నిర్మల ధ్యానాలు - ఓషో - 298
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 298 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. పరిస్థితిని ఎట్లా స్వీకరిస్తావు. ఎట్లా చూస్తావు అన్నదాని మీద ఆనందం ఆధారపడి వుంటుంది. ఆధ్యాత్మ దృష్టి వున్న మనిషి విషయాల్ని సరళంగా తీసుకుంటాడు. అందువల్ల సహజంగా జీవితం ఆనందమయ మవుతుంది. 🍀
నా చిన్నప్పుడు మా నాన్న మంచి యిల్లు కట్టాడు. మేస్త్రీ మోసం చేశాడు. మొదటి వర్షానికే ఆ యిల్లు కూలిపోయింది. మా నాన్న వూళ్ళో లేడు. టెలిగ్రాం యిచ్చాను. రాలేదు. రెండ్రోజులకు వచ్చి యిల్లెలా కూలింది. టెలిగ్రాంకు అనవసరంగా వది రూపాయలు ఎందుకు వేస్టు చేశావు? యింట్లోకి చేరక ముందే ఇల్లు కూలింది. లేకుంటే అందరం చచ్చేవాళ్ళం! అన్నాడు. వూరినంతా పిలిచి విందిచ్చాడు. అందరూ విస్తుపోయారు. 'మేమంతా బతికే వున్నాం కదా! ఆ సంతోష సంబరం' అన్నాడు. దీన్నే నేను ఎంపిక అంటాను.
పరిస్థితిని ఎట్లా స్వీకరిస్తావు. ఎట్లా చూస్తావు అన్నదాని మీద ఆనందం ఆధారపడి వుంటుంది. మా చెల్లెలు చనిపోయింది. నేను బాధపడుతూ వుంటే మా నాన్న నీ కింకా పదిమంది తమ్ముళ్ళు, చెల్లెల్ళు వున్నారు. అందర్నీ తీసుకు పోనందుకు ఆనందించు అన్నాడు. ఆధ్యాత్మ దృష్టి వున్న మనిషి విషయాల్ని అట్లా తీసుకుంటాడు. అందువల్ల సహజంగా జీవితం ఆనందమయ మవుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment