🌹. ఆత్మ నిష్ఠ - ఆత్మ విచారణ - 2 🌹
🎤 . శ్రీసద్గురు నారాయణ స్వామి📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కాల ధర్మాన్ని పోషించడమే నా ధర్మం. నా ‘స్వధర్మం’ అది - 2 🌻
నాకు జనన మరణాలెక్కడా?
నాకు జనన మరణాలు లేవు.
జనన మరణాలే లేనన్నవాడికి ఏమిస్తావు?
నువ్వు ఏమిచ్చి సంతృప్తి పరచగలుగుతావు?
నాకు అసంతృప్తే లేదు.
అవసరమే లేదు.
కోరిక అసలే లేదు.
కాంక్ష, మోహములంటావా?
(అవి) కాంక్ష, మోహములు నా చేతిలో కీలుబొమ్మలు.
విష్ణుమాయా ప్రభావం చేత ఎవరైనా ప్రభావితం కావచ్చునేమో కానీ... విష్ణువు ఎందుకు మోహింపబడుతాడు?
వైష్ణవమాయ చేత, జగములెల్ల మోహించబడుతున్నాయి. అంతేగానీ... పరబ్రహ్మ స్వరూపమైనటువంటి విష్ణుమూర్తి ఎందుకు... మహావిష్ణువు ఎందుకు మాయచేత బాధించబడుతాడు?
బాధించబడటం లేదు కదా!
అట్లా మాయను మీరినటువంటి స్థితిని సాధించేటటువంటి స్థితిలో....
‘నేను ఖాళీగా వున్నాను’ అంటావు ఏంటి అసలు?
‘నేను చాలా busy గా వున్నాను’.
ఎంతబిజీగా వున్నాను?
లక్షలాది జన్మలనుంచీ పోగేసిందంతా వదిల్చేపనిలో వున్నా.
నువ్వేమో ఈ కాసేపు కొద్దిగా,లేనిది సంపాదించుకునే పనిలో నువ్వు వుంటే వుండవచ్చేమో!
నేను ఏం పనిలో వున్నాను?
లక్షలాది జన్మలనుంచీ పోగేసానే, ఆ పోగేసినవన్నీ వదుల్చుకునే పనిలో వున్నా నేను.
ఇప్పుడు ఎవరు busy గా వున్నారు?
నేను చాలా busy గా వున్నాను.
నేను చాలా విశాల భావంతో పనులు చేయవల్సిన కాలం ఇది.
పరిమితమైనటువంటి పద్ధతిగా... నా భార్యా, నా కొడుకు, నా కోడలు, నా ఇల్లు, నా మనవడు, నా గోడ, నా సున్నం... అనే కాలం కాదు నాది.
గృహస్థాశ్రమ ధర్మం అయిపోయింది.
ఎప్పటితో ముగిసింది?
పిల్లలకు పెళ్ళి చేశావు. Finished. Your job is finished.
ధర్మం చెప్పింది.
‘నీ ఆఖరి ధర్మం’ ఏమిటయ్యా?
దైవానికి ప్రతినిధిగా నువ్వు చేసే ఆఖరి పని ఏమిటి ?
పిల్లాడికి పెళ్ళిచేయటం. ప్రాజాపత్య ధర్మంలో వాడిని ప్రవేశపెడితే నీ పని అయిపోయింది. ఇహ తరువాత నిన్నెప్పుడూ పీటల మీద కూర్చోమని అడగరు.
అడుగుతున్నారా? చూసుకోండి!
జననం నుంచి అంత్యేష్టి లోపల... నిన్ను మళ్ళా పీటల మీద కూర్చోమని అడగరు ఇక. పిల్లాడికి పెళ్ళి చేసినప్పుడు కూర్చోటమే... ఆఖరి కూర్చోవడం. కర్తృత్వం అయిపోయింది అక్కడితో. కానీ మనం ఏం చేస్తున్నాం?
మనవళ్ళు పుట్టారు, ముని మనవళ్ళు పుట్టారు, వాళ్ళు ఆస్తులు సంపాదించారు. వాళ్ళు సంసారాలు చేశారు. వాళ్ళ పెళ్ళిళ్ళు... ప్రతిచోట నేను పెద్దమనిషిని అంటావే! అంటే ఎక్కడో ఏమైంది దోషం?
ధర్మాన్ని అతిక్రమించి,స్వధర్మాన్ని అతిక్రమించి.... పరధర్మంలోకి ప్రవేశించి కాంక్ష,మోహానికి, ఆసక్తికి బలాన్నిచ్చి... జీవభావంతోనే నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఎందుకని?
Easy కదా! ఈ పని చేయడం.
కాబట్టి ఎదిగేకొద్దీ నేను ఏమయ్యాను ఇప్పుడు?
కాంక్షలు లేవు,
మోహం లేదు,
కోర్కె లేదు,
అవసరం లేదు,
అసంతృప్తి లేదు,
స్వధర్మమే నియమం!!
‘ఇకచాలు’ - దేనికైనా ఒకటే answer. “ఇకచాలయ్యా”!
ఓహో! నేను చాలా చూశాను ఇప్పటికి,
Long long ago, so long ago, చాలా కాలం నుంచీ చూస్తున్నాను నేను. ఈ జన్మలోనేనా... ఎన్నో జన్మలనుంచీ చూస్తున్నా!
చూసి, చూసి, చూసి, చూసి ‘తీవ్ర వైరాగ్యం’ కలిగింది నాకు. అట్టి తీవ్ర వైరాగ్యం చేత, నేనేం చెబుతున్నాను ఇక... ‘ఇక చాలండీ’. ఇంకా.. ఇంకా... అయినా వదిలిపెట్టాననే అన్నా. మళ్ళా ప్రశ్నలేదు.
ఏమన్నావు?
అవసరం లేదు.
ఇంకా మళ్ళా వాడు మన జోలికి వస్తాడా?
ఇహ వాడు రాడు.
అయితే జ్ఞానపరమైనటువంటి ఋణాన్ని మాత్రం తీరుస్తా. ఎందుకని?
ఆత్మనిష్ఠుడైనటువంటి వాడికి ఆ ఒక్క ఋణమే వుంది. ఇంకా మిగిలినవి లేవు. అర్థమైందా?
దైవఋణం, శాస్త్ర ఋణం, ఋషి రుణం, పితృ ఋణం... అంటున్నామా లేదా?
వీటిల్లో ఎప్పడు చూసినాపితృఋణం తీర్చుకోవడంతోనే జీవితం సరిపోతుంది.
ఇంకా శాస్త్ర రుణం, దైవ రుణం,ఋషి రుణం... ఎప్పుడు తీరస్తావు?
దైవీ ప్రణాళికలో భాగం అవ్వాల్సిన అవసరం లేదా?
దైవం చేతిలో పనిముట్టగా జీవించవలసిన అవసరం లేదా?
దైవంతో లయత్వాన్ని, ఆ ఏకత్వ భావాన్ని పొందినటువంటి, స్థిరత్వాన్ని పొందినటువంటి స్థితిని అనుభవించవలసిన అవసరం లేదా?
అప్పుడు కదా దైవ ఋణం తీరేది!
దివ్యజ్ఞానాన్ని పొందినప్పుడు కదా…
ఆ దివ్యత్వాన్ని నువ్వు అనుభవించినప్పుడు కదా…
జీవేశ్వరులు అభిన్నులనేటటువంటి దివ్యత్వాన్ని నువ్వు అనుభవించినప్పుడే, దైవఋణం తీరుతుంది.
తీర్థాటనలు చేస్తే దైవఋణం తీరదు.
పూజలు,జపాలు చేస్తే... దైవ ఋణం తీరదు.
కానీ దానికొక ప్రాతిపదికను తయారు చేశారు.
అది చిత్తశుద్ధికి ఒక ప్రాతిపదికగా పనికి వస్తుంది.
చేయొద్దని కాదు. అందుకనే ఏం చెప్పారు?
ఉత్తమం తత్వచింతాచ,
మధ్యమం మంత్ర చింతాచ,
అథమం శాస్త్ర చింతాచ,
అథమాథమంచ తీర్థాటనం!
పై మూడింటికీ పనికిరాలేదు, అప్పుడేం చేయాలన్నమాట?
తీర్థాటన చెయ్యాలి.
నీ బుద్ధి వికాసం, చైతన్య వికాసం, ప్రజ్ఞా వికాసం... ఉత్తమంగా వుంది - తత్త్వచింతన చేస్తే చాలు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment