🌹 2, AUGUST 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 2, AUGUST 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 2, AUGUST 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 407 / Bhagavad-Gita - 407 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 35 / Chapter 10 - Vibhuti Yoga - 35 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 253 / Agni Maha Purana - 253 🌹 
🌻. శివ పూజా విధి వర్ణనము - 09 / Mode of worshipping Śiva (śivapūjā) - 09 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 119 / DAILY WISDOM - 119 🌹 
 🌻 28. మానసిక అగాధం / 28. Psychological Gulf🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 385 🌹*
6) 🌹. శివ సూత్రములు - 121 / Siva Sutras - 121 🌹 
🌻 2-08. శరీరం హవిః  - 3 / 2-08.  śarīram havih  - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 02, అగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ గజానన స్తోత్రం - 05 🍀*

*05. న భూర్న రూపం న జలం ప్రకాశం న తేజసిస్థం న సమీరణస్థమ్ |*
*న ఖే గతం పంచవిభూతిహీనం గజాననం భక్తియుతా భజామః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రేమానురాగాలు స్వతః ఆత్మగుణాలు - ప్రేమానురాగాలు స్వభావతః ఆత్మచేతన గుణాలు. ప్రాణచేతన యందవి గోచరిస్తున్నవంటే, ప్రాణకోశం ద్వారా తనను అభివ్యక్తం చేసుకోడానికి ఆత్మ యత్నిస్తున్నందు వల్లనే. హృదయ భావచేతన ద్వారా తనను తాను అభివ్యకం చేసుకోడం ఆత్మ కత్యంత సుకరం. ఏలనంటే సరిగా ఈ హృదయ భావచేతను వెనుకగా హృదయ కేంద్రమయిన వెలుగొందు తున్నదే ఆత్మచేతన. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 20:07:08
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: శ్రవణ 12:59:50 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: ఆయుష్మాన్ 14:34:52
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: బాలవ 10:04:08 వరకు
వర్జ్యం: 16:28:40 - 17:52:32
దుర్ముహూర్తం: 11:56:29 - 12:48:03
రాహు కాలం: 12:22:16 - 13:58:58
గుళిక కాలం: 10:45:34 - 12:22:16
యమ గండం: 07:32:11 - 09:08:53
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 03:55:10 - 05:18:50
మరియు 24:51:52 - 26:15:44
సూర్యోదయం: 05:55:30
సూర్యాస్తమయం: 18:49:02
చంద్రోదయం: 19:40:12
చంద్రాస్తమయం: 06:14:10
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ
లాభం 12:59:50 వరకు తదుపరి
మిత్ర యోగం - మిత్ర లాభం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 407 / Bhagavad-Gita - 407 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 35 🌴*

*35. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహం |*
*మాసానాం మార్గశీర్షో(హమృతూనాం కుసుమాకర: ||*

*🌷. తాత్పర్యం : నేను సామవేద మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతఋతువును అయి యున్నాను.*

*🌻. భాష్యము : వేదములలో తాను సామవేదమునని శ్రీకృష్ణభగవానుని ఇదివరకే వివరించియున్నాడు. వివిధ దేవతలచే గానము చేయబడు శ్రావ్యగేయభరితమైన ఆ సామవేదమునందు “బృహత్సామము” అనునది ఒకటి. అసాధారణ మధురిమను కలిగియుండెడి ఆ బృహత్సామము నడిరేయి యందు గానము చేయబడు చుండును. సంస్కృతమున కవిత్వమునకు అనేక నియమములుండును. ఆధునిక కవిత్వములలో జరుగురీతి దానియందు ప్రాస మరియు ఛందములు తోచినరీతిని వ్రాయుబడవు. అట్లు నియమబద్ధముగా వ్రాయబడిన కవిత్వములలో గాయత్రీమంత్రము శ్రీమద్భావతమునందు పేర్కొనబడినది. ఈ మంత్రము భగవదనుభూతికై ప్రత్యేకముగా నిర్ణయింప బడియున్నందున దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.*

*ఆధ్యాత్మిక పురోగతినొందిన మహాత్ముల కొరకై నిర్దేశింపబడియున్న దీనిని జపించుచు ఆధ్యాత్మికజయము నొందెడివారు భగవానుని దివ్యస్థానమున ప్రవేశింపగలరు. కాని ఈ మహామంత్రము జపించుటకు పూర్వము మనుజుడు పూర్ణత్వమునొందిన మనుజుని లక్షణములను (సత్వగుణమును) అలవరచుకొనవలెను. పరబ్రహ్మము యొక్క ధ్వని అవతారముగా భావింపబడు ఈ గాయత్రీమంత్రము వైదికజీవన విధానమున అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మదేవునిచే ప్రారంభింపబడిన ఈ మంత్రము పరంపర రూపముగా వ్యాప్తినొందినది. మార్గశీర్షమాసము (నవంబర్ – డిసంబర్) అన్ని మాసముల యందును ఉత్తమమైనదిగా పరిగణింపబడును. ఏలయన ఆ సమయమున జనులు పొలముల నుండి ధ్యానమును సేకరించి ఆనందముతో నుందురు. అలాగుననే ఋతువుల యందు వసంతఋతువు ప్రపంచమంతటికిని అత్యంత ప్రియమైనది. వాతావరణము అతివేడి, అతిశీతలముగా లేకుండ వృక్షములు ఫల, పుష్పభరితమై యండుటయే అందులకు కారణము. ఈ వసంతఋతువు నందే శ్రీకృష్ణుని పలులీలలను గుర్తుచేసికొను పలు ఉత్సవములు జరుపబడు చుండును. కనుకనే ఋతువులన్నింటిని యందును వసంతఋతువు అత్యంత ఆనందదాయకమైనదిగా పరిగణింపబడును. అది దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించుచున్నది.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 407 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 35 🌴*

*35. bṛhat-sāma tathā sāmnāṁ gāyatrī chandasām aham*
*māsānāṁ mārga-śīrṣo ’ham ṛtūnāṁ kusumākaraḥ*

*🌷 Translation : Of the hymns in the Sāma Veda I am the Bṛhat-sāma, and of poetry I am the Gāyatrī. Of months I am Mārgaśīrṣa [November-December], and of seasons I am flower-bearing spring.*

*🌹 Purport : It has already been explained by the Lord that amongst all the Vedas, He is the Sāma Veda. The Sāma Veda is rich with beautiful songs played by the various demigods. One of these songs is the Bṛhat-sāma, which has an exquisite melody and is sung at midnight. In Sanskrit, there are definite rules that regulate poetry; rhyme and meter are not written whimsically, as in much modern poetry. Amongst the regulated poetry, the Gāyatrī mantra, which is chanted by the duly qualified brāhmaṇas, is the most prominent. The Gāyatrī mantra is mentioned in the Śrīmad-Bhāgavatam. Because the Gāyatrī mantra is especially meant for God realization, it represents the Supreme Lord. This mantra is meant for spiritually advanced people, and when one attains success in chanting it, he can enter into the transcendental position of the Lord.*

*One must first acquire the qualities of the perfectly situated person, the qualities of goodness according to the laws of material nature, in order to chant the Gāyatrī mantra. The Gāyatrī mantra is very important in Vedic civilization and is considered to be the sound incarnation of Brahman. Brahmā is its initiator, and it is passed down from him in disciplic succession. The month of November-December is considered the best of all months because in India grains are collected from the fields at this time and the people become very happy. Of course spring is a season universally liked because it is neither too hot nor too cold and the flowers and trees blossom and flourish. In spring there are also many ceremonies commemorating Kṛṣṇa’s pastimes; therefore this is considered to be the most joyful of all seasons, and it is the representative of the Supreme Lord, Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 253 / Agni Maha Purana - 253 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*

*🌻. శివ పూజా విధి వర్ణనము - 9 / Mode of worshipping Śiva (śivapūjā) - 9 🌻*

*ఆరాధ్యదేవత యొక్క చరణారవిందములపై పాద్యమును, ముఖారవిందమున ఆచమనమును, అర్ఘ్య - దూర్వా - పుష్ప - అక్షతాదులను శిరస్సునను ఉంచవలెను. ఈ విధముగ పది సంస్కారములచే పరమేశ్వరుని సంస్కారము చేసి, గంధ పుష్పాది పంచోపచారములతో యథా విధిగ పూజింపవలెను. మొదట దేవతా విగ్రహమునకు ఉదకముచే అభిషేకము చేసి, రాజికాలవణాదులతో ఉద్వర్తన మార్జనములు చేయవలెను. పిమ్మట అర్ఘ్య జలబిందువులు, పుష్పములు మొదలగు వాటితో అభిషేకము చేసి ఘటములో నున్న ఉదకముతో మెల్లమెల్లగ స్నానము చేయించవలెను.*

*పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార - వీటిని వరుసగ ఈశానతత్పురుష - అఘోర - వాసుదేవ - సద్యోజాత మంత్రములతో అభిమంత్రించి, వాటితో మాటిమాటికి స్నానము చేయించవలెను. వాటిని కలిపి పంచామృతము చేసి, దానితో భగవంతునకు స్నానము చేయించవలెను. దీనివలన భోగమోక్షములు, లభించును. పైన చెప్పిన క్షీరము మొదలైనవాటిలో జలధూపములు కలిపి, మూలమంత్రముతో శివునకు అభిషేకము చేయవలెను. పిదప యవపిష్టముతో జిడ్డుపోవు నట్లు చేసి శీతలజలముతో స్నానము చేయించవలను. యథాశక్తిగ చందన - కేసరాదయుక్త మగు ఉదకముతో స్నానము చేయించి వస్త్రముతో విగ్రహమును బాగుగా తుడవవలెను. పిదప అర్ఘ్యము సమర్పింపవలెను. దేవత మీద హస్తము త్రిప్పగూడదు. శివలింగము తలపై ఎన్నడును పుష్పము లేకుండ ఉంచగూడదు. పిదప ఇతరోపచారములు సమర్పించి చందనాద్యను లేపనము చేయవలెను. శివమంత్రము జపించుచు పుష్పార్పణ చేసి పూజించవలెను. అస్త్రమంత్రము (ఫట్‌)తో ధూపపాత్రను ప్రోక్షించి, శివమంత్రముతో ధూపముచే పూజించవలెను. అస్త్రమంత్రముచే పూజింపబడిన ఘంట మ్రోగించుచు గుగ్గులు ధూపము వేయవలెను. ''శివాయ నమః'' అను మంత్రము నుచ్చరించుచు అమృతమధుర మగు జలముతో ఆచమనము సమర్పించవలెను. పిమ్మట ఆరతి ఇచ్చి ఆచమనము చేయించవలెను. నమస్కరించి, దేవత అనుమతి గైకొని భోగాంగముల పూజ చేయవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 253 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 9 🌻*

62-65. The water for washing the feet should be offered preceded by the recitation of the hṛd (mantra). The water (should be offered) at the lotus feet and the water for the rinsing of the mouth at the face of the image, the respectful offering at the head of the lord along with the dūrvā (grass), flowers and unbroken rice. Having purified the supreme lord with the ten purifications thus, one should worship with the five kinds of services such as the flowers etc. as laid down (in the code books). Having sprinkled and rubbed (the image) with salt, mustard seed etc., it should be slowly bathed with drops of water, flowers, perfumes, milk, curd, ghee, honey and sugar successively.

66. The defects in the above materials should be rectified by worshipping with materials along with the recitation of Īśa mantras. Lord Śiva should be bathed with water and fragrance with the principal mantra.

67-68. Having applied the paste of barley, it should be bathed copiously with cold water and also with fragrant water according to one’s ability. Having wiped it dry with a clean cloth, the preliminary offering of water should be given. The hand should not be moved over the head (of the image). The liṅga should never be left without any flower on its head.

69. Having smeared it with sandal etc. and worshipped with flowers with the mantras of Śiva, the vessel for holding the perfumes should be consecrated with the weapons (mantra) and worshipped with the mantras of Śiva.

70. The bell consecrated by the weapon (mantra) should be taken and the incense should be offered. The water for rinsing should be given then (with the repetition of) svadhā at the end and with the hṛd mantra.

71. Having shown light for the idol in the night, then water for rinsing should be offered. After having made obeisance to god and taking his permission, eatables and other articles of enjoyment should be offered.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 119 / DAILY WISDOM - 119 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 28. మానసిక అగాధం / 28. Psychological Gulf🌻*

*ఆధ్యాత్మిక విలువలు మరియు కాలంలో మారిపోయే విలువల మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసం చరిత్రలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తి యొక్క ఆచరణాత్మక జీవితానికి అంతరాయం కలిగించే ఈ మానసిక అగాధం కొంత వ్యక్తిగత మరియు కొంత సామాజికంగా అనేక రూపాలను కలిగి ఉంది. కానీ, ప్రజల మనస్సులలో ఉపచేతనంగా పనిచేసే ఈ భావన యొక్క స్వభావం ఏదైనప్పటికీ, ఇది చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంటుంది.*

*ఆధ్యాత్మిక మరియు లౌకిక జీవనాలకి మధ్య ఉండే విభజన ఈ విషయ మూలాలకు ఒక అత్యుత్తమ ఉదాహరణ. ఇది వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోనే కాకుండా సామాజిక మరియు రాజకీయ జీవిత స్థాయిలలో కూడా వ్యక్తమవుతుంది. మనిషి ఆలోచనలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న ఈ లక్షణం కారణంగానే అతనికి అప్పుడప్పుడు నిమ్న విషయ వస్తువుల పట్ల వైరాగ్యం, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి వస్తాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 119 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 28. Psychological Gulf 🌻*

*There has been through the history of time a visible irreconcilability, though looking apparent, between the values spiritual and the values temporal. This psychological gulf that has been persistently managing to interfere with the practical life of the individual has many forms which are partly personal and partly social. But, whatever be the nature of this insistent feeling subconsciously operating in the minds of people, it has, obviously, far-reaching consequences.*

*The usual demarcation that is traditionally made between the life religious and the life secular is an outstanding example of the roots of this phenomenon which has manifested itself not only in the private lives of individuals but also in the social and political levels of life. It is this feature inextricably wound up in the thought of man that makes him feel occasionally the rise of a fervour of a renunciation of Earthly values for those that are religious, or even spiritual in the sense that he is able to comprehend within the limitations of his own psychological being.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 385 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. పద్మాన్ని చూస్తే యిది మురికి నిండిన బురద నుండి పుట్టిందా? అనిపిస్తుంది. జీవితం ఒక నిచ్చెన. దేన్నీ కాదనకు. చివరికి మురికి బురదను కూడా. ప్రతి దాన్నీ పద్మంగా పరివర్తింప జేయాలి. 🍀*

*పద్మం గొప్ప ప్రతీక. అది బురద నించీ వస్తుంది. ప్రపంచంలోకెల్లా అందమైన పువ్వు. మురికి బురద నించీ వచ్చింది. ప్రార్థన లైంగికత నించీ, ఆత్మ శరీరం నించీ వస్తుంది. శరీరం మట్టి, దైవత్వం ప్రపంచం నించీ వస్తుంది. ఉపరితలంలో అది అసాధ్యమనిపిస్తుంది. బురదను చూస్తే యిది నిజంగా జరిగిందా? అనిపిస్తుంది.

పద్మాన్ని చూస్తే యిది మురికి నిండిన బురద నుండి పుట్టిందా? అనిపిస్తుంది. కానీ ఆ పద్మ జననం జరిగిన విధమది. అత్యల్పమైన దానితో అత్యుత్తమైన దానికి ఉన్న సంబంధమది. ప్రతి దానికీ సంబంధముంది. జీవితం ఒక నిచ్చెన. అదే నా ప్రాథమిక బోధన. దేన్నీ కాదనకు. చివరికి మురికి బురదను కూడా. ప్రతి దాన్నీ పద్మంగా పరివర్తింప జేయాలి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 121 / Siva Sutras - 121 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-08. శరీరం హవిః  - 3 🌻*

*🌴. ఆత్మ శుద్ధి అనే యాగంలో దేహమే నైవేద్యంగా ఉంటుంది, అందులో పాల్గొనే శక్తులకు నైవేద్యంగా మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను జ్ఞాన అగ్నిలో పోస్తారు. 🌴*

*భగవంతుడు అన్నింటికంటే సూక్ష్మమైనవాడు, అందుకే సర్వశక్తిమంతుడు. మానవ శరీరానికి సంబంధించినంత వరకు, మిగిలిన రెండు శరీరాలు అంతర్గత మరియు అదృశ్య ఆత్మకు కవచాలుగా ఏర్పడతాయి. నేను అను చైతన్యం మూడు శరీరాల నుండి తొలగించవలసిందని ఈ సూత్రం చెబుతుంది. ఈ ఆలోచనా విధానం మరియు నేను అది లేదా అహం బ్రహ్మాస్మి అని నిరంతర ధృవీకరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కేవలం మౌఖిక ధృవీకరణ ద్వారా బ్రహ్మం కాలేడు. అదే విధంగా మంత్రం యొక్క ప్రకాశాన్ని ఆలోచన ప్రక్రియ ద్వారా గ్రహించకపోతే ఏ మంత్రం ప్రభావవంతంగా ఉండదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 121 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-08.  śarīram havih  - 3 🌻*

*🌴. The body is the oblation in the sacrifice of self-purification in which the impurities of the mind and body are poured in to the fire of knowledge as an offering to the shaktis who participate in it.   🌴*

*God is the subtlest of all, hence He is omnipotent. As far as the human body is concerned, the other two bodies form as coverings for the inner and invisible soul. This aphorism says that I consciousness is to be removed from all the three bodies. This becomes possible only through thought process and continuous affirmation saying that I am That or ahaṁ brahmāsmi. One cannot become Brahman just by verbal affirmation. In the same way no mantra will be effective, unless effulgence of mantra is realised through thought process.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment