సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 22
🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 22 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 22 🍀
నిత్యనేమ నామీ తే ప్రాణీ దుర్లభ్!
లక్ష్మీ వల్లభ్ తయా జవళీ!!
నారాయణ హరి నారాయణ హరి!
భుక్తి ముక్తి చారీ ఘరీ త్యాంచ్యా!!
హరి వీణ్ జ' తో నర్కచి పై జాణా!
యమాచా పాహుణా ప్రాణీ హెయ్!!
జ్ఞానదేవ పుసే నివృత్తీసీ చాడ్!
గగనాహూని వాడ్ నామ ఆహే!!
భావము:
నిత్మ నేమముతో హరి నామ జపము చేసే నరులు బహు దుర్లభము, కాని ఇలా జపము చేసే వారి వద్ద లక్ష్మీవల్లభుని నివాసము ఉండును.
నారాయణ హరి.. నారాయణ హరి.. అని నామ పఠనము చేయువారి ఇంటిలో భుక్తి నాలుగు ముక్తులు నివాసముండును. హరిని వదిలిన జన్మము నరకమే అని తెలుసుకో.. ఈ ప్రాణులు
యమునికే బంధువులు.
నామ మహిమను జ్ఞానదేవుడు వర్ణించమని అడుగగా ఆకాశముకన్న మిన్న నామమని నివృత్తినాథులు తెలిపినారు.
🌻. నామ సుధ -22 🌻
నిత్య నేమమున నామ స్మరణము
చేయుప్రాణులే బహు దుర్లభము
హృదయమందున స్థిర నివాసము
లక్ష్మీకాంతుని నిజ స్వరూపము
నారాయణ హరినామ పాఠము
నిత్య నేమమున చేయు జపము
భుక్తి మరియు ముక్తి చతుష్టము
ఉండును వారి ఇంట నివాసము
హరిని భజించని జన్మము వ్యర్థము
నరకము అదియని తెలుసుకొనుము
తప్పదు జీవికి యముని పాశము
భక్తి హీనులకు నరక నివాసము
జ్ఞానదేవులు అడిగిరి వినుము
నివృత్తినాథున్ని తత్వ విచారము
గగనము కన్న మిన్న నామము
అని చెప్పినారు దివ్య జ్ఞానము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
31 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment