🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 300 / Sri Lalitha Chaitanya Vijnanam - 300 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀
🌻 300. 'నామరూప వివర్జితా' 🌻
నామ రూపములను విసర్జించునది శ్రీమాత అని అర్థము. నామము (1). రూపము (2). ఈ రెండునూ జగత్తు రూపములు. అనగా మార్పుచెందు రూపములు. వీనియందు సత్యము నేతి బీరకాయలోని నేయి వంటిది. భౌతిక వ్యవహారమునకే నామము, రూపము అనుభవించు జీవుడు వీనికి భిన్నముగ నున్నాడు. అట్టి జీవునికన్న భిన్నముగ దైవముండును.
జీవునికి స్వభావము మొదటి పొర. రూపము రెండవ పొర. నామము మూడవ పొర. రూపమున్న చోట నామ ముండును. రూపము లేనిచోట నామము లేదు. నామము లేక రూపము ఉండవచ్చును. పేరు పెట్టకముందు కూడ శిశువునకు రూపమున్నది కదా! ముందు రూపము, తరువాత నామము సృష్టి క్రమమున ఏర్పడినవి. రూపము, నామము లేకున్ననూ స్వభావ రూపమున జీవుడుండ గలడు. ఈ స్వభావము దైవీ ఆసురీ మానవ స్వభావములుగ కూడ నుండవచ్చును.
స్వభావమును దాటుట మూడు పొరలను దాటుట. అపుడుండునది 1) ఉండుట, 2) దాని వెలుగు, 3) దాని ఆనందము. ఈ మూడింటిని సత్ చిత్ ఆనంద అందురు (సచ్చిదానంద). సచ్చిదానందస్థితి సృష్టి యందు శ్రీమాత సహజ స్థితి. రూపమును దాల్చుట, నామమును ధరించుట ఆమె ఆవశ్యకతను బట్టి నిర్వర్తించు చుండును. ఇట్లు శ్రీదేవికి ఐదు రూపములున్నట్లు పెద్దలు తెలుపుదురు. 1) అస్థిత్వము లేక ఉండుట 2) వెలుగు 3) ఆనందము 4) రూపము 5) నామము.
శ్రీదేవి కేది సహజ స్థితియో జీవుల స్థితి జేరుట సిద్ధి. వారు సామాన్యముగ నామమునందు, రూపమునందు, స్వభావము నందు బద్ధులై యుందురు. శ్రీదేవి నుపాసించుటలో
తన్మయత్వము చెందగలిగినచో భ్రమర కీటక న్యాయమున వారును సచ్చిదానంద స్థితిని పొందగలరు. నిజమునకు స్వభావ ప్రభావము వీడినచో జీవుడు కూడ సచ్చిదానంద రూపుడే.
“శ్రీమాత సచ్చిదానంద స్వరూపిణి. ఆమె నామరూపములను విసర్జించి వెలుగై ఆనందముగ నున్నది. నేనునూ సచ్చిదానంద స్వరూపుడనే. నా నామ రూపములు తాత్కాలికములు. నా స్వభావమునే నేర్పరచుకొన్నది. వీరిని విసర్జించి దేవి పద సాన్నిధ్యమున చేరి సచ్చిదానంద రూపుడుగనే ఆమెను ఆరాధింతునుగాక!” అని సంకల్పించుకొని శ్రీమాత నారాధింపుడు. సర్వము శుభంకరము కాగలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 300 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀
🌻 300. Nāma-rūpa-vivarjitā नाम-रूप-विवर्जिता (300) 🌻
She is without name (nāma) and form (rūpa). Vivarjitā means devoid. She is beyond names and forms, an exclusive quality of the Brahman. Every creation has two aspects. One is cit and another a-cit. Cit means the universal consciousness and a-cit means individual consciousness. Both cit and a-cit are derived from the Supreme Consciousness or the divine consciousness. Cit is again sub-divided into existence, knowledge and bliss. The Brahman is the cause for these three.
A-cit consists of nāma and rūpā (name and form) and this is opposed to cit in the sense, it does not represent the Brahman. When the union of empirical “I” with the “I” consciousness of Śiva takes place, creation happens. The derivatives of “I” consciousness of Śiva are existence, knowledge and bliss. Name and form are the products of empirical consciousness. Since the nāma says She is beyond nāma and rūpā (name and form), it is implied that She belongs to Cit, the Supreme Consciousness which is also known as the Brahman.
Chāndogya Upaniṣad (VIII.14.1) says, “That which is described as space manifests names and forms. These names and forms are within Brahman. Brahman is immortal. It is the Self”. Vāc Devi-s utilize every opportunity to mention Her as the Supreme Brahman. The Brahman can be described either through negations or through affirmations. Here the quality of the Brahman is described by negation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
12 Aug 2021
No comments:
Post a Comment