1) 🌹 14, JANUARY 2023 SATURDAY, శనివారం, స్థిర వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 311 / Bhagavad-Gita -311 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 01 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 158 / Agni Maha Purana - 158 🌹 🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 3 / Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 023 / DAILY WISDOM - 023 🌹 🌻 23. ఆలోచన అనేది విషయము యొక్క చైతన్యం / 23. Thought is Objectified Consciousness 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 287 🌹
6) 🌹. శివ సూత్రములు - 25 / Siva Sutras - 25 🌹 🌻 7. జాగ్రత్ స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః. - 5 / 7. Jāgrat svapna suṣupta bhede turyābhoga sambhavaḥ. - 5 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹14, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
🍀. భోగి మరియు వివేకానంద జయంతి శుభాకాంక్షలు Good Wishes on Bhogi and Vivekananda Jayanti 🍀
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : భోగి, వివేకానంద జయంతి, లోహ్రి, Bhogi, Vivekananda Jayanti, Lohri🌻*
*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 4 🍀*
7. దిగంబర నమస్తుభ్యం దిగీశాయ నమో నమః |
నమోఽస్తు దైత్యకాలాయ పాపకాలాయ తే నమః
8. సర్వజ్ఞాయ నమస్తుభ్యం నమస్తే దివ్యచక్షుషే |
అజితాయ నమస్తుభ్యం జితామిత్రాయ తే నమః
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : పరమ దుర్బలురము అనుకునే వారిలో సైతం దివ్యశక్తి అంతర్గతమై ఉన్నది. దానిని కనుగొని, తెర తొలగించి, జీవిత ప్రయాణంలో, జీవిత సంగ్రామంలో, నిత్యమూ ఎట్టెదుట నిలుపుకోడమే కావలసినది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ సప్తమి 19:24:08 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: హస్త 18:14:17 వరకు
తదుపరి చిత్ర
యోగం: అతిగంధ్ 12:33:42
వరకు తదుపరి సుకర్మ
కరణం: విష్టి 06:55:15 వరకు
వర్జ్యం: 01:34:57 - 03:17:25
మరియు 26:33:20 - 28:13:12
దుర్ముహూర్తం: 08:18:41 - 09:03:27
రాహు కాలం: 09:37:02 - 11:00:59
గుళిక కాలం: 06:49:08 - 08:13:05
యమ గండం: 13:48:54 - 15:12:51
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46
అమృత కాలం: 11:49:45 - 13:32:13
సూర్యోదయం: 06:49:08
సూర్యాస్తమయం: 18:00:46
చంద్రోదయం: 00:07:31
చంద్రాస్తమయం: 11:32:27
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: మృత్యు యోగం - మృత్యు
భయం 18:14:17 వరకు తదుపరి
కాల యోగం - అవమానం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🍀. భోగి మరియు వివేకానంద జయంతి శుభాకాంక్షలు Good Wishes on Bhogi and Vivekananda Jayanti 🍀*
*ప్రసాద్ భరద్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 311 / Bhagavad-Gita - 311 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 01 🌴*
*01. అర్జున ఉవాచ*
*కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |*
*అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ||*
🌷. తాత్పర్యం :
*అర్జునుడు ప్రశ్నించెను: ఓ దేవదేవా! పురుషోత్తమా! బ్రహ్మమననేమి? ఆత్మయననేమి? కామ్యకర్మలననేవి? భౌతికసృష్టి యననేమి? దేవతలన నెవరు? దయతో ఇది నాకు వివరింపుము.*
🌷. భాష్యము :
“బ్రహ్మమననేమి?” యను ప్రశ్నతో మొదలైన అర్జునుని వివిధప్రశ్నలను శ్రీకృష్ణభగవానుడు ఈ అధ్యాయనము సమాధానము లొసగును. కామ్యకర్మలు, భక్తియుక్తసేవ, యోగనియమములు, శుద్ధభక్తిని గూర్చియు దీని యందు భగవానుడు వివరించుచున్నాడు. పరతత్త్వమనునది బ్రహ్మముగా, పరమాత్మగా, భగవానునిగా తెలియబడుచున్నది శ్రీమద్భాగవతము వివరించుచున్నది. కాని దీనితోపాటు జీవాత్మ కూడా బ్రహ్మముగానే పిలువబడుచుండును. దేహము, ఆత్మ, మనస్సు యనువానిగా అన్వయింపదగిన ఆత్మను గూర్చియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. వేదనిఘంటువు ప్రకారము ఆత్మ యనగా మనస్సు, ఆత్మ, దేహము, ఇంద్రియములనియు భావము.
ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుని పురుషోత్తమునిగా సంభోదించెను. అనగా అతడు పరమపురుషునే ప్రశ్నించుచున్నాడు గాని సామాన్య స్నేహితుని కాదు. శ్రీకృష్ణుడు నిశ్చితమైన సమాధానములొసగు పరమప్రామాణికుడని అతడు ఎరిగియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 311 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 01 🌴*
*01. arjuna uvāca*
*kiṁ tad brahma kim adhyātmaṁ kiṁ karma puruṣottama*
*adhibhūtaṁ ca kiṁ proktam adhidaivaṁ kim ucyate*
🌷 Translation :
*Arjuna inquired: O my Lord, O Supreme Person, what is Brahman? What is the self? What are fruitive activities? What is this material manifestation? And what are the demigods? Please explain this to me.*
🌹 Purport :
In this chapter Lord Kṛṣṇa answers different questions from Arjuna, beginning with “What is Brahman?” The Lord also explains karma (fruitive activities), devotional service and yoga principles, and devotional service in its pure form. The Śrīmad-Bhāgavatam explains that the Supreme Absolute Truth is known as Brahman, Paramātmā and Bhagavān. In addition, the living entity, the individual soul, is also called Brahman. Arjuna also inquires about ātmā, which refers to body, soul and mind. According to the Vedic dictionary, ātmā refers to the mind, soul, body and senses also.
Arjuna has addressed the Supreme Lord as Puruṣottama, Supreme Person, which means that he was putting these questions not simply to a friend but to the Supreme Person, knowing Him to be the supreme authority able to give definitive answers.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 158 / Agni Maha Purana - 158 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 49*
*🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 3 🌻*
ఇపుడు వాసుదేవాదులగు తొమ్మండుగురి మూర్తుల లక్షణము చెప్పెదను. వాసుదేవునకు పై కుడిచేతిలో చక్రముండుచట ప్రధాన చిహ్నము ఒక పార్శ్వమున బ్రహ్మ, మరొక పార్శ్వము శివుడు సర్వదా ఉందురు.
ఇతర విషయములన్నియు వెనుక చెప్పినట్లే, శంఖమునుగాని, వరదముద్రను గాని ధరించి యుండును. ద్విభూజుడు కావచ్చును. చతర్భుజుడు కావచ్చును. బలరామునకు నాలుగు భుజములుండను. కుడిచేతులలో హల-ముసలములను, ఎడమచేతులలో గదా- పద్మములను ధరించి ఉండును.
ప్రద్యుమ్నుడు కుడిచేతులలో చక్ర-శంఖములను, ఎడమ చేతులలో ధనుర్బాణములను ధరించి యుండును. లేదా రెండు భుజములుండి ఒకచేతిలో గధను, రెండవ దానిలో ధనస్సును ధరించి యుండును. ఈ ఆయుధములను ప్రసన్నతా పూర్వకముగ ధరించి యుండును. లేదా ఒక హస్తమున ధనస్సు, రెండవ హస్తమున బాణము ఉండును.
అనిరుద్ధ-నారాయణుల విగ్రహములు చతుర్భుజములు బ్రహ్మహంసారూఢుడు. నాలుగుముఖములు, ఎనిమిది భుజములు, విశాలమైన ఉదరమండలము, పొడవైన గడ్డము, శిరస్సుపై జటలు ఉండును కుడిచేతులలో అక్షసూత్రమును-స్రువమును, ఎడమచేతులలో కుండికను, అజ్యస్థాలిని ధరించి యుండును. ఎడమ ప్రక్క సరస్వతి, కుడిప్రక్క సావిత్రి ఉండును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 158 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 49
*🌻Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 3 🌻*
10. I shall describe the characteristics of nine forms of Viṣṇu commencing with Vāsudeva. The mace (is placed) on the right half (upper arm) and the excellent disc on the left half (upper arm).
11. The image of Vāsudeva may be made as before or as having four hands or two hands, one holding a conch and the other as conferring boons and having Brahmā and Īśa (Śiva) always on either side.
12. (The figure of) Balarāma (is represented) as holding a plough, mace, club and lotus. (The image of) Pradyumna (is represented as having) thunderbolt and conch on the right arm and the bow in the left arm.
13. Or Pradyumna (is represented) as having the mace resting on the navel with pleasure or holding the bow and arrow. Aniruddha may be (represented as) having four arms. In the same way Lord Nārāyaṇa (may also be represented).
14. (The image of) Brahmā is (represented as having) four faces, four hands, big belly, long beards, matted hair, and (having) swan as the vehicle in front (of him).
15. (There should be) a rosary and a ladle on the right hand and a water-pot and vessel to hold the sacrificial clarified butter. Sarasvatī and Sāvitrī (consorts of Brahmā) (should be placed) on the left and right sides.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 23 / DAILY WISDOM - 23 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 23. ఆలోచన అనేది విషయము యొక్క చైతన్యం 🌻*
*ఒక విషయం యొక్క జ్ఞానం ద్వారా అన్ని విషయాల జ్ఞానం వస్తుందంటే, ప్రతిదీ ఆ ఒక్క విషయంతో రూపొందించబడిందని అర్థం. నిజంగా ఈ ప్రకృతి విభిన్న స్వభావాలతో తయారు చేయబడిందనే అపోహను సరిదిద్దాలి. నిజానికి ఉన్నది ఒకటే. శాశ్వతత్వం కోసం అనేక విషయాల వెనుక పరుగులు తీయడంలో జీవుడిని అంతర్లీనంగా ఒక విముఖత ఉంది. ఆ విముఖత కు కారణం జీవుడు ఎదిగేకొద్ది పూర్తి ఉనికి యొక్క ఏకత్వాన్ని అర్థం చేసుకుని ఒకే ఉదుటున దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి.*
*ఈ నిర్మాణాత్మక ప్రేరణ స్వాభావికమైనది మరియు సహజమైన మనస్సు మరియు శాస్త్రీయ మేధస్సు రెండింటిలోనూ తీవ్రంగా చురుకుగా ఉంటుంది. వ్యక్తి అనేది పరిమితి, పుట్టుక, పెరుగుదల, మార్పు, క్షయం మరియు మరణం యొక్క అసంపూర్ణతలతో కూడిన చైతన్య-కేంద్రం. ఆలోచన అనేది ఘనీభవించిన చైతన్యం. ఈ ఘనీభావం ఎక్కువైతే, అజ్ఞానం దట్టంగా ఉంటుంది. బాధలు తీవ్రంగా ఉంటాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 23 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 23. Thought is Objectified Consciousness 🌻*
*The knowledge of everything through the knowledge of One Thing implies that everything is made up of that One Thing. That the misconception of things being really made of differing natures has to be set aright is pointed out by the disgust that arises in clinging to the notion of the multiple permanence of beings and a passion for catching completely whatever that must exist. The growth of intelligence tends towards urging the individual to grasp the totality of existence at a stroke.*
*This constructive impulse is inherent and is vigorously active both in the instinctive mind and the scientific intellect. The individual is a consciousness-centre characterised by the imperfections of limitation, birth, growth, change, decay and death. Thought is objectified consciousness. The greater the objectification, the denser is the ignorance and the acuter are the pains suffered.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 288 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మిమల్ని మీరు సిద్ధపరచండి. సమయం వచ్చినపుడు, మీలో పరిణితి ఏర్పడినపుడు దేవుడు మీకు ఆవిష్కారమవుతాడు. సిద్ధం కావడమంటే ఆనందించడమే, విచ్చుకోవడమే, పాడడమే, ఆడడమే, ప్రేమించడమే, ధ్యానించడమే. 🍀*
*చాలా మంది దేవుణ్ణి వెతుకుతారు. ఆయన్ని కలవడానికి తాము సిద్ధంగా వున్నామా? లేదా? అని ఆలోచించాలి. వాళ్ళు సిద్ధంగా వున్నపుడే వెతకాలి. వాళ్ళకా ఆలోచన రాదు. నేను ఏమంటానంటే దేవుణ్ణి మరచిపోండి. మొదట మిమల్ని మీరు సిద్ధపరచండి. సమయం వచ్చినపుడు, మీలో పరిణితి ఏర్పడినపుడు దేవుడు మీకు ఆవిష్కారమవుతాడు.*
*దాన్ని గురించి మీరు బాధపడాల్సిన పన్లేదు. అసలు దేవుడి గురించే ఆలోచించాల్సి పన్లేదు. మీ ఆలోచన మీకు సాయపడదు. సిద్ధం కావడమంటే ఆనందించడమే, విచ్చుకోవడమే, పాడడమే, ఆడడమే, ప్రేమించడమే, ధ్యానించడమే. అప్పుడు అన్ని కోణాలు. నీ అస్తిత్వ దళాలు విచ్చుకోవడం మొదలుపెడతాయి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 025 / Siva Sutras - 025 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 7. జాగ్రత్ స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః. - 5 🌻*
*🌴. మెలకువ (జాగ్రత్), స్వప్న (స్వప్న), గాఢమైన నిద్ర (సుషుప్త) వంటి విభిన్న స్థితులలో కూడా నాల్గవ స్థితి తుర్య యొక్క పారవశ్యం, ఆనందం ఉంది. 🌴*
*పునాది చైతన్యం బలహీనంగా ఉంటే, అత్యంత శక్తివంతమైన శివ చైతన్యం వ్యక్తం కాలేదు. సరైన సాధన పూర్తయినప్పుడు మాత్రమే తురీయ చైతన్య స్థితికి చేరతారు. ఆ తర్వాత విముక్తి జరుగుతుంది. అంటే శరీరం మరణిస్తుంది దీని అర్థం కాదు, కానీ అతని చైతన్యం అతని సాధన ద్వారా శుద్ధి చేయబడుతుంది.
*తురీయానికి తన చైతన్యంపై పూర్తి నియంత్రణను పొందడం సులభం అవుతుంది. అతను ఇప్పటికీ చైతన్యం యొక్క మొదటి మూడు దశలను అనుభవిస్తాడు. కానీ, అతని చైతన్యం యొక్క నాణ్యత పూర్తిగా పరివర్తన చెంది, శివ చైతన్యానికి దగ్గరగా వెళుతుంది. శివుని తుది సాక్షాత్కారం కోసం వేచి ఉంటుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 025 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 7. Jāgratsvapnasuṣuptabhede turyābhogasambhavaḥ. - 5 🌻*
*🌴. During different states of consciousness as waking (jāgrat), dreaming (svapna), profound sleep (suṣupta), there is the delight and enjoyment of the Fourth State Turya 🌴*
*If the foundational consciousness is weak, the most powerful Shiva cannot manifest. When proper preparatory work is completed, turya takes over the consciousness, and the emancipation happens thereafter. It does not mean that his body ceases to exist (death), but his consciousness is purified by his preparatory work, making it easier for turya to take complete control of his consciousness.*
*He still experiences the first three stages of consciousness, the exception being that the quality of his consciousness has undergone complete transformation, moving closer and closer to Shiva, awaiting the final realisation of Shiva at anytime.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
No comments:
Post a Comment