2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 200, 201 / Vishnu Sahasranama Contemplation - 200 201🌹
3) 🌹 Daily Wisdom - 14🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 148🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 22 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 169 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 93🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 165 / Sri Lalita Chaitanya Vijnanam - 165🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 506 / Bhagavad-Gita - 506🌹
10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 112🌹
11) 🌹. శివ మహా పురాణము - 312🌹
12) 🌹 Light On The Path - 65🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 197 🌹
14) 🌹 Seeds Of Consciousness - 261🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 136🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 100 / Sri Vishnu Sahasranama - 100🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 595 / Bhagavad-Gita - 595 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 12 🌴*
12. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ: ఫలమ్ |
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ||
🌷. తాత్పర్యం :
ఇష్టము, అనిష్టము, ఇష్టానిష్ఠమిశ్రితము అనెడి మూడు విధములైన కర్మఫలములు త్యాగికానటువంటి వానికి మరణము పిదప కలుగుచున్నవి. కాని సన్న్యాసాశ్రమమునందున్న వారికి మాత్రము సుఖదుఃఖములను కలిగించు అట్టి ఫలములు కలుగుటలేదు
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానునితో గల నిత్యసంబంధ జ్ఞానముతో వర్తించు కృష్ణభక్తిరసభావితుడు సర్వదా ముక్తస్థితి యందే యుండును. కనుక అతడు మరణము పిదప తన కర్మఫలములచే సుఖించుటగాని, దు:ఖించుటగాని జరుగదు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 595 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 12 🌴*
12. aniṣṭam iṣṭaṁ miśraṁ ca tri-vidhaṁ karmaṇaḥ phalam
bhavaty atyāgināṁ pretya na tu sannyāsināṁ kvacit
🌷 Translation :
For one who is not renounced, the threefold fruits of action – desirable, undesirable and mixed – accrue after death. But those who are in the renounced order of life have no such result to suffer or enjoy.
🌹 Purport :
A person in Kṛṣṇa consciousness acting in knowledge of his relationship with Kṛṣṇa is always liberated. Therefore he does not have to enjoy or suffer the results of his acts after death.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 200, 201 / Vishnu Sahasranama Contemplation - 200, 201 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻200. సింహః, सिंहः, Siṃhaḥ🌻*
*ఓం సింహాయ నమః | ॐ सिंहाय नमः | OM Siṃhāya namaḥ*
సింహ ఇత్యుచ్యతే విష్ణుర్యో హినస్తి జగంతి సః ప్రళయకాలమున అన్ని జగములను హింసించు విష్ణువు సింహః అని చెప్పబడును.
:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
ఉ.విశ్వభవస్థితి ప్రళయవేళలయందు వికారసత్త్వమున్‍విశ్వము నీవ యీ నిఖిలవిశ్వము లోలి సృజింతు విందిరాధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీశాశ్వతలీల లిట్టి వని సన్నుతి సేయఁగ మాకు శక్యమే! (436)
ఓ లక్ష్మీ వల్లభా! ఈ ప్రప్రంచం సృష్టించేదీ, రక్షించేదీ, లయం చేసేదీ నీవే! సమస్తమూ నీవై ఈ సమస్త లోకాలను మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నావు. ఈశ్వరా! కేశవా! వేదమయా! దివ్యస్వరూపా! దేవ దేవా! అంతులేని నీ వింత లీలలు "ఇంతటివి అంతటివీ" అని వర్ణించడానికి మాకు చేతనవుతుందా?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 200🌹*
📚. Prasad Bharadwaj
*🌻200. Siṃhaḥ🌻*
*OM Siṃhāya namaḥ*
Siṃha ityucyate viṣṇuryo hinasti jagaṃti saḥ / सिंह इत्युच्यते विष्णुर्यो हिनस्ति जगंति सः During the cosmic dissolution, because He kills, He is known as Siṃhaḥ.
Śrīmad Bhāgavata - Canto 3, Chapter 5
Viśvasya janmasthitisaṃyamārthe kr̥tāvatārasya padāmbujaṃ te,
Vrajema sarve śaraṇaṃ yadīśa smr̥taṃ prayacchatyabhayaṃ svapuṃsām. (42)
:: श्रीमद्भागवते - तृतीय स्कन्धे, पङ्चमोऽध्यायः ::
विश्वस्य जन्मस्थितिसंयमार्थे कृतावतारस्य पदाम्बुजं ते ।
व्रजेम सर्वे शरणं यदीश स्मृतं प्रयच्छत्यभयं स्वपुंसाम् ॥ ४२ ॥
O Lord, You assume incarnations for the creation, maintenance and dissolution of the cosmic manifestation, and therefore we all take shelter of Your lotus feet because they always award remembrance and courage to Your devotees.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 201/ Vishnu Sahasranama Contemplation - 201🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻201. సంధాతా, संधाता, Saṃdhātā🌻*
*ఓం సంధాత్రే నమః | ॐ संधात्रे नमः | OM Saṃdhātre namaḥ*
కర్మఫలైః పురుషాన్ యః సంధత్తే విష్ణురుచ్యతే జీవులను వారి వారి కర్మ ఫలములతో సంధించును లేదా కలుపును గావున శ్రీ విష్ణువు సంధాతా అని చెప్పబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 201🌹*
📚. Prasad Bharadwaj
*🌻201. Saṃdhātā🌻*
*OM Saṃdhātre namaḥ*
Karmaphalaiḥ puruṣān yaḥ saṃdhatte viṣṇurucyate / कर्मफलैः पुरुषान् यः संधत्ते विष्णुरुच्यते One who unites Jīvas with the fruits of their actions.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥
Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 14 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 14. Absolute Being is the Highest Perfection 🌻*
Absolute Being is the highest perfection. Perfection is Bliss. The Self is the seat of Absolute Love, Love without an object outside it. It is Bliss without objectification, for Brahman-Bliss is not derived through contact of subject and object.
Here, Love and Bliss are Existence itself. That which is, is Bliss of Consciousness which is Being. The highest aim of all endeavour is deliverance from the present condition of limited life and the reaching of the Bhuma which is Bliss. Absolute Existence which is Absolute Knowledge is also Absolute Bliss.
The Consciousness of Bliss experienced is in proportion to the growth and expansion that we feel in the conscious being of ourselves. Sat-chit-ananda does not imply a threefold existence, but is Absolute Self-Identity.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 148 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 78 🌻*
కాబట్టి ధ్యానం అంటే నిద్ర పోయేదో, విశ్రాంతి తీసుకునేదో, ఉపరమించేదో .. అలాంటి శరీర స్థానం నుంచి మనసనేటటువంటి స్థానం మధ్యలో జరిగేటటువంటి ప్రక్రియ కాదు. ఇది నీ లోపల ఙాత అనే సాక్షి, బ్రహ్మాండ సాక్షియైన కూటస్థ స్థితిని పొందే విధానం ఏదైతే ఉందో దానికే ధ్యానం అని, తారకం అనీ పేరు. దానికే తరణమని పేరు. కాబట్టి మధనం చేయాలి. ఎవరైతే ఈ మధనాన్ని చేస్తారో, ఆ మధనం ఆ మానసిక ఆశ్రయం ద్వారా సద్గురు కృపను పొందుతారో వారు మాత్రమే ఈ జ్ఞాత, కూటస్థుడు అభేదము, పరమాత్మ, ప్రత్యగాత్మలు అభిన్నులు అనేటటువంటి సాక్షాత్కార ఙానాన్ని పొందుతారు.
ప్రాణ రూప హిరణ్యగర్భుడున్ను, అగ్ని రూప విరాట్టున్ను పరబ్రహ్మమేయని చెప్పగా, నచికేతుడు, ఓ యమధర్మరాజా! హిరణ్యగర్భ రూపము చేతను, విరాడ్రూపము చేతను ఆ పరబ్రహ్మమును ఏల ఉపదేశించెదవు? సాక్షాత్ పరబ్రహ్మమునే నాకు ఉపదేశింపుమనెను.
అందుకని నచికేతుడు ఏమని అడుగుచున్నాడు, యమధర్మరాజుని?- క్రింది స్థితి, పై స్థితి రెండెందుకు చెప్తున్నావు నాకు? నాకా విరాడ్రూప స్థితి అవసరం లేదు. అంటే అర్ధం ఏమిటి?- నచికేతుడు బ్రహ్మనిష్ఠుడై ఉన్నప్పటికి, సరాసరి పరమాత్మ సాక్షాత్కార ఙానాన్ని అడుగుతున్నాడు. సరాసరి పరమాత్మ స్థితిని తెలిసికోగోరుచున్నాడు, సరాసరి పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అడుగుచున్నాడు.
ఎందుకనిట? తనకు సాధ్యం అయిపోయిన దాన్ని మరల చెప్పటం ఎందుకు. బ్రహ్మగారు ఏం చేసారట? విరాడ్రూపాన్ని ప్రతిపాదిస్తూ, ఆ విరాడ్రూపానికి లక్ష్యంగా పరమాత్మ స్థితిని, పరబ్రహ్మ స్థితిని చెప్పారు. కాబట్టి నాకా విరాడ్రూప స్థితి అవసరం లేదు.ఎందుకని నేను అయ్యే వచ్చాను.
ఎందుకని నేను తురీయనిష్ఠలో ఊండబట్టే యమధర్మరాజును దర్శించ గలిగేటటువంటి సమర్థనీయుడనై వచ్చాను. కాబట్టి మనకున్నటువంటి మహా కారణ స్థితిని , మహర్షిత్వ స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మఙాన స్థితి. ఆ బ్రహ్మజ్ఞాన స్థితి గురించి తనకు కరతలామలకంగా తెలుసు కాబట్టి, పొందవలసినటువంటి లక్ష్యార్ధం గురించే ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ.
వాచ్యార్ధంగా నాకు ఇదంతా తెలుసు. ఏమిటి విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మలు; విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు. అందులో ఈ విరాడ్రూప విశేషమంతా కూడ నాకు తెలిసిందే. కాబట్టి నేను తెలుసుకో గోరుతున్నది ఏమిటంటే పరబ్రహ్మ సాక్షాత్కారమైనట్టి , పరమాత్మ స్థితిని గురించి నాకు ఉపదేశించండి అని వినయంతో యమధర్మరాజును అడుగుతూ ఉన్నాడు.
అంతట యమధర్మరాజు, ఓ నచికేతా! ఆ పరబ్రహ్మము మనోవాక్కులకు అతీతముగా ఉన్నది. రూపము, గుణము గల వానినే శబ్దము బోధించగలుగుచున్నది. రూపరహితమైనటువంటి, గుణ రహితమైనటువంటి పరబ్రహ్మను బోధించుటకు శబ్దము సమర్ధము కాదు. అందుచే విశేషములతో కూడిన హిరణ్యగర్భ, విరాడ్రాది రూపముల ద్వారా, నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును నీవు తెలుసుకొనుమనెను.
ఇట్లా బాబు నచికేతా! నీవు తెలుసుకోవాలి అనుకోంటే మనోవాగతీతమైనటువంటి పరమాత్మను, పరబ్రహ్మమును మనసు ద్వారా వాక్కు ద్వారా తెలుసుకోవటం సాధ్యమయ్యే పనికాదు. కారణం ఏమిటంటే ఈ మనస్సు, వాక్కు శబ్దాన్ని మాత్రమే గ్రహిస్తాయి. శబ్దాతీతమైనటువంటి దాన్ని గ్రహించగలిగే శక్తి వీటికి లేదు. కాబట్టి శబ్దాతీతమైనటువంటి పరబ్రహ్మము, పరమాత్మ “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే“ అనే పద్ధతిగా ఉన్నాయి.
ఎవరైతే “వాంగ్మే మనః ప్రతిష్టతః” - వాక్కును తీసికెళ్ళి, మనఃసంయమనమందు, వాక్కు మనసు సంయమింప చేసినవాడై, అలాగే మనసును తీసికెళ్ళి బుద్ధి యందు, బుద్ధిని మహత్తత్త్వము నందు, మహత్తత్త్వమును అవ్యక్తము నందు, అవ్యక్తమును ప్రత్యగాత్మ యందు సంయమింపచేసేటటువంటి లక్షణం ఎవరికైతే ఉందో,
ఆ రకమైనటువంటి సాధనా క్రమం సాధించేటటువంటి వారెవరైతే ఉన్నారో, ఆ సంయమన విద్య చేత, ఆ అధియజ్ఞం చేత, ఆ ఆంతరిక యజ్ఞం చేత, జ్ఞానయజ్ఞం చేత ఆ రకమైన నిర్ణయానుభూతిని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మౌనమనేటటువంటి ఆశ్రయం ద్వారా, శబ్దాతీతమైనటువంటి పద్ధతి ద్వారా ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది.
బోధించాలి అంటే మరి ఒక మెట్టు దిగి వచ్చి వాగ్రూపంగా, శబ్దాన్ని ఆశ్రయించి బోధించాలి, వ్యాఖ్యానించాలి. అట్లా వ్యాఖ్యానించినపుడు ఒక మెట్టు పరమాత్మ స్థితి నుండి క్రిందకి దిగి పోయి విరాడ్రూపంగా, హిరణ్యగర్భ స్థితినుండే బోధించవలసినటువంటి అగత్యం వస్తుంది. హిరణ్యగర్భ స్థితి దాటిన తరువాత బోధించటానికి అవకాశం ఉండదు.
అవ్యాకృత పరమాత్మలుగా బోధించేటటువంటి అవకాశం లేదు. ఎవరన్నా బోధిస్తున్నారు అన్నా కూడ అది వాచ్యార్ధం తెలియచెప్పటమే కాని, లక్ష్యార్ధం తెలియజెప్పటం కాదు. లక్ష్యార్ధమును మౌనవ్యాఖ్య ద్వారానే అందుకోవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి స్పష్టతను ఇక్కడ అందిస్తున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 22 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. అభంగ్ - 22 🍀*
నిత్యనేమ నామీ తే ప్రాణీ దుర్లభ్!
లక్ష్మీ వల్లభ్ తయా జవళీ!!
నారాయణ హరి నారాయణ హరి!
భుక్తి ముక్తి చారీ ఘరీ త్యాంచ్యా!!
హరి వీణ్ జ'
తో నర్కచి పై జాణా!
యమాచా పాహుణా ప్రాణీ హెయ్!!
జ్ఞానదేవ పుసే నివృత్తీసీ చాడ్!
గగనాహూని వాడ్ నామ ఆహే!!
భావము:
నిత్మ నేమముతో హరి నామ జపము చేసే నరులు బహు దుర్లభము, కాని ఇలా జపము చేసే వారి వద్ద లక్ష్మీవల్లభుని నివాసము ఉండును.
నారాయణ హరి.. నారాయణ హరి.. అని నామ పఠనము చేయువారి ఇంటిలో భుక్తి నాలుగు ముక్తులు నివాసముండును. హరిని వదిలిన జన్మము నరకమే అని తెలుసుకో.. ఈ ప్రాణులు
యమునికే బంధువులు.
నామ మహిమను జ్ఞానదేవుడు వర్ణించమని అడుగగా ఆకాశముకన్న మిన్న నామమని నివృత్తినాథులు తెలిపినారు.
*🌻. నామ సుధ -22 🌻*
నిత్య నేమమున నామ స్మరణము
చేయుప్రాణులే బహు దుర్లభము
హృదయమందున స్థిర నివాసము
లక్ష్మీకాంతుని నిజ స్వరూపము
నారాయణ హరినామ పాఠము
నిత్య నేమమున చేయు జపము
భుక్తి మరియు ముక్తి చతుష్టము
ఉండును వారి ఇంట నివాసము
హరిని భజించని జన్మము వ్యర్థము
నరకము అదియని తెలుసుకొనుము
తప్పదు జీవికి యముని పాశము
భక్తి హీనులకు నరక నివాసము
జ్ఞానదేవులు అడిగిరి వినుము
నివృత్తినాథున్ని తత్వ విచారము
గగనము కన్న మిన్న నామము
అని చెప్పినారు దివ్య జ్ఞానము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 169 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
161
Guru Ashtakam, Sloka 7:
Na bhoge, na yoge, na vaa vajirajou Na kanta mukhenaiva vittesu chittam | Guroranghri padme manaschenna lagnam Tatah kim Tatah kim, Tatah kim Tatah kim ||
So far we discussed that some people feel, “I am prosperous, I have desires”. True. Still, if the mind is not absorbed in the Guru there is no use. Even if you have all the wealth, desires, fame and Karna-like magnanimity and courage (Karna is a character from Mahabharata known for his courage and generosity) , life is worthless if the mind is not absorbed in the Guru’s feet and there is no devotion towards the Guru. They stipulated that if there’s no devotion to the Guru, all these can be dismissed.
Now, they are talking about sacrifice. Lot of people say, “I have no desire at all for pleasures, for Yoga, for karma (action), or for women”. They keep saying this all the time. “What’s there in money? I have no desire for money. All these Yogas – Kriya Yoga, Raja Yoga, whatever, I have no interest. What’s there in them. Sacrifice! I have no interest in luxuries or in Yogas or in karma.
People do a lot of rituals and fire sacrifices. I do not even think of them. I am not interested in women either. I have acquired dispassion. I don’t even believe in Guru”. All this sounds good…they are saying they have no interest in anything. But, it is not enough to say that you have done everything you needed to do.
You will still not attain liberation. Unless you have the Guru’s initiation, your dispassion will not take you anywhere. That is because you do not have the passport called Guru’s initiation. You cannot go to any other world, you cannot attain liberation. Because you do not have the passport of Guru’s initiation.
Some people say, “My father is my Guru, he initiated me”. True. Father and mother are the first Gurus for anyone, but you have a certain leniency with them. Even if they are great Gurus to you, when you see them, you feel the leniency that they are your mother and father.
Once in a while, you will feel, “I am near my father and mother, why should I take their words seriously. They will always forgive me for my mistakes”. That is why you should always follow a Guru. Even if your parents initiate you, even if you consider them your Gurus, you should follow another Guru.
These days, there are many people that will initiate you to a mantra if you give them 10 rupees. Only 10 rupees. It used be 100 rupees in the beginning, it dropped to 50 rupees and now it is 10 rupees. Everything else has increased in price, but the Guru’s initiation has fallen to 10 rupees. It feels like some will even do it in exchange for a cup of coffee.
But, there is no benefit at all from those mantras. First, you must grasp the Guru Principle. Your mind should be absorbed in the Guru. Only then will your dispassion and sacrifice bear fruit.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 93 / Sri Lalitha Sahasra Nama Stotram - 93 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 165 / Sri Lalitha Chaitanya Vijnanam - 165 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |*
*నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖*
*🌻165. 'మమతాహంత్రీ'🌻*
నాది అనుభావమును నశింపజేసి అనుగ్రహించునది శ్రీదేవి అని భావము.
నేను అను భావమున్నప్పుడు నాది అను భావము తప్పదు. నేనెవరు? అను ప్రశ్న తాకిడి జీవులకు కలుగును. ఆ ప్రశ్న కలుగుటయే కాక, అది పరిప్రశ్నయై శోధన ప్రారంభమగుట అనుగ్రహ విశేషము. సంకల్పములకు మూలమైన శ్రీమాత, ఈ సంకల్ప మెవరి కందించునో, అట్టివాడు నేను, తాను అనగానేమో తెలియుటకు ప్రయత్నించును. అది అమ్మ అనుగ్రహము.
అమ్మ అనుగ్రహముననే మరల శోధన, సాధనగా మారి, సాధన సిద్ధించును. అపుడు మమకారము, అహంకారము లేని స్థితి జీవున కందును. అనుగ్రహము కలుగును. ఆరాధనే ఉపాయము. శోధనకు, సాధనకు, సిద్ధికి కూడ శ్రీమాత ఆరాధనే ప్రధానమని ఋషులు నిశ్చయించినారు. అమ్మ అనుగ్రహము లేనిదే, ఇహ పర లోకానుభూతి లేదు కదా! అందువలన మమకారముతో వ్యధ చెందు జీవులకు, “నిర్మమా మమతాహంత్రీ" అనునది నిత్యస్మరణ మంత్రమైనది.
మమకారము పోవలెనన్నచో సాధ్యమా? లేనిది ఉన్నట్లుగా భావించుటచేత మమకార వికారము కలదు. ఎదుటి వస్తువు కాని, జీవి కాని, నాది అనుకొనుట వలన కదా మమకారము! నిజమునకు అది తనదా? ఆ జీవి తనవాడా? అన్నియూ, అందరూ తన సరసన చేరినవారే గాని తనవారు కారు. తాను, ఇతరులు, ఇతరములు అన్నియూ దైవమునకు సంబంధించినవే. అందరూ దైవబంధువులే. ఆత్మ బంధువులే.
ఇతర బంధుత్వములు మోహము, ద్వేషము కలిగించుచుండును. కొందరిపై మోహము వలన మమకారము, కొందరిపై ద్వేషము. కొడుకు పై మమకారము చేత కోడలిపై ద్వేషము లోకసహజము కదా! అట్లే కూతురిపై మమకారము చేత అల్లుడిపై ద్వేషము. ఇటువంటి మాయను ఎవరు దాటగలరు? ఎంత తెలిసిన వారికైనను, ఇసుమంత మమకారముండక పోదు. మోహమను అగాధమున పడుటకు అది చాలును. ఇదియే అమ్మ మాయ.
అందుండి ఉద్ధరించునది కూడ ఆమెయే. మమకారము తీరుటకు అంతయూ, అందరూ దైవమే అని భావించుట, తనకు జరుగుచున్న కర్మానుభవము దైవసంకల్పమే అని సరిపెట్టుకొని తృప్తిపడుట కూడ ఒక ఉపాయము. అందరూ గోవిందునివారే అని భావించుచూ తనవంతు కర్తవ్యము నిర్వర్తించుట నిజమగు వైరాగ్యము. అటుపైన నేనెవరను ప్రశ్న శోధించుట మరియొక ఉపాయము. మమకారమునకు వైరాగ్యము విరుగుడు.
వైరాగ్యమునకు అమ్మ అనుగ్రహము ఆధారము. హరిశ్చంద్రుడు, నలుడు, ధర్మరాజు అమ్మ అనుగ్రహముననే పరిపూర్ణ వైరాగ్యముననుభవించిరి. ఇటీవల కాలమున శ్రీ రామకృష్ణ పరమహంస, అమ్మ అనుగ్రహ విశేషమున పరమహంసగా భౌగోళిక స్ఫూర్తినందించినారు. అమ్మ అనుగ్రహము పొందినవారికి అసాధ్యమగునది ఏమియూ లేదు. మమకారమును ఆమె త్రుటిలో తెంచివేయగలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 506 / Bhagavad-Gita - 506 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 16 🌴*
16. కర్మణ: సుకృతస్యాహు: సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమస: ఫలమ్ ||
🌷. తాత్పర్యం :
సాత్త్వికములైన మంచి కర్మలను చేయుటచే నిర్మల శాంతిసుఖములే ఫలమనియు, రజోకర్మలను చేయుటచే సాంసారిక సుఖదు:ఖములే ఫలమనియు, తామసి కర్మలచే అఙ్ఞానమే ఫలమనియు తత్వవేత్తలు చెప్పిరి.
🌷. భాష్యము :
సత్త్వగుణము నందుండి ఒనరింపబడు పుణ్యకర్మల ఫలితము నిర్మలత్వము లేదా పవిత్రత్వము. కనుకనే మోహరహితులైన ఋషులు సదా ఆనందమునందే స్థితులై యుందురు. కాని రజోగుణమునందు ఒనరింపబడు కార్యములు కేవలము దుఃఖపూర్ణములే.
భౌతికానందము కొరకు చేయబడు ఏ కర్మకైనను అపజయము తప్పదు. ఉదాహరణమునకు ఆకాశమునంటెడి ఎత్తైన భవంతిని మనుజుడు నిర్మింపదలచినచో ఆ భవన నిర్మాణమునకు అత్యంత ఎక్కువ మానవపరిశ్రమ అవసరమగును. తొలుత అతడు అధికమొత్తములో ధనమును కూడబెట్టవలెను. అంతియేగాక భవన నిర్మాణమునకు మనుష్యుల చమటోర్చి పనిచేయవలసివచ్చును.
ఈ విధముగా అడుగడుగునా ఆ కార్యమున దుఖమే అధికముగా నుండును. కనుకనే రజోగుణమునందు చేయబడిన ఏ కార్యముమందైనను గొప్ప దుఃఖము తప్పక ఉండునని భగవద్గీత యందు ఇచ్చట పేర్కొనవడినది. “నాకీ గృహమున్నది, ఇంత ధనమున్నది” అనెడి నామమాత్ర మనస్సంతోషము లేదా సౌఖ్యము కలిగనను వాస్తవమునకు అది నిజమైన సౌఖ్యము కాదు.
ఇక తమోగుణమునకు సంబంధించినంత వరకు ఆ గుణమునందు కర్తయైనవాడు జ్ఞానరహితుడై యుండును. తత్కారణముగా అతని కర్మలన్నియును వర్తమానమున దుఃఖమును కలిగించుటయే గాక, పిదప అతడు జంతుజాలమున జన్మించును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 506 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 16 🌴*
16. karmaṇaḥ sukṛtasyāhuḥ
sāttvikaṁ nirmalaṁ phalam
rajasas tu phalaṁ duḥkham
ajñānaṁ tamasaḥ phalam
🌷 Translation :
The result of pious action is pure and is said to be in the mode of goodness. But action done in the mode of passion results in misery, and action performed in the mode of ignorance results in foolishness.
🌹 Purport :
The result of pious activities in the mode of goodness is pure. Therefore the sages, who are free from all illusion, are situated in happiness. But activities in the mode of passion are simply miserable.
Any activity for material happiness is bound to be defeated. If, for example, one wants to have a skyscraper, so much human misery has to be undergone before a big skyscraper can be built. The financier has to take much trouble to earn a mass of wealth, and those who are slaving to construct the building have to render physical toil.
The miseries are there. Thus Bhagavad-gītā says that in any activity performed under the spell of the mode of passion, there is definitely great misery. There may be a little so-called mental happiness – “I have this house or this money” – but this is not actual happiness.
As far as the mode of ignorance is concerned, the performer is without knowledge, and therefore all his activities result in present misery, and afterwards he will go on toward animal life.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment