కాబట్టి అతన్ని అనవసరంగా విచారించేలా చేయడం ఎందుకు? మీరు చిరునవ్వుతో మాట్లాడండి మరియు ఇది కేవలం ఒక ముసుగు అని బాగా తెలుసుకుని మీరు దానిని నిర్వహించండి. మీ స్నేహితుడు వెళ్లిన తర్వాత మీరు మళ్లీ విచారంగా ఉండండి. అది కేవలం సామాజిక లాంఛనమే. మీరు దీన్ని స్పృహతో ఉపయోగిస్తే సమస్య లేదు. మీకు గాయం ఉంటే, అందరికీ వెళ్లి చూపించాల్సిన అవసరం లేదు; అది వారి వ్యవహారం కాదు. మీ గాయం గురించి వారి మనస్సులలో ఎందుకు దుఃఖం సృష్టించాలి? మీరు ప్రదర్శించే వారిగా ఎందుకు ఉండాలి? అది అక్కడ ఉండనివ్వండి; దానిని జాగ్రత్తగా చూసుకోండి. గాయాన్ని నయం చేయడానికి ప్రయత్నించండి.
మీకు గాయం వుంటే వైద్యుడికి చూపించండి కానీ, రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరికీ చూపించాల్సిన పనిలేదు. కేవలం స్పృహతో ఉండండి. జీవితంలో ఒక వ్యక్తి చాలా ముసుగులు ఉపయోగించాలి; అవి సామరస్యకర్తలుగా పనిచేస్తాయి. ఎవరో వచ్చి హలో అన్నారు అనుకోండి. మీరు వెంటనే మీ సమస్యలన్నీ ఆమెకు చెప్పడం ప్రారంభిస్తే ఎలా. ఆమె మీరు ఎలా ఉన్నారని అడగలేదు; ఆమె కేవలం హలో చెబుతోంది. ఆలా పలకిరించిన దానికి ఇప్పుడు ఒక గంట ఆమె మీ సోది వినాలి. అది చాలా ఎక్కువ భారం అవుతుంది వారికి! తదుపరి సారి ఆమె హలో కూడా చెప్పదు; ఆమె తప్పించు కుంటుంది. జీవితంలో చాలా మర్యాద పూర్వక చర్యలు అవసరం అవుతాయి, ఎందుకంటే మీరు ఒంటరిగా లేరు కనుక. మీరు సమాజం యొక్క అధికారిక నమూనాల ప్రకారం జీవించక పోతే, మీరు మీ కోసం మరింత కష్టాలను సృష్టించు కుంటారు. అంతకంటే మరేమీ కాదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 292 🌹
📚. Prasad Bharadwaj
🍀 292. MASKS 🍀
🕉. Whatever you are doing, just be conscious. If you are wearing a mask, be conscious; wear it knowingly. It should not be an automatic thing. 🕉
If you are in a sad mood and somebody comes and you remain sad, you will make him sad too. And he has not done anything. He has not deserved it in any way, so why make him sad unnecessarily? You smile and talk, and you just manage, knowing well that this is a mask. When your friend goes you become sad again. That was just a social formality. If you use it consciously there is no problem. If you have a wound, there is no need to go and show it to everybody; it is none of their affair. Why create misery in their minds about your wound? Why be an exhibitionist? Let it be there; take care of it, try to heal it.
Show it to the doctor, but there is no need to show it to every passerby on the road. Just be conscious. One has to use many masks; they function as lubricants. Somebody comes and asks how you are, and you start telling her all your problems. She did not ask for it; she was just saying hello. Now for one hour she has to listen to you. That will be too much! Next time she will not even say hello; she will escape. In life many formalities are needed, because you are not alone and if you don't live according to the formal patterns of the society, you will create more misery for yourself, nothing else.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment