శ్రీ శివ మహా పురాణము - 767 / Sri Siva Maha Purana - 767

🌹 . శ్రీ శివ మహా పురాణము - 767 / Sri Siva Maha Purana - 767🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 17 🌴

🌻. విష్ణు జలంధర యుద్ధము - 3 🌻


విష్ణువు అనేక బాణములను ప్రయోగించి ఆ రాక్షసుని ధ్వజమును, ఛత్రమును, ధనుస్సును, బాణములను ఛేదించి, అతనిని హృదయముపై ఒక బాణముతో కొట్టెను (15). అపుడు ఆ రాక్షసుడు గదను చేతబట్టి వేగముగా పైకి లంఘించి గరుడుని తలపై మోది నేలపై పారవైచెను (16). కోపముతో వణుకుచున్న క్రింది పెదవి గల ఆ రాక్షసుడు గొప్ప ప్రకాశము గలది, వాడియైనది అగు శూలముతో విష్ణువును హృదయునందు పొడిచెను (17).

రాక్షస సంహారకుడగు విష్ణువు చిరునవ్వు గలవాడై కత్తితో గదను విరుగకొట్టి శార్‌ఙ్గధనస్సును ఎక్కుపెట్టి వాడి బాణములతో వానిని కొట్టెను రాక్షస సంహారకుడగు విష్ణువు క్రోధావేశమును పొంది మిక్కిలి వాడియగు భయంకరమైన బాణముతో జలంధరాసురుని శీఘ్రముగా నొప్పించెను (19). మహాబలవంతుడగు ఆ రాక్షసుడు విష్ణువుచే ప్రయోగింపబడి మీదకు వచ్చుచున్న ఆ బాణమును గాంచి, దానిని మరియొక బాణముతో ఛేదించి వెంటనే విష్ణువును వక్షస్థ్సలముపై గొట్టెను (20). మహాబాహుడు, వీరుడు అగు విష్ణువు కూడా రాక్షసునిచే ప్రయోగింప బడిన ఆ బాణమును నువ్వుగింజ ప్రమాణములో నుగ్గు చేసి సింహనాదమును చేసెను (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 767🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 17 🌴

🌻 The fight between Viṣṇu and Jalandhara - 3 🌻


15. Striking with a single arrow, Viṣṇu smote the heart of the Asura. With innumerable arrows he cut off the umbrella, banner, bow and arrows of the demon.

16. Seizing the mace with his hand, the Asura jumped up quickly, hit Garuḍa on his head and felled him to the ground.

17. The infuriated Asura with throbbing lips hit Viṣṇu in his heart with his sharp spear diffusing its splendour.

18. Viṣṇu laughingly split the mace with his sword. The destroyer of Asuras twanged his bow and split him with sharp arrows.

19. Viṣṇu the infuriated destroyer of the Asuras smote the Asura Jalandhara with a very sharp terrifying arrow.

20. On seeing his arrow coming, the powerful Asura cut it off with another arrow and hit Viṣṇu in the chest.

21. The heroic Viṣṇu of long arms split the arrow discharged by the Asura to the size of gingelly seeds and roared.



Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment