కపిల గీత - 118 / Kapila Gita - 118
🌹. కపిల గీత - 118 / Kapila Gita - 118🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 02 🌴
02. స ఏష యర్హి ప్రకృతేర్గుణేష్వభివిషజ్జతే|
అహంక్రియా విముఢాత్మా కర్తాస్మీత్యభిమన్యతే॥
కాని, ఆ జీవుడు ప్రకృతి గుణములతో మమేకమైనప్పుడు, అహంకారముతో మోహితుడై నేనే కర్తను అని భావించుకొనును.
"నేను చేస్తున్నాను" అని ఎందుకు అనుకుంటున్నాడు? ఆ అనుకునే "నేను" అసలు నేను కాదు. ప్రకృతి గుణములలో చిక్కుకున్నప్పుడు అహంకారముతో కప్పి వేయబడతాడు. దానితో "నేనే కర్త" అనుకుంటాడు. అసలు కర్తను చూడలేకపోతాడు. అది వేరు (ప్రకృతి వేరు) నేను వేరు అనే జ్ఞానాన్ని కోల్పోతాడు. ఆ ప్రకృతి ఈ ఆత్మను కప్పివేస్తోంది. అప్పుడు నేను కర్తనూ, అనే భావానికి వస్తాడు జీవుడు. ఈ కారణముతోనే మనసుతో సంసారములో మునుగుతాడు. పాపం ఎంత దోషమో పుణ్యమూ అంతే దోషం. పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ పుట్టాలి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 118 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 02 🌴
02. sa eṣa yarhi prakṛter guṇeṣv abhiviṣajjate
ahaṅkriyā-vimūḍhātmā kartāsmīty abhimanyate
When the soul is under the spell of material nature and false ego, identifying his body as the self, he becomes absorbed in material activities, and by the influence of false ego he thinks that he is the proprietor of everything.
Actually the conditioned soul is forced to act under the pressure of the modes of material nature. The living entity has no independence. When he is under the direction of the Supreme Personality of Godhead he is free, but when, under the impression that he is satisfying his senses, he engages in sense gratificatory activities, he is actually under the spell of material nature.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment