శ్రీమద్భగవద్గీత - 321: 08వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 321: Chap. 08, Ver. 11

 

🌹. శ్రీమద్భగవద్గీత - 321 / Bhagavad-Gita - 321 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 11 🌴

11. యదక్షరం వేదవిదో వదన్తి విశన్తి యద్యతయో వీతరాగా: |
యదిచ్చన్తో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే ||

🌷. తాత్పర్యం :

వేదవిదులైనవారును, ఓంకారమును ఉచ్చరించు వారును, సన్న్యాసాశ్రమము నందున్న మహర్షులు అగు మనుజులు బ్రహ్మము నందు ప్రవేశించు చున్నారు. అట్టి పూర్ణత్వమును కోరినవారు బ్రహ్మచర్యవ్రతము నభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానము ఇప్పుడు నీకు నేను సంగ్రహముగా వివరింతును.

🌷. భాష్యము :

శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు భ్రూమధ్యమున ప్రాణవాయువును నిలుపు షట్చక్రయోగాభ్యాసమును ఉపదేశించినాడు. అర్జునుడు ఆ యోగాభ్యాసము తెలియదని భావించి భగవానుడు దానిని రాబోవు శ్లోకములందు వివరింపనున్నాడు. పరబ్రహ్మము అద్వితీయుడైనను పలురూపములను మరియు లక్షణములను కలిగియుండునని శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు.

నిరాకారవాదులకు ఓంకారము (అక్షరము) పరబ్రహ్మముతో సమానము. వీతరాగులైన యతులు ప్రవేశించు నిరాకారబ్రహ్మమును గూర్చి శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివరించుచున్నాడు. వైదికమార్గమునందు ఓంకారము జపించుట మరియు పూర్ణ బ్రహ్మచర్యములో గురువుచెంత నిరాకారబ్రహ్మమును గూర్చి ఎరుంగుట శిష్యులకు ఆది నుండియే భోదింపబడును. ఆ విధముగా వారు బ్రహ్మము యొక్క రెండు లక్షణములను తెలియగలరు.

ఈ అభ్యాసము బ్రహ్మచారుల ఆధ్యాత్మికజీవన పురోగతికి అత్యంత అవసరమైనను సంపూర్ణముగా నేటికాలమున అట్టి బ్రహ్మచర్యజీవనము సాధ్యము కాదు. ప్రపంచ సాంఘికవ్యవస్థ సంపూర్ణముగా మార్పునొందినందున బ్రహ్మచర్యమును విద్యార్థిదశ నుండియే పాటించుట ఎవ్వరికినీ సాధ్యము కాకున్నది. ప్రపంచమంతటను వివిధజ్ఞానశాఖలకు పలు సంస్థలున్నను బ్రహ్మచర్య నియమములందు విద్యార్థులకు విద్యగరుపు ప్రామాణిక సంస్థ ఒక్కటియు లేదు. అట్టి బ్రహ్మచర్యమును పాటించనిదే ఆధ్యాత్మికజీవన పురోగతి అత్యంత కష్టతరము కాగలదు. కనుకనే కలియుగమున శాస్త్రనియమము ప్రకారము శ్రీకృష్ణభగవానుని ప్రాప్తికి పవిత్ర శ్రీకృష్ణనామము తప్ప అన్యవిధానము లేదని శ్రీచైతన్యమాహాప్రభువు ప్రకటించి యుండిరి.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 321 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 11 🌴

11 . yad akṣaraṁ veda-vido vadanti viśanti yad yatayo vīta-rāgāḥ
yad icchanto brahma-caryaṁ caranti tat te padaṁ saṅgraheṇa pravakṣye


🌷 Translation :

Persons who are learned in the Vedas, who utter oṁ-kāra, and who are great sages in the renounced order enter into Brahman. Desiring such perfection, one practices celibacy. I shall now briefly explain to you this process by which one may attain salvation.

🌹 Purport :

Lord Śrī Kṛṣṇa has recommended to Arjuna the practice of ṣaṭ-cakra-yoga, in which one places the air of life between the eyebrows. Taking it for granted that Arjuna might not know how to practice ṣaṭ-cakra-yoga, the Lord explains the process in the following verses. The Lord says that Brahman, although one without a second, has various manifestations and features. Especially for the impersonalists, the akṣara, or oṁ-kāra – the syllable oṁ – is identical with Brahman. Kṛṣṇa here explains the impersonal Brahman, into which the renounced order of sages enter.

In the Vedic system of knowledge, students, from the very beginning, are taught to vibrate oṁ and learn of the ultimate impersonal Brahman by living with the spiritual master in complete celibacy. In this way they realize two of Brahman’s features. This practice is very essential for the student’s advancement in spiritual life, but at the moment such brahmacārī (unmarried celibate) life is not at all possible. The social construction of the world has changed so much that there is no possibility of one’s practicing celibacy from the beginning of student life.

Throughout the world there are many institutions for different departments of knowledge, but there is no recognized institution where students can be educated in the brahmacārī principles. Unless one practices celibacy, advancement in spiritual life is very difficult. Therefore Lord Caitanya has announced, according to the scriptural injunctions for this Age of Kali, that in this age no process of realizing the Supreme is possible except the chanting of the holy names of Lord Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment