🌹.ఆత్మ నిష్ఠ - ఆత్మ విచారణ - 1🌹
🎤 . శ్రీసద్గురు నారాయణ స్వామి📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కాల ధర్మాన్ని పోషించడమే నా ధర్మం. నా ‘స్వధర్మం’ అది. 🌻
1. స్వధర్మం
2. అవసరం లేదు
3. ఇక చాలు
4. ఏదీ శాశ్వతం కాదు
5. దేహానికే మరణము
6. సంసిద్ధత
7. అవగాహనత /మేలుకో
… కాంక్ష, మోహం లోనుంచి బయిటపడాలి అనంటే,
మూడు నియమాలను పెట్టుకోవాలి కదా!
ఏమిటి? అవి.
(1). ‘ధర్మం తప్పి ప్రవర్తించను’-అనేది వుండాలా? వద్దా?
అదేమిటి?
స్వధర్మం, పరధర్మం.
So, ధర్మం తప్పి ప్రవర్తించడం అంటే?
స్వధర్మాన్ని తప్పి ప్రవర్తించను. ఆత్మధర్మాన్ని తప్పి ప్రవర్తించను.
ఆత్మధర్మాన్ని తప్పి ప్రవర్తించినదంతా అధర్మమే. పర ధర్మమే. అర్థమైందా?
ఇంకొకటి ఏమిటి?
(2). ఇకచాలు.
ఇక చాలా? ఉన్నది చాలా?
శి: ఉన్నది చాలు.
గు: ‘ఉన్నది చాలు’ అంటే... ఇంకా అందులో శేషం మిగిలి వుందిగా...
శి: ‘ఇక చాలు’ - అనగలగాలి.
గు: ‘ఉన్నది చాలు’ - అన్నవాడికి...
అప్పుడేమయ్యింది? శేషం మిగలడం లేదా?
ఆత్మ ధర్మంలో, ‘ఉన్నదిచాలు’అనడానికి అక్కడ ఏముంది?
అంతటా వున్నదే కానీ అది,పరిమితంగా లేదుగా. కాబట్టి ప్రపంచానికి సంబంధించినటువంటి పరధర్మ విషయం వచ్చింది.
అక్కడేమి చెప్పాడు ఇక?
‘ఇక చాలు’ - అన్నాడు.
‘ఉన్నది చాలు’ - అనడం లేదు ఇప్పడు.
‘ఇక చాలు’ - అన్నాడు.
‘ఇక చాలు’ - అని ఎప్పుడైతే అన్నాడో ఏమైంది? ముగిసిపోలేదా ఇక...?
Full stop పడిపోయింది.
‘ఉన్నది చాలు’ - అంటే ప్రపంచం మిగిలింది ఇంకా.
విషయం కూడా మిగిలింది ఇంకా.
ఆసక్తి కూడా మిగిలింది ఇంకా అక్కడ.
ఇక చాలయ్యా! ఈ ఆట చాలా కాలం ఆడాను, ఇంకెంత కాలం ఆడతాను?
నేను ఎప్పటి నుంచో ఆడుతూనే వున్నాను. ఎన్నో లక్షల జన్మల్లో ఆడుతూనే వున్నాను.
ఈ జననమరణాలనే ఆట ఆడుతూనే వున్నాను.
ఇకచాలు. ఈ జన్మతో ఇక చాలు. అర్థమైందా?!
‘ధర్మం తప్పను’, ‘ఇక చాలు’.
(3). మూడవ నియమం.... ‘అవసరం లేదు’. ఇది చాలా బలమైనటువంటి నియమం.
జననమరణాలు కలగడానికి కారణం ఏమిటి?
అవసరమేగా! ‘అవసరం వుంది’అనే భావన వుందనుకోండి, మళ్ళా రాక తప్పదు.
కాబట్టి ‘అవసరం లేదు’ అనే నియమాన్ని పాటిస్తే ఏమైంది?
ఇక నేను దానికి లొంగటం లేదు కదా! ఇక, అర్థమైందా?
తీవ్ర వైరాగ్య సంపన్నుడు - జగమొండి.
రాజుకంటే బలవంతుడు.
వాడిని ఏదీ వంచలేదన్నమాట ఇక.
ఎందుకనీ?
వాడి దగ్గర ఈ మూడు నియమాలు వుంటాయి.
1. ధర్మం(స్వధర్మం)తప్పడు.
2. ‘ఇకచాలు’అంటాడు ఏదైనా సరే.
3. ‘అవసరం లేదు’అంటాడు... నువ్వు ఏదైనా చెప్పు,
‘పిపీలికాది బ్రహ్మపర్యంతము’ -అంటున్నామా? లేదా?వివేకచూడామణిలో... అంటున్నామా?ఏమి ఇవ్వబడుతాయి?
అంటే, పిపీలకము నుంచీ బ్రహ్మపదవి వరకూ...
కాబట్టి పిపిలికాది బ్రహ్మపర్యంతమూ నీకు గనుక ఇవ్వబడినప్పటికీ... నువ్వు ఏమన్నావు?
‘అవసరం లేదు’. నాకెందుకు?
పిపీలికాది బ్రహ్మపర్యంతము నీకు ఎక్కడో ఒకచోట అవసరం వుంది అనే భావన వుందనుకోండి, మళ్ళా పుట్టాల్సిందే. మళ్ళా శరీరం ధరించవలసిందే.
కాబట్టి, తీవ్రవైరాగ్య సంపన్నుడు,తీవ్రమోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు,ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు... ఈ మూడు నియమాలను కలిగి వుంటాడు.
ఏమిటి?
“స్వధర్మే నిధనం శ్రేయః” - కేవలం స్వధర్మాన్నే పాటిస్తాడు.
మిగిలిన ఏ పాత్రోచిత ధర్మాలను నేను పాటించను. నాకు అవసరం లేదు.
ఎందుకని?
ఇకచాలయ్యా! చాలాకాలం ఆడాను... పాత్రోచిత ధర్మాలు. ఆట ఎంతోకాలం ఆడాను, ఎన్నో లక్షల జన్మల్లో ఆడాను. నాకంటవు ఇక. నేను ఎదిగాను. పాత్రచేత నేను ప్రభావితం కావడం లేదు. నాకు పాత్రోచిత ధర్మాలు లేవు.
కృష్ణ పరమాత్మ ఏం చేశాడు?తను అందరికీ బంధువేగా? యుద్ధంలో ఏం చేశాడు?
వరుసబెట్టి వేసేశాడు.
మరి ఇప్పుడు బంధువేగా? ఎలా వేశాడు?
నాకు పాత్రోచిత ధర్మాలేమిటి? నేను పరమాత్మను.
కాల ధర్మాన్ని పోషించడమే నా ధర్మం. నా ‘స్వధర్మం’ అది.
“కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమి హ ప్రవృత్తః
ఋతేపిత్వా నభవిష్యంతి సర్వే(అంటున్నాడా?లేదా?)
ఏవస్థితాః ప్రత్యనీకేషుయోధా” (గీత 11-32)
ఏమని చెబుతున్నాడు?
కాలంలో సమస్తలోకాలు పుడుతున్నాయి. పోషించబడుతున్నాయి. లయించ బడుతున్నాయి. పరమాత్మ కాలాతీతుడు. నేను బావా, నేను మరదలు, నేను మరిది, నేను అన్నయ్యా, నేను తమ్ముడు, నేను భర్త,నేను భార్యా... అవేవీ నాకు లేవు.
అర్జునుడు: బావా! ద్వారక మునిగిపోతుంది.
శ్రీకృష్ణుడు: సమయం అయిపోయింది.
ఒక్కటే మాట చెప్పాడు, సమయం అయిపోయింది అన్నాడు.
అర్జునుడు అన్నాడు: ‘ద్వారక మునిగిపోతుంది’.
‘Time అయిపోయిందయ్యా’! అర్థమైందా?
అంతేగాని పరమాత్మ ఎక్కడా వలవలా ఎడవలా.
ఏ సంఘటనలోనూ కన్నీళ్ళు పెట్టలేదు. కారణం?
‘ఇకచాలు’. ఆట చాలాసార్లు ఆడాను.
ఇప్పుడు పరమాత్మగా ఆడుతా.
కాలాతీతంగా ఆడుతా.
దేశకాలములకు అతీతంగా ఆడుతా.
ఆత్మనిష్ఠుడనై ఆడుతా.
బ్రహ్మనిష్ఠుడనై ఆడుతా.
పరబ్రహ్మ నిర్ణయంతో ఆడుతా…!! అప్పుడేమయ్యింది?
“పిల్లలాటల పోలికాయెను”.
ఆటలో ఆసక్తి వుంది.
పెద్దవాళ్ళు పిల్లల ఆటను ఎలా చూస్తున్నారు?
అలా చూస్తా! సృష్టి స్థితి లయాలను.
అప్పుడేమయ్యావు?
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment