🍀 05, FEBRUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 05, FEBRUARY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 05, FEBRUARY 2023 FRIDAY, శుక్రవారం, బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 129 / Kapila Gita - 129 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 13 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 13 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 721 / Vishnu Sahasranama Contemplation - 721 🌹 
🌻721. అనేకమూర్తిః, अनेकमूर्तिः, Anekamūrtiḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 682 / Sri Siva Maha Purana - 682 🌹 🌻. త్రిపుర వర్ణనము - 2 / Description of Tripura (the three cities) - 2🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 303 / Osho Daily Meditations - 303 🌹 🍀 303. చరిత్ర / HISTORY 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 429-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 429-2 🌹 🌻 429. 'మదశాలినీ' - 2 / 429. 'Madashalini' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹05, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
మాఘ పౌర్ణమి, భైరవి‌ జయంతి శుభాకాంక్షలు, Magha Purnima, Bhairavi Jayanti Good Wishes to All
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాఘ పౌర్ణమి, భైరవి‌ జయంతి, Magha Purnima, Bhairavi Jayanti 🌻*

*🍀. సూర్య మండల స్త్రోత్రం - 7 🍀*

7. యన్మండలం వేదవిదో వదంతి | 
గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః | 
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జ్ఞానము, శక్తి - జ్ఞానం వేరు, శక్తి వేరు. విషయములు గురించిన ఎరుక జ్ఞానం, క్రియా కారకమైనది శక్తి. జ్ఞానం శక్తి కలది కావచ్చు. శక్తిని వినియోగించ వచ్చు. కాని, అలా వినియోగించడంలో అది దానితో ఏకమైపోక దాని కంటె వేరై నిలిచి దాని ప్రవృత్తిని తిలకించ గలుగుతుంది. 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: పూర్ణిమ 23:59:57 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: పుష్యమి 12:13:16 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: ఆయుష్మాన్ 14:41:17 వరకు
తదుపరి సౌభాగ్య
కరణం: విష్టి 10:44:50 వరకు
వర్జ్యం: 26:32:12 - 28:19:36
దుర్ముహూర్తం: 16:41:40 - 17:27:25
రాహు కాలం: 16:47:23 - 18:13:10
గుళిక కాలం: 15:21:36 - 16:47:23
యమ గండం: 12:30:02 - 13:55:49
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 05:02:20 - 06:50:00
సూర్యోదయం: 06:46:54
సూర్యాస్తమయం: 18:13:10
చంద్రోదయం: 17:57:15
చంద్రాస్తమయం: 06:34:02
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: శ్రీవత్స యోగం - ధన
లాభం , సర్వ సౌఖ్యం 12:13:16
వరకు తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 129 / Kapila Gita - 129🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 13 🌴*

*13. ఏవం త్రివృదహంకారో భూతేంద్రియమనోమయైః|*
*స్వాభో సైర్లక్షితోఽనేన సదాభాసేన సత్యదృక్॥*

*తాత్పర్యము : సాత్త్విక, రాజస, తామసములనెడి మూడు విధములగు అహంకారముల కార్యములగు దేహ ఇంద్రియ మనస్సుల యందు ఆత్మ ప్రతిబింబము అనుభవమునకు వచ్చును. అది అహంకారము నందలి పరమాత్మయొక్క ప్రతిబింబమే అని తెలిసినప్పుడు తద్ద్వారా పరమాత్మయొక్క నిజస్వరూపము బోధపడును. ఈ విధముగా సత్య వస్తువువలె భాసించు అసద్వస్తువు ద్వారా సత్యవస్తువు అనుభవమునకు వచ్చును అని స్పష్టమగుచున్నది.

*వ్యాఖ్య : తివృత్ అయిన అహంకారం (సత్వ రజ తమో గుణాలతో కూడి ఉన్న,), పంచ భూతాలు, జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియాలతో కూడి ఉన్న అహంకారం. అహంకారమునకే త్రివృత్ అని పేరు. శరీరమే ఆత్మ అనే భ్రమ కలగడానికి అహంకారమే కారణం. శరీరములో ఇంద్రియములో మనసులో ఆత్మ బుద్ధిని చూపుతుంది. ఏ జ్ఞ్యానమైతే దేహాత్మ జ్ఞ్యానముని కలిగిస్తుందో, అదే జ్ఞ్యానం పరమాత్మ అనుగ్రహం కలిగిన నాడు ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది. అన్ని వికారాలకు మూలైమైన దేహాత్మాభిమానం మాయమై, సత్యమైన, నిర్వికారమైన, జ్ఞ్యాన స్వరూపమైన ఆత్మను అహంకారమే చూపుతుంది. పరమాత్మ సాక్షాత్కారమయ్యే దాకా, దేహాన్ని చూపే అహంకారం, పరమాత్మ సాక్షాత్కారమయ్యాక, ఆత్మను చూపుతుంది. ఆత్మ జ్ఞ్యానం కలిగేది పరమాత్మ వలననే. అహంకారం కలిగేది కూడా పరమాత్మ వలననే. యధార్థ జ్య్నానమైనా భ్రాంతి అయినా పరమాత్మ వల్లే కలగాలి. నీటిలో సూర్యుడు కానిదైన సూర్యబింబాన్ని చూపేది సూర్యుడే, అలాగే నిజమైన సూర్యున్ని చూపేది కూడా సూర్యుడే. అలాగే ఆత్మ కాని దాన్ని ఆత్మా అని చూపే పరమాత్మే, ఆత్మ స్వరూప జ్ఞ్యానాన్నీ చూపుతాడు.

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 129 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 13 🌴*

*13. evaṁ trivṛd-ahaṅkāro bhūtendriya-manomayaiḥ*
*svābhāsair lakṣito 'nena sad-ābhāsena satya-dṛk*

*MEANING : The self-realized soul is thus reflected first in the threefold ego and then in the body, senses and mind. When one is reflected through the material contamination of the body and mind in false identification, he is in the conditional state, but when he is reflected in the pure stage he is called liberated.*

*PURPORT : The conditioned soul thinks, "I am this body," but a liberated soul thinks, "I am not this body. I am spirit soul." This "I am" is called ego, or identification of the self. "I am this body" or "Everything in relationship to the body is mine" is called false ego, but when one is self-realized and thinks that he is an eternal servitor of the Supreme Lord, that identification is real ego. One conception is in the darkness of the threefold qualities of material nature—goodness, passion and ignorance—and the other is in the pure state of goodness, called śuddha-sattva or vāsudeva. When we say that we give up our ego, this means that we give up our false ego, but real ego is always present. When one is reflected through the material contamination of the body and mind in false identification, he is in the conditional state, but when he is reflected in the pure stage he is called liberated.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 721 / Vishnu Sahasranama Contemplation - 721🌹*

*🌻721. అనేకమూర్తిః, अनेकमूर्तिः, Anekamūrtiḥ🌻*

*ఓం అనేకమూర్తయే నమః | ॐ अनेकमूर्तये नमः | OM Anekamūrtaye namaḥ*

*స్వేచ్ఛాయాహ్యవతారేషు లోకానాముపకారిణీః ।*
*బహ్విర్మూర్తీర్భజత ఇత్యేతస్యానేమూరితా ॥*

*ఆయా అవతారములయందు తన ఇచ్ఛతోనే లోకములకు ఉపకారమొనర్చు బహుమూర్తుల నాశ్రయించువాడు కనుక అనేకములగు మూర్తులు ఈతనికి కలవు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 721🌹*

*🌻721. Anekamūrtiḥ🌻*

*OM Anekamūrtaye namaḥ*

स्वेच्छायाह्यवतारेषु लोकानामुपकारिणीः ।
बह्विर्मूर्तीर्भजत इत्येतस्यानेमूरिता ॥

*Svecchāyāhyavatāreṣu lokānāmupakāriṇīḥ,*
*Bahvirmūrtīrbhajata ityetasyānemūritā.*

*Since He assumed many forms of His own will in His many incarnations for helping the worlds, He is known as Anekamūrtiḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥
Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 682 / Sri Siva Maha Purana - 682 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. త్రిపుర వర్ణనము - 2 🌻*

వారు ముగ్గురు మిక్కిలి మనోహరములగు గొప్ప భోగములనన్నిటినీ పరిత్యజించి మేరు పర్వతగుహకు పోయి గొప్ప అద్భుతమగు తపస్సును చేసిరి (10). తారకుని పుత్రులగు ఆ ముగ్గురు రాక్షసులు వసంతకాలమునందు అన్ని కోర్కెలను, సంగీతాది భోగములను, ఉత్సవములను విడిచి పెట్టి తపస్సును చేసిరి (11). గ్రీష్మర్తువు నందు సూర్యకాంతిని సహిస్తూ నాల్గుదిక్కుల యందు అగ్నిని ప్రజ్వరిల్ల జేసి తపస్సిద్ధి కొరకై వాటి మధ్యలో నున్నవారై శ్రద్ధతో హవ్యమును హోమము చేసిరి (12). వారందరు అతిశయించిన ఆ తాపమునకు తాళజాలక మూర్ఛితులైరి. వర్షకాలమునందు అనారోగ్య భయమును ప్రక్కన బెట్టి వర్షములో నిలబడి తడుస్తూ తపస్సును జేసిరి (13).

వారు ఆకలి వేసినప్పుడు శరత్కాలములో పండే రమ్యమైన మృదుమధురమైన ఫలములను, శ్రేష్ఠమగు మూలములను భక్షించెడి వారు (14). మనో నియంత్రణచే ఆకలి దప్పికలను జయించి మిక్కిలి విలువైన పానీయములను కూడా ఆకలి గొన్నవారికి సమర్పించి మహాత్ములగు వారు హేమంత ఋతువులో గొప్ప ధైర్యముతో పర్వత శిఖరముపైకి వెళ్లి నాల్గుదిక్కుల యందు ఎట్టి రక్షణయూ లేనివారై శిలలవలె నిలబడి తపస్సును చేసిరి (15,16). శిశిర ఋతువులో మంచుతో కప్పబడిన దేహము గలవారై నీటి మధ్యలో నిలబడి నీటితో తడిసిన పట్టు వస్త్రమును భుజముపై కప్పుకొని తపస్సు చేసిరి (17).

సత్పురుషులగు ఆ తారకపుత్రులు ముగ్గురు నిరుత్సాహమును చెందకుండగా బ్రహ్మనుద్ధేశించి క్రమముగా తీవ్రతలో వర్ధిల్లుచున్న తపస్సును చేసిరి (18). ఆ దానవశ్రేష్ఠులు గొప్ప నియమమును పాటిస్తూ ఉగ్రమగు తపస్సును అనుష్ఠిస్తూ తమ దేహములను తపస్సుచే కృశింపజేసిరి (19). గొప్ప బలవంతులగు వారు భూమిపై ఒంటికాలితో నిలబడి వందసంవత్సరములు తీవ్రమగు తపస్సును చేసిరి (20). మిక్కిలి క్రూరులు, దురాత్ములునగు ఆ రాక్షసులు గాలిని భక్షించి వేయి సంవత్సరములు తపస్సును చేసి, గొప్ప తాపమును పొందిరి (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 682🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴*

*🌻 Description of Tripura (the three cities) - 2 🌻*

10. Eschewing all enjoyments captivating the mind, they went to the cavern of the mountain Meru[1] and performed a wonderful penance.

11. The three sons of Tāraka eschewed all desires in the season of spring. They disdained music, the sound of instruments as well as jubilation and performed penances.

12. In the summer season they mastered sunshine. They lighted fires in all directions. Standing in their midst they performed sacrifice with great devotion for the attainment of success.

13. They lay unconscious in the blazing sunshine. During the rainy season, they fearlessly bore all the showers on their heads.

14-15. In the autumn they controlled their hunger and thirst. All good foodstuffs, steady, wholesome, and viscid, fruits, roots and beverages they distributed among the hungry. They themselves remained like stones.

16. In the early winter they remained on top of the mountain with fortitude, unsupported in any of the four quarters.

17. In the late winter they stayed under water or wore wet dripping silken cloth or allowed themselves to be covered with dew drops.

18. They were not at all vexed or distressed thereby. They gradually increased the severity of their austerities. Thus the three excellent sons of Tāraka performed penance with Brahmā as the object of their worship.

19. Maintaining strict severity in their austerities, the excellent Asuras made their bodies emaciated by their penance.

20. Standing on the bare ground on a single foot, the strong Asuras performed the penance for a hundred years.

21. Taking in only air and enduring excessive heat and distress, the terrible and wicked souls continued the penance for a thousand years.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 303 / Osho Daily Meditations - 303 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 303. చరిత్ర 🍀*

*🕉. చరిత్ర చాలా నీచమైనది. చరిత్ర ప్రారంభించాల్సిన స్థాయికి మనిషి చేరుకోలేదు. అదంతా పీడకలలు. 🕉*

*మానవాళికి తన గురించి ఇంకా వ్రాయడానికి ఏమీ లేదు - ఎక్కడో ఒక మహాత్ముడు , ఎక్కడో ఒక బుద్ధుడు, సుదూర నక్షత్రాల వలె చాలా కొన్ని విషయాలు. మానవజాతి ఎప్పుడూ హింస మరియు యుద్ధాల పిచ్చిలో జీవించింది. కాబట్టి గతాన్ని మర్చిపోవడం ఒక విధంగా మంచిది. గతం చాలా భారమైనది. అది సహాయం చేయదు. నిజానికి అది మనసును పాడు చేస్తుంది. గతాన్ని చూస్తుంటే మానవజాతి ఎదగదు అనిపిస్తోంది. ఇది విషయాలు చాలా నిరాశాజనకంగా కనిపించేలా చేస్తుంది. చరిత్ర ఇంకా రాయడానికి లేదా చదవడానికి విలువైనది కాదు. చరిత్రపై ఆసక్తి మంచిది కాదు. చరిత్ర గతానికి సంబంధించినది.*

*చరిత్ర చనిపోయిన వారితో ఆందోళన చెందుతుంది. ఇది ఇప్పుడు లేని దాని గురించి ఆందోళన చెందుతుంది. ఉన్న ప్రస్తుతంతో, ఈ క్షణంలో ఉన్న దానితో ఆందోళన ఉండాలి. ప్రపంచ చరిత్రను మాత్రమే మరచిపోకండి, మీ జీవిత చరిత్రను కూడా మరచిపోండి. ప్రతి ఉదయం మీ రోజును పూర్తిగా కొత్తదిగా ప్రారంభించండి, మీరు ఇంతకు ముందెన్నడూ లేనట్లుగా. ధ్యానం అంటే ఇదే: ప్రతి క్షణాన్ని కొత్తగా, మంచులా తాజాగా ప్రారంభించడం, గతం గురించి ఏమీ తెలియకపోవడం. మీకు గతం గురించి ఏమీ తెలియనప్పుడు మరియు మీరు దానిలో దేనినీ తీసుకు వెళ్లనప్పుడు, మీరు ఏ భవిష్యత్తును అంచనా వేయరు. మీరు ప్రాజెక్ట్ చేయడానికి ఏమీ లేదు. గతం అదృశ్యమైనప్పుడు, భవిష్యత్తు కూడా అదృశ్యమవుతుంది. అవి కలిసి ఉంటాయి. అప్పుడు స్వచ్ఛమైన వర్తమానం మిగిలిపోతుంది. అదే స్వచ్ఛమైన శాశ్వతత్వం.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 303 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 303. HISTORY 🍀*

*🕉. History is so ugly. Man has not reached the level at which history should start. It has all been nightmares. 🕉*

*Humanity has nothing yet to write about itself--just a very few cases somewhere a Buddha, somewhere a divine human, just like faraway stars. Humanity has lived in violence and wars and madness, so it's good, in a way, to forget the past. The past is too heavy and it does not help. In fact, it corrupts the mind. Looking at the past, it seems that humanity cannot grow. It makes things look very hopeless. History is not yet worth writing or reading. And the very interest in history is not good. History is concerned with the past. It is concerned with the dead.*

*It is concerned with that which is no more. The whole
concern should be with that which is right now, this very moment. Don't only forget history, but forget your biography also, and each morning start your day as if it were completely new, as if you have never existed before. That's what meditation is all about: to start each moment anew, fresh like dew, not knowing anything of the past. When you don't know anything of the past and you don't carry anything of it, you don't project any future. You have nothing to project. When the past disappears, the future also disappears. They are joined together. Then pure present is left. That is pure eternity.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 429 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 429 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*
*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀*

*🌻 429. 'మదశాలినీ' - 2 🌻* 

*కృష్ణభక్తి పారవశ్యములో పరమ భక్తురాలైన మీరాబాయి రాచరికపు హద్దులను లెక్కచేయలేదు. విషమును కూడ లెక్కచేయలేదు. బలి చక్రవర్తి అతిశయించిన భక్తి పారవశ్యమున తన గురువగు శుక్రాచార్యుని కూడ లెక్కచేయలేదు. ఇక ప్రహ్లాదుని విషయము చెప్పనక్కర లేదు కదా!*

*"అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మే రీతి నితరంబుఁ జేరనేర్చు" అట్లు మత్తెక్కిన భక్తి చిత్తము దైవారాధనమున భక్తులకే చిక్కినప్పుడు దాని మూలమైన శ్రీమాత ఎట్లుండును? ఆనందముచే ప్రకాశించుచు నుండునని భావము. ఆమె సతతము ఈశ్వరునితోనే కూడియుండి ఈశ్వరియై ప్రకాశించుచుండును. కావున ముదశాలిని మఱియు మదశాలిని.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 429 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita*
*Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻*

*🌻 429. 'Madashalini' - 2 🌻*

*In the ecstasy of Krishna devotion, Mirabai, the supreme devotee, did not even count the royal protocols. She did not even care about Poison. Emperor Bali did not count even his Guru Shukracharya in the ecstasy of devotion. Prahlad did not care anything about the innumerable punishments he endured in his intoxication of devotion!*

*When the intoxicated devotional mind gets caught up in the worship of the devotees, how do you think will be the source of such devotion- Srimata? A feeling of being radiant with joy. She is eternally united with God and shines as God. She is the personification of bliss.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

No comments:

Post a Comment