🌹 17, AUGUST 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀 🌹 17, AUGUST 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 565 / Bhagavad-Gita - 565 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 14 / Chapter 15 - Purushothama Yoga - 14 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 965 / Vishnu Sahasranama Contemplation - 965 🌹
🌻 965. ఏకాఽఽత్మా, एकाऽऽत्मा, Ekā’’tmā 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 3 🌹 
🌻 555. 'కలికల్మష నాశినీ'- 3 / 555. 'Kalikalmasha Nasini' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 565 / Bhagavad-Gita - 565 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 14 🌴*

*14. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత: |*
*ప్రాణాపానసమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ ||*

*🌷. తాత్పర్యం : ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను, ప్రాణాపానవాయువులతో కూడి నేను నాలుగు విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను.*

*🌷. భాష్యము : భుజించిన ఆహారము జీర్ణము చేయుటకు ఉదరమందు అగ్ని కలదని ఆయుర్వేదము ద్వారా మనకు అవగతమగుచున్నది. అట్టి అగ్ని తగినరీతి ప్రజ్వరిల్లినపుడు ఆకలి కలుగును. సరిగా ప్రజ్వలితము కానపుడు ఆకలి కాదు. ఆ విధముగా అగ్ని తగినరీతి ప్రజ్వలితము కానపుడు వైద్యము అవసరమగును. ఉదరమునందలి ఆ అగ్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము. శ్రీకృష్ణ భగవానుడు అగ్నిరూపమున ఉదరమునందు వసించి అన్నిరకములైన ఆహారమును పచనము చేయుచున్నాడని బృహదారాణ్య కోపనిషత్తు(5.9.1) నిర్ధారించు చున్నది (ఆయ మగ్ని: వైశ్వానరో యో (యం అంత:పురుషే యేనేద మన్నం పచ్యతే). అనగా భగవానుడు సర్వవిధ ఆహారపచనము నందు సహాయభూతుడగు చున్నందున భోజన విషయమున జీవుడు స్వతంత్రుడు కాడు. జీర్ణక్రియయందు భగవానుడు తోడ్పడనిదే జీవునకు ఆహారమును భుజింప అవకాశము కలుగదు.*

*ఈ విధముగా శ్రీకృష్ణుభగవానుడు ఆహారమును సృష్టించుట మరియు ఉదరమున జీర్ణము చేయుట వంటి కార్యముల నొనరించుట చేతనే, మనము జీవితమున అనుభవించ గలుగుచున్నాము. ఈ విషయము వేదాంతసూత్రము నందు(1.2.27) కూడా “శబ్దాదిభ్యో(న్త: ప్రతిష్టానాచ్చ” యని స్థిరీకరింపబడినది. అనగా శ్రీకృష్ణభగవానుడు శబ్దమునందు, దేహమునందు, వాయువు నందేగాక ఉదరమందు జీర్ణకారకశక్తి రూపమును స్థితుడై యున్నాడు. ఇక నాలుగురకముల ఆహారములనగా భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములని భావము. వీటన్నింటిని జీర్ణము చేయువాడు భగవానుడే.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 565 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 15 - Purushothama Yoga - 14 🌴*

*14. ahaṁ vaiśvānaro bhūtvā prāṇināṁ deham āśritaḥ*
*prāṇāpāna-samāyuktaḥ pacāmy annaṁ catur-vidham*

*🌷 Translation : I am the fire of digestion in the bodies of all living entities, and I join with the air of life, outgoing and incoming, to digest the four kinds of foodstuff.*

*🌹 Purport : According to Āyur-vedic śāstra, we understand that there is a fire in the stomach which digests all food sent there. When the fire is not blazing there is no hunger, and when the fire is in order we become hungry. Sometimes when the fire is not going nicely, treatment is required. In any case, this fire is representative of the Supreme Personality of Godhead. Vedic mantras (Bṛhad-āraṇyaka Upaniṣad 5.9.1) also confirm that the Supreme Lord or Brahman is situated in the form of fire within the stomach and is digesting all kinds of foodstuff (ayam agnir vaiśvānaro yo ’yam antaḥ puruṣe yenedam annaṁ pacyate). Therefore since He is helping the digestion of all kinds of foodstuff, the living entity is not independent in the eating process.*

*Unless the Supreme Lord helps him in digesting, there is no possibility of eating. He thus produces and digests foodstuff, and by His grace we are enjoying life. In the Vedānta-sūtra (1.2.27) this is also confirmed. Śabdādibhyo ’ntaḥ pratiṣṭhānāc ca: the Lord is situated within sound and within the body, within the air and even within the stomach as the digestive force. There are four kinds of foodstuff – some are drunk, some are chewed, some are licked up, and some are sucked – and He is the digestive force for all of them.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 965 / Vishnu Sahasranama Contemplation - 965 🌹*

*🌻 965. ఏకాఽఽత్మా, एकाऽऽत्मा, Ekā’’tmā 🌻*

*ఓం ఏకాత్మనే నమః | ॐ एकात्मने नमः | OM Ekātmane namaḥ*

*ఏకశ్చాసౌ హరిరాత్మా చేత్యేకాత్మేతి కథ్యతే ।*
*ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీదితి శ్రుతేః ॥*

*"ఆదియందు ఈ దృశ్యమాన ప్రపంచమంతయు ఒకే ఒక ఆత్మతత్త్వముగా నుండెను" అను ఐత్తరేయ ఉపనిషద్ వాక్యము, "సర్వ విషయములను అనుభవమున పొందును, సర్వ విషయానుభవములను గ్రహించుని, సర్వ భోగ్య విషయములను తినును, అంతటను అన్ని కాలములయందును ఎడతెగని ఉనికి దీనికి కలదు - అని అర్థమును తెలుపు ఆప్నోతి, ఆదత్తే, అత్తి, అతతి అను వ్యుత్పత్తులకు యోగ్యమగు తత్త్వము కావున, ఆత్మకు 'ఆత్మ' అను వ్యవహారము ఏర్పడియున్నది" అను స్మృతి వచనమును ఇచ్చట ప్రమాణములు. ఇన్ని అర్థములను తనయందు వర్తింపజేసికొనగలుగునది పరమాత్ముడు మాత్రమే.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 965 🌹*

*🌻965. Ekā’’tmā🌻*

*OM Ekātmane namaḥ*

एकश्चासौ हरिरात्मा चेत्येकात्मेति कथ्यते ।
आत्मा वा इदमेक एवाग्र आसीदिति श्रुतेः ॥

Ekaścāsau harirātmā cetyekātmeti *kathyate,*
*Ātmā vā idameka evāgra āsīditi śruteḥ.*

*He is one and Ātma vide the śruti 'this ātmā was one only at the beginning.' "That which pervades, that which receives, that which enjoys the objects and that which exists always is called the Ātman."*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥
Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr‌t prāṇajīvanaḥ,Tattvaṃ tattvavidekātmā janmamr‌tyujarātigaḥ ॥ 103 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 555 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 555 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*

*🌻 555. 'కలికల్మష నాశినీ'- 3 🌻*

*దైవమే యిన్ని రూపముల యందున్నాడు. రూపములుగ కూడ నతనే యున్నాడు. సముద్రమే అలగ యున్నది. అన్ని అలలూ సముద్రమే. సముద్రము లేక అల లేదు. అట్లే దైవము లేక తాను లేడు. ఇట్టి భావన మరల మరల జ్ఞప్తికి తెచ్చుకొనుట వలన అహంకారము కొంచెమై యుండును. అపుడు మమకార మోహాది మలినములు సోకవు. ఎంతటి జ్ఞానికైననూ అజ్ఞాన మలినము సోకవచ్చును. కనుకనే నిత్య అనుష్ఠానము అందరికినీ తప్పని సరి. అనుష్ఠానమున కూడ అహంకారము కలుగుట ముఖ్యము. నిత్యము అనుష్ఠానము గావించు చున్నాను అను అహంకారము కూడ పుట్టవచ్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 555 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*
*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*

*🌻 555. 'Kalikalmasha Nasini' - 3 🌻*

*God exists in so many forms. He is the same as the forms. The sea itself is the waves. All waves are the ocean. There is no wave without the sea. Similarly, there is no Self without God. Remembering this feeling again and again will reduce the ego. Then the defects of attachment and desire will not affect. No matter how wise, the defect of ignorance can come. That's why regular anushthana or practice is essential for everyone. It is important that ego in anusthana can also occur. Price that one is practicing anusthana regularly.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment