10-APRIL-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 183🌹  
2) 🌹. శివ మహా పురాణము - 383🌹 
3) 🌹 Light On The Path - 132🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -11🌹
5) 🌹 Seeds Of Consciousness - 330🌹   
6) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 205🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 60 / Lalitha Sahasra Namavali - 60🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 60 / Sri Vishnu Sahasranama - 60🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -183 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 24

*🍀 24. ఆరోహణ మార్గము - జీవితమును కోరికలకై వెచ్చింపక, కర్తవ్యమునకై మళ్ళించుట మొదటిమెట్టు. కర్తవ్య నిర్వహణమే కర్మ నిర్వహణము. సంకల్ప ప్రభావము చేత కలిగెడి కోరిక లన్నింటిని పరిపూర్ణముగ విడిచి పెట్టి, మనసేంద్రియములు వినిమయము కలిగి మెల్ల మెల్లగ ధృతి, బుద్ధియందు విశ్రాంతి చెందును. అట్టి ధృతిని బుద్ధి మూలము నందు లగ్నము చేయగ ధ్యానమగును. అంతరంగ ధ్యానమున నిలచిన స్థితి మనో బుద్ధ్యాత్మ స్థితి. అట్టి ధ్యానము ఆత్మయోగమును కల్పించును. అపుడు ఇతర విషయములు లేని కేవలస్థితి కలుగును. దానినే కైవల్యమందురు. 🍀*
 
సంకల్ప ప్రభవాన్ కామాం స్త్యక్యా సర్వా నశేషతః |
మనసై వేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః || 24

సంకల్ప ప్రభావము చేత కలిగెడి కోరిక లన్నింటిని పరిపూర్ణముగ విడిచి పెట్టి, మనసేంద్రియములు వినిమయము కలిగి మెల్ల మెల్లగ ధృతి, బుద్ధియందు విశ్రాంతి చెందును. అట్టి ధృతిని బుద్ధి మూలము నందు లగ్నము చేయగ ధ్యానమగును. అట్టి ధ్యానము ఆత్మయోగమును కల్పించును. అపుడు ఇతర విషయములు లేని కేవలస్థితి కలుగును. దానినే కైవల్యమందురు.

కోరికలు గలవానికి యోగము లేదని కర్మయోగమున తెలుప బడినది. కోరికలు గలవారు కర్మయోగమున కూడ చెందలేరు. కోరికలు ఇంద్రియముల రూపమున ప్రజ్ఞను బాహ్యములోనికి ప్రసరింప చేయును. ఎన్ని కోరికలున్న అంతగ బహిః ప్రవాహ మేర్పడి జీవుడు నీరసించును. కోరికలకు గాని, ఆలోచనలకు గాని, యోగమునకు గాని పెట్టుబడి జీవచైతన్యమే! దానినెట్లు వినియోగింప వలెనో కృష్ణ పరమాత్మ కర్మయోగమున సూచించినాడు. 

జీవితమును కోరికలకై వెచ్చింపక, కర్తవ్యమునకై మళ్ళించుట మొదటిమెట్టు. కర్తవ్య నిర్వహణమే కర్మ నిర్వహణము. అది కాలము, దేశము రూపమున ప్రతి వ్యక్తిని సమీపించును. వాటి నిర్వహణమున ఫలాసక్తి లేకుండుట, వక్రతలు లేకుండుట, విజయ మందినపుడు మోహపడకుండుట, అపజయము కలిగినపుడు శోకము చెందకుండుట జరిగినచో కర్మయోగము సిద్ధించినట్లే. ఇట్లు జరుగుటకు దైవమును ఆరాధించుట, ఆశ్రయించుట నెంతయో ఉపయోగకరము.

అటుపైన తనకున్నదానిలో ఆత్మవంచన లేక ఇతరులకు హితము ఒనర్చుట వలన మనోమాలిన్యములు తొలగి, జ్ఞానాసక్తి ఏర్పడును. తనకున్నవన్నియు దైవమిచ్చినవేయని తలచి, దైవదత్త మని ఎరిగి, ఆర్తులగు జీవులకు వానిని పంచుటవలన మనోనైర్మల్య మేర్పడి బుద్ధియందు ప్రవేశించుట కవకాశ మేర్పడును. 

తన శరీరమును, ఇంద్రియములను, మనోమేధస్సును ఇతరుల కుపయోగ పడునట్లు కర్తవ్య నిర్వహణముతో పాటు సాగుచుండగ జ్ఞానోదయమున కవకాశ మేర్పడును. అంతరంగమున వినిపించుట, కనిపించుట జరిగి జ్ఞానయోగమునకు దారిచూపును. 

మనిషికి జ్ఞానము కలుగుచున్నదా, లేదా అను విషయమునకు గీటురాయి ఒకటియే. ఎట్టి సమయమునందు కాంక్ష, ద్వేషము లేకుండుట, జ్ఞానులనుకొన్న వారికి, భక్తులనుకొన్న వారికి, వారి కాంక్షా ద్వేషము లెట్లున్నవో, ఎప్పటికప్పుడు తరచి చూచుకొనుచుండ వచ్చును. ఈ క్రమమున సమ్యగ్ న్యాసము లభించును. అదియే సన్యాసయోగము. 

కాషాయము కట్టినను కాంక్షలు, ద్వేషము వీడనివారు సన్యాసులు కారు. సంసార మందున్నను, కాంక్షాద్వేషములు లేనివారు సన్యాసులే. ఎందరో యోగులు సంసారమందు సన్యాస స్థితిలో గడిపిరి. అట్లే సన్యాసుల యందుగూడ నిజమగు యోగులున్నారు. పై తెలిపిన సోపానక్రమమే భగవానుడు మరల మరల తెలియజెప్పుచు ముందడుగు వేయించుట భగవద్గీత యందు నిత్యము కన్పట్టును. సంకల్పము సన్యసించుట యోగమున కావశ్యకమని ఈ అధ్యాయమున రెండవ శ్లోకమున దైవము తెలిపినాడు. 

సంకల్పము సన్యసించినపుడు కోరికలే కలుగవు. కర్తవ్య స్ఫురణయే యుండును. దానిని ఈ సూత్రమున ఆవిష్కరించు చున్నాడు. కర్తవ్యము మాత్రమే నిర్వర్తించుచు, ఇతరమగు కోరికలు
లేనపుడు, ఇంద్రియములకంత పనియుండదు. తీరుబడిలేక ఇంద్రియ ద్వారమున జీవుడు బాహ్యమున తిరుగడు. అప్పుడా ఇంద్రియములు జాతికుక్కలవలె మనస్సను యజమానిని అంటి పెట్టుకొని యుండును. 

సంకల్పములు తీవ్రముగ లేనపుడు మనస్సునకు గూడ తీరుబడి ఉండును. సంకల్పములే సన్యసింపబడినపుడు మనస్సునకు తీరుబడి పెరుగును. ప్రశాంతతకూడ పెరుగును. అట్టి మనస్సును బుద్ధితో లగ్నము చేయుట సులభము. బుద్ధియను వెలుగుపై మనస్సు నిలచినపుడు మనస్సు వెలుగై, బుద్ధియై నిలచును. అట్టి బుద్ధిని దానిమూలము పై లగ్నము చేయుట ఈ అధ్యాయమున తెలుపబడుచున్నది. 

అట్లు అంతరంగ ధ్యానమున నిలచిన స్థితి మనో బుద్ధ్యాత్మ స్థితి. అపుడా మనస్సున కితర చింత లెట్లు కలుగును. ఇట్లు పరమాత్మ సోపానక్రమమున ఆత్మతో యోగమును అందించినాడు. సోపానమును ఎవరైనను ఈ విధముగనే ఆరోహణము చేయనగును. ఇతర మార్గములు భ్రమ గొల్పును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 383🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 14

*🌻. వజ్రాంగుడు - 3 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

జ్ఞాని, సత్వ గుణ సంపన్నుడు, విరోధము లేనివాడు అగు ఆ వజ్రాంగుడు ప్రియురాలి ఈ మాటము విని ఆశ్చర్యమును దుఃఖమును పొంది, తన మనస్సులో ఇట్లను కొనెను(33). నా ప్రియురాలు దేవతలతో వైరమును కోరుచున్నది . నాకు వైరమునందు అభిరుచి లేదు. ఏమి చేయుదును? ఎక్కడికి వెళ్లేదను? నాప్రతిజ్ఞ చెడకుండ ఉపాయమేది? (34).ప్రియురాలి కోర్కెను తీర్చినచో , ముల్లోకములు, దేవతలు, మహర్షులు మరల పెద్ద దుఃఖమునకు గురి యగుదురు(35). 

ప్రియురాలి కోరిక తీరనిచో , నాకు నరకము సంప్రాప్తమగును. ఈ రెండు పక్షములలోనూ ధర్మమునకు హాని నిశ్చితమని ఆతడు తలపోసెను (36). ఓ మహర్షీ! వజ్రాంగుడు ఈ తీరును ధర్మ సంకటములో పడి తిరుగాడెను. ఆ రెండు పక్షముల బలాబలములను అతడు బుద్ధితో విమర్శించెను (37).

  ఓ మహర్షీ! విద్వాంసుడగు ఆ వజ్రాంగుడు శివుని సంకల్పముచే ప్రియురాలి వాక్యమును అంగీకరించెను. ఆ రాక్షసరాజు ప్రియురాలితో 'అటులనే గానిమ్ము' అని పలికెను(38). అతడు ఇతరులకు శక్యముగాని తీవ్రమగు తపస్సును ఆమె కోర్కెను

తీర్చుటకు చేసెను. అతడు జితీంద్రియుడై నన్ను ఉద్దేశించి పరమప్రేమతో అనేక సంవత్సరములు తపస్సు జేసెను. (39). నేనా మహాతపస్సును గాంచి, అతనికి వరము నిచ్చుటకై వెళ్లితిని. మిక్కిలి ప్రసన్నమగు మనస్సుతో అతనిని 'వరమును కోరుకొమ్మని' చెప్పితిని(40). ఆకాశమునందున్న విభుడనగు నన్ను చూచి , నేను ప్రీతుడనై యుండుటను గాంచి , ఆ వజ్రాంగుడు సాష్టాంగప్రణామమును చేసి అనేక విధముల స్తుతించి , అపుడు ప్రియురాలి కోరికను వరముగా అడిగెను(41).

వజ్రాంగుడిట్లు పలికెను-

హే ప్రభో! తన తల్లికి గొప్ప హితమును చేకూర్చువాడు, మహాబలశాలి, గొప్ప పరాక్రమము గలవాడు, గొప్ప దక్షుడు, తపససునకు నిధి యగు పుత్రుని నాకు ఇమ్ము(42).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! అతని ఆ వాక్యమును విని, నేను 'అటులన్‌ అగు గాక!' అని పలికితిని. అట్లు వరమునిచ్చి, వికలమైన మనస్సు గలవాడనై, శివుని స్మరించుచూ , నేనూ నా ధామమును చేరుకొంటిని(43).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో వజ్రాంగతపోవర్ణనమనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది.(14)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 132 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 10 - THE Note on 20th RULE
*🌻 20. do you enter into a partnership of joy, which brings indeed terrible toil and profound sadness, but also a great and ever-increasing delight. - 1 🌻*

 501. The disciple enters into a partnership of joy, but this very partnership brings toil and profound sadness, because he oscillates from one condition to the other. He must learn to feel the inner joy, and yet not lose touch with the lower principles of others, in which their sorrow is felt. He must feel that too, but must not be overwhelmed by it. 

The Path is as narrow as the edge of a razor, but we are to maintain perfect equilibrium upon it, while the pairs of opposites play upon us. One great function of the Master is to preserve our balance. The pupil will be swaying from one side to the other. When the gloom comes the Guru will send to him remembrance of the partnership of joy: when he tends to lose complete touch with the sorrows of the world the reminder of sorrow will come.

502. For a long time the disciple is subject to these oscillations. We should not attain perfection unless we experienced the different things separately, before we reached equilibrium. It is the experience of mankind that we have to learn one lesson at a time, that we may give it full attention. 

The disciple who is treading the path is thrown from one side to the other, until he learns to keep the balance. Sometimes an entirely causeless gloom comes down, and he finds himself deep in the shadow. He finds no reason for it; he only knows that it is there – a gloom that he cannot shake off. If he has learned the lesson rightly he will accept that quietly and patiently, and will not try to escape from it. 

He will then learn sympathy and patience, and other lessons which can be learned in the gloom, not in the light. Accepted in this spirit the period of gloom is not such an unwelcome thing, for all the worry and trouble have gone out of it. We should take the lessons, and learn without suffering. People do not suffer so much from gloom as from images. Like a child afraid of the dark, we fill the darkness of the soul with shapes of horror. 

The darkness is simple darkness and nothing else; it contains nothing more than the lessons which it has to teach us, and all the phantoms will, in time, disappear. The darkness can never crush us; at first it paralyzes us with fear, but at last we learn its lesson.

503. At the last Initiation, that of the Master, the atma is seen as a clear light, a star, and when it spreads out, at the last breaking down of the wall, it becomes the infinite light. Before that the Arhat can feel the underlying peace of atma when in meditative mood, but constantly he returns to the sorrow. 

But when a man rises to the atmic plane in full consciousness, and the buddhic consciousness merges into that, there is but one light seen. This is beautifully put in The Voice of the Silence: “The Three that dwell in glory and in bliss ineffable, now in the world of Maya have lost their names. They have become one star, the fire that burns but scorches not, that fire which is the Upadhi of the flame.”

504. While the man was in the causal body, he saw the Sacred Three as separate, but now he sees Them as the three aspects of the triple atma. Buddhi and manas, which were “twins upon a line” in the buddhic consciousness of the previous stage, are now one with atma, the star which burns overhead, the fire which is the vehicle of the monadic flame. 

Then says the Teacher: Where is thy individuality, Lanoo, where the Lanoo himself? It is the spark lost in the fire, the drop within the ocean, the ever present ray become the All and the eternal Radiance.” He who was disciple is now a Master. He stands in the centre, and the triple atma radiates from him.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 11 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚. ప్రసాద్ భరద్వాజ

కొందఱు తమకు రాజ్యము కావలెననియు , పదవులు కావలెననియు కోరి దేవుని భజించుచున్నారు.  

వారికా ఫలితములను దేవుడే తగిన విధమున ప్రసాదించుచునే యున్నాడు. ఆ ఫలితములపై వారికి గల ఆకర్షణమే వారిని దేవుని ధ్యానమున నిలుపును. దానివలన వారు ఆపదలకు గురికాక ధర్మమార్గమున జీవించుచున్నారు.

లేగదూడలు క్షీరముపై ఆపేక్షతో తల్లి వెంట నడచుట వలన దారి తప్పుట, క్రూరమృగముల బారిపడుట లేకుండ రక్షింపబడుచున్నవి. 

 అట్లే భగవంతుని కోరికలతో ఆరాధించువారును.

భాగవతము 4-288 - ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 330 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 179. If you like, take the 'I am' as your 'prarabdha' (destiny), become one with it, then you can transcend it. 🌻*

Your destiny worries you; will I be successful in life? Will I become this or that? Will I have a serious illness? And the fear of death, and how it will come, is always lurking there in the background. But look what the Guru says! It is something not only astonishing but rewarding as well, it extricates you from all this bundle of worries and apprehension. Why not take knowledge 'I am' to be your destiny?

 I will become the 'I am' only and nothing else - that is my destiny. Abide in the 'I am' only, meditate on the 'I am' only, day in and day out it is the 'I am' only, everywhere and at all times. What will happen on the acceptance of the 'I am' as your destiny? You will transcend it and be free from the clutches of birth and death, which is the greatest reward you can ever imagine.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 205 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. సమీక్ష - 3 🌻*

760. ఆత్మా ఎట్టి సంస్కారములను కలిగియున్న, అట్టి వాటికనుగుణ్యమగు శరీరముతో తాదాత్మ్యత చెంది, ఆ శరీరమునే తానని భావించును.

761. సంస్కారములు కారణముననే, ఆత్మ, శరీరములే తననెడి భావమును పొందుచున్నది. ఈ అజ్ఞానమునకు కారణమూ, సమస్త అనుభములకు కారణము, ఈ సంస్కారములే.

762. ఆత్మయొక్క చైతన్యము, ఎట్టి సంస్కారములయందు చిక్క్యవాది యుండునో, అట్టివాటికనుగుణ్య శరీరములు ద్వారా, ఆ సంస్కార అనుభమును పొందితీరవలసినదే.

763. ఆత్మకు - స్థూల సూక్ష్మ - కారణ దేహములు - ప్రతిబింబములు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 60 / Sri Lalita Sahasranamavali - Meaning - 60 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 60. చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।*
*పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥🍀*

🍀 244. చరాచర జగన్నాథా - 
కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు.

🍀 245. చక్రరాజ నికేతనా - 
చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది.

🍀 246. పార్వతీ - 
పర్వతరాజ పుత్రి.

🍀 247. పద్మనయనా - 
పద్మములవంటి నయనములు కలది.

🍀 248. పద్మరాగ సమప్రభా -
 పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 60 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻60. carācara-jagannāthā cakrarāja-niketanā |*
*pārvatī padmanayanā padmarāga-samaprabhā || 60 ||🌻*

🌻 244 ) Charachara Jagannatha -   
She who is the Lord of all moving and immobile things

🌻 245 ) Chakra Raja Nikethana -   
She who lives in the middle of Sree Chakra

🌻 246 ) Parvathi -  
 She who is the daughter of the mountain

🌻 247 ) Padma nayana -   
She who has eyes like the lotus

🌻 248 ) Padma raga samaprabha -   
She who shines as much as the Padma Raga jewel.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 60 / Sri Vishnu Sahasra Namavali - 60 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*స్వాతి నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*🌻 60. భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః |*
*ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ‖ 60 ‖ 🌻*
  
🍀 558) భగవాన్ - 
భగమను ఆరు లక్షణములు సమగ్రముగా యున్నవాడు.

🍀 559) భగహా - 
ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు.

🍀 560) ఆనందీ - 
ఆనందము నొసంగువాడు.

🍀 561) వనమాలీ -
 వైజయంతి అను వనమాలను ధరించినవాడు.

🍀 562) హలాయుధ: - నాగలి ఆయుధముగా కలవాడు.

🍀 563) ఆదిత్య: - 
అదితి యొక్క కుమారుడు. వామనుడు.

🍀 564) జ్యోతిరాదిత్య: - 
సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు.

🍀 565) సహిష్ణు: - 
ద్వంద్వములను సహించువాడు.

🍀 566) గతిసత్తమ: -
 సర్వులకు గతియై ఉన్నవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 60 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Swathi 4th Padam*

*🌻 60. bhagavān bhagahānandī vanamālī halāyudhaḥ |* 
*ādityō jyōtirādityaḥ sahiṣṇurgatisattamaḥ || 60 ||*

🌻 558. Bhagavān: 
The origin, dissolution, the bondage and salvation of creatures, knowledge, ignorance - one who knows all these is Bhagavan.

🌻 559. Bhagahā: 
One who withdraws the Bhagas, beginning with lordliness, into Himself at the time of dissolution.

🌻 560. Ānandī: 
One whose nature is Ananda (bliss).

🌻 561. Vanamālī:  
One who wears the floral wreath (Vanamala) called Vaijayanti, which consists of the categories of five elements.

🌻 562. Halāyudhaḥ: 
One who in His incarnation as Balabhadra had Hala or ploughshare as His weapon.

🌻 563. Ādityaḥ: 
One who was born of Aditi in His incarnation as Vamana.

🌻 564. Jyōtir-ādityaḥ:  
One who dwells in the brilliance of the sun's orb.

🌻 565. Sahiṣṇuḥ: 
One who puts up with the contraries like heat and cold.

🌻 566. Gatisattamaḥ: 
One who is the ultimate resort and support of all, and the greatest of all beings.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment