🌹 16, AUGUST 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 16, AUGUST 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
🌹 శ్రావణ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అందరికి 🌹 
1) 🌹 శివ సూత్రాలు - 1- సూత్రం 4 : జ్ఞానానికి మూల ఆధారం శ్రీమాత ప్రసాదించిన అక్షరాలు 🌹
2) 🌹 Shiva Sutras - 1- Sutra 4 : The foundation of knowledge is the letters granted by the divine mother 🌹
3) 🌹 शिव सूत्र - 1- सूत्र 4: ज्ञान का आधार वह वर्ण हैं जो श्रीमाता द्वारा प्रदान किए गए हैं। 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 564 / Bhagavad-Gita - 564 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 13 / Chapter 15 - Purushothama Yoga - 13 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 964 / Vishnu Sahasranama Contemplation - 964 🌹
🌻 964. తత్త్వవిత్, तत्त्ववित्, Tattvavit 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 2 🌹 
🌻 555. 'కలికల్మష నాశినీ'- 2 / 555. 'Kalikalmasha Nasini' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శ్రావణ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*వరలక్ష్మీ వ్రతంపద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే*
*నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా*
*క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే*
*సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే* 
*శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శివ సూత్రాలు - 1- సూత్రం 4 : జ్ఞానానికి మూల ఆధారం శ్రీమాత ప్రసాదించిన అక్షరాలు 🌹*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

*శివ సూత్రాలలోని 4వ సూత్రం, 'జ్ఞాన అధిష్టానం మాతృక', జ్ఞానానికి పునాదిగా ధ్వని (శబ్ద బ్రహ్మ) మరియు సర్వోన్నతమైన తల్లి (మాతృక) మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని అన్వేషిస్తుంది. ఇది అచ్చులు మరియు హల్లుల కలయిక ద్వారా శివ మరియు శక్తి మధ్య సంకేత సంబంధాన్ని పరిశోధిస్తుంది మరియు పరిమిత జ్ఞానం మరియు అజ్ఞానానికి కారణమయ్యే మూడు మలినాలను అధిగమించడం ద్వారా అంతిమ విముక్తికి దారితీసే శక్తి యొక్క పాత్రను వివరిస్తుంది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Shiva Sutras - 1- Sutra 4 : The foundation of knowledge is the letters granted by the divine mother 🌹*
*Prasad Bharadwaj*

*The 4th Sutra of the Shiva Sutras, "Jnana Adhishtaanam Maatrika," explores the profound relationship between sound (Shabda Brahma) and the supreme mother (Maatrika) as the foundation of knowledge. It delves into the symbolic connection between Shiva and Shakti through the union of vowels and consonants and the role of Shakti in leading to ultimate liberation by overcoming the three impurities that cause limited knowledge and ignorance.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 शिव सूत्र - 1- सूत्र 4: ज्ञान का आधार वह वर्ण हैं जो श्रीमाता द्वारा प्रदान किए गए हैं। 🌹*
*✍️ प्रसाद भारद्वाज*


*शिव सूत्रों का चौथा सूत्र, "ज्ञान अधिष्ठानम् मातृका," ध्वनि (शब्द ब्रह्म) और सर्वोच्च माता (मातृका) के बीच गहरे संबंध का अन्वेषण करता है। यह शिव और शक्ति के बीच स्वर और व्यंजन के मिलन के माध्यम से प्रतीकात्मक संबंध और शक्ति की भूमिका को अंतिम मुक्ति की ओर ले जाने में, जो सीमित ज्ञान और अज्ञानता के तीन दोषों को दूर करने में है, को समझाता है।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 564 / Bhagavad-Gita - 564 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 13 🌴*

*13. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |*
*పుష్ణామి చౌషధీ: సర్వా: సోమో భూత్వా రసాత్మక: ||*

*🌷. తాత్పర్యం : నేను ప్రతి గ్రహమునందును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్ష్యయందు నిలిచియున్నవి. నేనే చంద్రుడనై సర్వఓషధులకు జీవరసమును సమకూర్చుచున్నాను.*

*🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానుని శక్తి చేతనే సకలగ్రహములు అంతరిక్షమున నిలిచియున్నవని ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. బ్రహ్మసంహిత యందు చర్చింపబడినట్లు అతడు ప్రతి కణమునందును, ప్రతి గ్రహమునందును, ప్రతి జీవియందును ప్రవేశించును. ఆ భగవానుని సంపూర్ణాంశయైన పరమాత్మయే గ్రహములందు, విశ్వమునందు, జీవుని యందు, కణమునందు కూడా ప్రవేశించునని దాని యందు తెలుపబడినది. అనగా అతడు ప్రవేశము చేతనే సర్వము తగిన రీతి వ్యక్తమగుచున్నది.*

*ఆత్మ యున్నంతవరకు మనుజుడు నీటిపై తేలగలిగినను, ఆత్మ దేహము నుండి వేరైనంతనే మరణించి నీటియందు మునిగిపోవును. నీటి యందు క్రుళ్ళిన తరువాత దేహము గడ్డిపోచవలె నీటిపై తేలుననుట సత్యమేయైనను మరణించినంతనే మాత్రము దేహము నీటిలో మునిగిపోవును. అదే విధముగా గ్రహములన్నియును అంతరిక్షమున తేలుటకు శ్రీకృష్ణ భగవానుని దివ్యశక్తి వాటి యందు ప్రవేశించియుండుటయే కారణము.* 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 564 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 15 - Purushothama Yoga - 13 🌴*

*13. gām āviśya ca bhūtāni dhārayāmy aham ojasā*
*puṣṇāmi cauṣadhīḥ sarvāḥ somo bhūtvā rasātmakaḥ*

*🌷 Translation : I enter into each planet, and by My energy they stay in orbit. I become the moon and thereby supply the juice of life to all vegetables.*

*🌹 Purport : It is understood that all the planets are floating in the air only by the energy of the Lord. The Lord enters into every atom, every planet and every living being. That is discussed in the Brahma-saṁhitā. It is said there that one plenary portion of the Supreme Personality of Godhead, Paramātmā, enters into the planets, the universe, the living entity, and even into the atom. So due to His entrance, everything is appropriately manifested. When the spirit soul is there, a living man can float on the water, but when the living spark is out of the body and the body is dead, the body sinks. Of course when it is decomposed it floats just like straw and other things, but as soon as the man is dead, he at once sinks in the water. Similarly, all these planets are floating in space, and this is due to the entrance of the supreme energy of the Supreme Personality of Godhead. His energy is sustaining each planet, just like a handful of dust. If someone holds a handful of dust, there is no possibility of the dust’s falling, but if one throws it in the air it will fall down. Similarly, these planets, which are floating in the air, are actually held in the fist of the universal form of the Supreme Lord.*

*By His strength and energy, all moving and nonmoving things stay in their place. It is said in the Vedic hymns that because of the Supreme Personality of Godhead the sun is shining and the planets are steadily moving. Were it not for Him, all the planets would scatter, like dust in air, and perish. Similarly, it is due to the Supreme Personality of Godhead that the moon nourishes all vegetables. Due to the moon’s influence, the vegetables become delicious. Without the moonshine, the vegetables can neither grow nor taste succulent. Human society is working, living comfortably and enjoying food due to the supply from the Supreme Lord. Otherwise, mankind could not survive. The word rasātmakaḥ is very significant. Everything becomes palatable by the agency of the Supreme Lord through the influence of the moon.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 964 / Vishnu Sahasranama Contemplation - 964 🌹*

*🌻 964. తత్త్వవిత్, तत्त्ववित्, Tattvavit 🌻*

*ఓం తత్త్వవిదే నమః | ॐ तत्त्वविदे नमः | OM Tattvavide namaḥ*

*వేత్తి తత్త్వస్వరూపం యో యథావత్ స హి తత్త్వవిత్ ।*
*ఇతి విష్ణురేవోక్తో వేదాన్తార్థవిశారదైః ॥*

*పరతత్త్వ స్వరూపమయిన తన తత్త్వమును ఉన్నదానిని ఉన్నవిధమున ఎరిగినవాడు కనుక విష్ణువు తత్త్వవిత్.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 964 🌹*

*🌻964. Tattvavit🌻*

*OM Tattvavide namaḥ*

*वेत्ति तत्त्वस्वरूपं यो यथावत् स हि तत्त्ववित् ।*
*इति विष्णुरेवोक्तो वेदान्तार्थविशारदैः ॥*

*Vetti tattvasvarūpaṃ yo yathāvat sa hi tattvavit,*
*Iti viṣṇurevokto vedāntārthaviśāradaiḥ.*

*Since He knows the penultimate Truth i.e., his svarūpa or nature, as it is - He is called Tattvavit.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥
Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr‌t prāṇajīvanaḥ,Tattvaṃ tattvavidekātmā janmamr‌tyujarātigaḥ ॥ 103 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 555 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 555 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*

*🌻 555. 'కలికల్మష నాశినీ'- 2 🌻*

*అహంకారమను కల్మషము మమకారమునకు దారితీయును. నేను, యితరులు అను భావము నుండి నాది, యితరులది అను భావన పుట్టును. మమకారము వలన మోహము పుట్టును. మోహము చేత నేను, నావారు, నాది అనెడి భావములు బలపడును. అటుపైన లోభము పుట్టును. యిట్లు ఒక సోపాన క్రమమున అజ్ఞాన మలినములు పేరు కొనుచుండును. అందు జీవుడు మునిగిపోవును. నిత్యమూ ఈ మలినములను జ్ఞానముతో హరించవలెను. నేనను అహంకారమే వీనికి మూలము గనుక తన మూలమును గూర్చి భావన చేయవలెను. నేనున్నాను అనుకొనుట భ్రమ. దైవమే తానుగ నున్నాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 555 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*
*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*

*🌻 555. 'Kalikalmasha Nasini' - 2 🌻*

*The defect of ego leads to attachment. From the feeling of I and others arises the feeling of mine and others'. Attachment begets desire. The feelings of I, mine, and mine are strengthened by desire. Upon that, greed arises. In this way, step by step, defects of ignorance pile up. Jeeva will drown in them. These defects should be removed regularly with wisdom. Ego is the root of this and hence should be reflected upon. To think that one is, is an illusion. God is in oneself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment