🌹.ఆత్మ నిష్ఠ - ఆత్మ విచారణ - 3 🌹

🌹.ఆత్మ నిష్ఠ - ఆత్మ విచారణ - 3 🌹

🎤 . శ్రీసద్గురు నారాయణ స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాల ధర్మాన్ని పోషించడమే నా ధర్మం. నా ‘స్వధర్మం’ అది. 🌻


ఉపనిషత్తులు చదివితే ఆనందం అనిపిస్తుంది, బ్రహ్మసూత్రాలు చదివితే ఆనందం అనిపిస్తుంది, సద్గోష్ఠి వల్ల ఆనందాన్ని పొందుతావు.
అంతేగానీ... రామేశ్వరం వెళ్ళి శివాలయంలో పూజారిగారు అర్చన చేస్తూ వుంటే, ఆ అలంకారాన్ని చూసి ఆనందపడవు. ఎందుకని?

ఆయన స్థాణువు. అచలం.
నేను?
నేనూ అదే!
‘నేనేమీ కదిలేవాడిని కాదు. నీకు నాకూ భేదం లేదయ్యా’ -అనేటటువంటి పద్ధతిగా చూసేటటువంటి శక్తి ‘తత్త్వచింతన’వల్ల కలుగుతుంది.

మరి అటువంటి అభేద స్థితిని కదా…
మానవుడు సాధించ వలసిన ఉత్తమమైనటువంటి స్థితి?

కాబట్టి అటువంటి ఉత్తమమైన చైతన్యాన్ని, ఉత్తమమైన ప్రజ్ఞా వికాసాన్ని కదా... నీవు ఎప్పుడూ కలిగి వుండాల్సింది ఆచరణలో...!

దిగింది కొంచెం అప్పడు ఏమయ్యావు? అప్పుడేమయ్యావు?
మంత్రచింతాచ...
ఓం నమో నారాయణాయ
అష్టాక్షరీ మంత్రం, పంచాక్షరీ మంత్రం, షోడశాక్షరీ మంత్రం,హంసమంత్రం... ఆ మంత్రం.. ఈ మంత్రం.. మీ ఉపదేశమంత్రాలు ఇవి అన్నీ... జపం చేస్తూ వుండడం. ఎందుకని?
ద్వైతం వచ్చేసింది. అద్వైత భావన పోయింది. అప్పుడేమయ్యావు?
అచలం పోయి ఎఱుకలోకి వచ్చేశావు.
వచ్చేస్తే?
ఇక అప్పుడు అన్నీ వచ్చేశాయి.సప్తకోటి మహామంత్రాలు వచ్చేశాయి.
‘చిత్తవిభ్రమ కారకః’.
ఆ ఎఱుక ప్రభావం చేత చిత్త విభ్రమ కలిగింది. అర్థమైందా?
మరి అప్పుడేమి చెయ్యాలి?
ఇంకా పడిపోయావు. అక్కడే ఎందుకు ఆగుతావు?
త్రిశంకు స్వర్గం కదా అది. అక్కడ ఆగవు కదా!
అథమం శాస్త్ర చింతాచ.
భగవద్గీతలో అలా చెప్పారండీ...
వివేక చూడామణిలో ఇలా చెప్పారండీ...
అష్టావక్రగీతలో అలా చెప్పారండీ...
ఋభుగీతలో ఇలా చెప్పారండీ...
నారాయణోపనిషత్తులో ఇలా చెప్పారండీ...
ఈశావాస్యోపనిషత్తులో అలా చెప్పారండీ...
ఈ తగాదా మధ్యలో పడి కొట్టుకుపోతుంటాడు.
ఇప్పడు పండితుందరూ ఏ తగాదాలో వుంటారండీ?
ఎప్పుడూ ఈ తగాదాలో వుంటారు.
ప్రవచనం చెప్పేవాళ్ళుకానీ,పండితులు కానీ... వాళ్ళు ఆచరణ శీలంగా వుండరండీ... తత్త్వచింతనలో వుండడు వాడు, వాడు ఎంతసేపు శాస్త్ర చింతనలో వుంటాడు. అర్థమైందా?సరే, ఏదీ చేయకపోవడం కంటే అది ఉత్తమమే. తమోగుణంలో జీవించడం కంటే, అది బెటరే. కానీ... జీవితం గట్టెక్కుతుందా దాని వల్ల? ఎక్కదు కదా!
అథమాథమం చ తీర్థాటనం

అక్కడ ఆగావా ఏమన్నా పోనీ... శాస్త్ర చింతన దగ్గర?

శ్రీశైలం వెళ్తే బాగుండూ...
కేదార్‌నాథ్‌ వెళ్తే బాగుండూ...
అమర్‌నాథ్‌ వెళ్తే బాగుండూ...
రామేశ్వరం వెళ్తే బాగుండూ...
అరుణాచలం వెళ్తే బాగుండూ...
ఏమిటి బాగుండు? ఎవరు బాగుండు?అంతేనా కాదా?

అయితే... ఈ నాలుగూ అవసరమే!
శి: ప్రాధాన్యతను బట్టి...
గు: ఆఁ...

నీవు తమోగుణ స్థాయిలో వున్నావండీ... అప్పుడేమి చెయ్యాలి?
తీర్థాటన చెయ్యాలి.

కొద్దిగా రజోగుణ స్థాయిలో వున్నావండీ...
అప్పుడు శాస్త్ర చింతన చెయ్యాలి.
సత్వగుణ స్థాయిలో వున్నావండీ...
అప్పుడు మంత్ర.. (ఆంతరిక)మానసిక జపం చెయ్యాలి.
గుణాతీతంగా వున్నావండీ... తత్త్వచింతన చెయ్యాలి.అర్థమైందా?
కాబట్టి,
ఎవరైతే నిరంతరాయంగా... గుణాతీతంగా తత్త్వచింతనలో వుండి నిమగ్నమైపోయున్నారండీ... ఇప్పుడు వాడికి మిగిలిన మూడూ తోచాయా?
తోచడం లేదుగా... ఎందుకని?

నేను బ్రహ్మనిష్ఠుడను.
బ్రహ్మస్వరూపుడను.
నేను ఆత్మస్వరూపుడను.
నేను పరబ్రహ్మస్వరూపుడను.
నేను ఈశ్వరుడను.

వాడికి ఎప్పుడూ అక్కడ పనిచేస్తూ వుంటుంది. దిగదు కిందకు అది. అర్థమైందా?
అప్పుడు కిందకి దిగని వాడికి ఏం చెబుతాం వాడిని... దిగితే కదా...!
గుణత్రయంలోకి దిగితేగా.
త్రిపుటిలోకి దిగివస్తే తప్ప... వాడిని ఏం చెయ్యలేవుగా...! అర్థమైందా?

కాబట్టి, ఇట్లా నిజజీవితంలో ఎవరైతే... సదా తత్వచింతనలో వున్నారో,
వాడికి ఇప్పుడు కాంక్ష వుందా?
మోహం వుందా?
శి: లేదు..
గు: ఎందుకని?
‘ఇది చాలలేదు’ అనడానికి వాడు దిగిరావడం లేదుగా అసలు...!

పైనున్న కైలాస శిఖరం పై నుంచీ... కిందకి దిగితే కదా...
దిగడం లేదుగా అసలు వాడు. సదా సదాశివుడే.
సదా... సదాశివుడే!
సదా... సమాధి నిష్ఠుడే!
సదా... ఆత్మ నిష్ఠుడే!
సదా... బ్రహ్మనిష్ఠుడే!
సదా... ముక్తుడే!
వాడికి తోచడం లేదు కదా... ప్రపంచం.
తోస్తేకదా... వాడిని ఏమన్నా అడగడానికి.

ప్రపంచం తోస్తే... అప్పుడు అసంతృప్తి.
అసంతృప్తి నుంచీ అవసరం...
అవసరం నుంచీ కోరిక...
కోరిక నుంచీ కాంక్ష...
కాంక్ష నుంచీ మోహం...

అసలు ప్రపంచమే తోచకపోతే?
వున్నాయా ఈ ఐదు?
శి: లేవు.
గు: లేవుగా...!

కాబట్టి, ఆత్మనిష్ఠుడు అయినవాడు ఏ నియమాన్ని పాటించాలి ఇప్పుడు?
స్వధర్మాన్ని పాటించాలి!!
ప్రపంచం గురించి ప్రశ్న వేస్తే చాలు.
ఇక చాలయ్యా బాబు. ఆట చాలా కాలం ఆడాను.

మరింక నీ సంగతి ఏంటి?
వచ్చేసారికి నీ సంగతి ఏంటి?అని మరణకాలంలో ప్రశ్నిస్తాడు.
“ఆ నాకేమి అవసరం లేదు”.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment