1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 239 🌹
2) 🌹. శివ మహా పురాణము - 438🌹
3) 🌹 వివేక చూడామణి - 115 / Viveka Chudamani - 115🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -67🌹
5) 🌹 Osho Daily Meditations - 56🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 115🌹
7) 🌹. పంచ తత్వములు - పంచ శరీరములు 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -239 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 19-2
*🍀 18-2. నిద్ర - మెలకువ - నిద్రించుటయు, మేల్కాంచుటయు జీవులకు అవశమై యున్నది. నిద్ర మెలకువ వచ్చుటయే గాని తెప్పించు కొనలేము. ఇది అవశస్థితి. అట్లే జన్మించుట, మరణించుట కూడ. అట్లే సృష్టి, ప్రళయము కూడ. ఈ చక్రము నుండి జీవులు బయల్పడుట ప్రయత్న పూర్వకముగ చేయవలెను. ఈ చక్రగతి దాటుటకు చక్రమును త్రిప్పుచున్న తత్త్వముతో ముడిపడవలెను. చక్రము నందుండుట ఒక ఎత్తు, చక్రమును త్రిప్పు తత్త్యముతో యుండుట మరియొక ఎత్తు. పరబ్రహ్మ యోగమున ఇది సాధ్యపడునని భగవానుని ఉపదేశము. 🍀*
భూత గ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే2 వశః పార్థ ప్రభవ త్యహరాగమే || 19
తాత్పర్యము : ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. బ్రహ్మపగలు యందు కూడ ప్రాణి సమూహము అట్లే అవశులై పుట్టుచు చచ్చుచు, మరల పుట్టుచు జీవించి బ్రహ్మరాత్రి యందు లయమందు చున్నది.
జీవులు మేల్కొనక ముందు తామున్నామని తెలిసి యుండరు. మేల్కొనినంతనే తెలియును. ఆ తెలివి నిద్రవరకే. నిద్రయందు తెలివి అవ్యక్తము లోనికి చనును. మరల మెలకువ కలిగినంతనే ఏర్పడును. నిద్రించుటయు, మేల్కాంచుటయు జీవులకు అవశమై యున్నది. నిద్ర వచ్చుటయేగాని, నిద్రను తెప్పించుకొనలేము. మెలకువ వచ్చుటయేగాని, మెలకువను తెప్పించుకొనలేము. ఇది అవశస్థితి. అట్లే జన్మించుట, మరణించుట కూడ. అట్లే సృష్టి, ప్రళయము కూడ.
ఈ చక్రము నుండి జీవులు బయల్పడుట ప్రయత్న పూర్వకముగ చేయవలెను. ఆ ఉపాయము తరువాత శ్లోకమున పరమాత్మ తెలియజేయు చున్నాడు. సృష్టి లయములకు, జనన మరణములకు, మెలకువ నిద్ర లకు అతీతమైన, అక్షరమైన పరతత్త్వమును గుర్తించి, దానితో ముడిపడుటయే మార్గమని తెలియచేయును. సృష్టిచక్రము, జనన మరణ చక్రము, అహోరాత్ర చక్రము, జీవులను శుక్ల కృష్ణ గతులలో అనంతము త్రిప్పుచునే యుండును.
ఈ చక్రగతి దాటుటకు చక్రమును త్రిప్పుచున్న తత్త్వముతో ముడిపడవలెను. చక్రము నందుండుట ఒక ఎత్తు, చక్రమును త్రిప్పు తత్త్యముతో యుండుట మరియొక ఎత్తు. పరబ్రహ్మ యోగమున ఇది సాధ్యపడునని భగవానుని ఉపదేశము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 438🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 28
*🌻. శివుని సాక్షాత్కారము - 1 🌻*
పార్వతి ఇట్లు పలికెను-
ఎవరో ఒక మహాత్ముడు వచ్చినాడని మాత్రమే నేను తలంచితిని, ఇపుడు విషయమంతయూ తెలిసినది. పైగా నీవు పవిత్రమగు బ్రాహ్మణుడు (1). ఓ దేవా! నీవు చెప్పినది నాకు తెలిసినది. అది అసత్యమే గాని సత్యము కాదు. సర్వము తెలియునని నీవు చెప్పిన మాట సత్యమే అయినచో, నీవు ఇట్లు విరుద్ధముగా మాటలాడియుండవు (2).
పరబ్రహ్మ, తన ఇచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడునగు మహేశ్వరుడు అప్పుడప్పుడు తన లీలచే అట్టి వేషమును ధరించి కానవచ్చును (3). నీవు బ్రహ్మచారి వేషముతో నన్ను మోసగించుటకు వచ్చి కుయుక్తులు పన్ని మోసపూరితములగు మాటలను పలికితివి (4).
నేను శంకరుని స్వరూపమును ప్రత్యేకించి ఎరుంగుదును. శివతత్త్వము నెరుంగుదును. కావున నా యోగ్యతకను గుణముగా బాగుగా విమర్శించి చెప్పుచున్నాను (5). శివుడు స్వరూప దృష్ట్యా నిర్గుణ బ్రహ్మ. కాని కారణమగు ప్రకృతితో గూడి సగుణుడైనాడు. నిర్గుణుడు, గుణ స్వరూపుడునగు ఆయనకు జాతి ఎట్లుండును? (6)
ఆ సదాశివుడు విద్యలన్నింటికీ నిధానము. పూర్ణపరమాత్ముడగు ఆ శివునకు విద్యతో పనియేమి? (7)ఆ శంభుడు కల్పప్రారంభములో వేదములను ఉచ్ఛ్వాస రూపముగా పూర్వము విష్ణువునకు ఇచ్చెను. ఆయనతో సమమగు గొప్ప ప్రభువు మరియొకడు లేడు (8).
సర్వప్రాణులకు ఆదియందున్న సద్ఘనుడగు పరమేశ్వరునకు వయస్సు యొక్క లెక్క ఎక్కడిది? ప్రకృతి ఆయన నుండి పుట్టినది. ఆయన యొక్క శక్తికి కారణమేమి ఉండును? (9) శక్తికి ప్రభువు, అవ్యయుడు అగు ఆ శంకరుని ఎవడైతే సర్వదా ప్రేమతో సేవించునో, అట్టివానికి ఆ శంభుడు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులను ఇచ్చును (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 115 / Viveka Chudamani - 115🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 2 🍀*
383. స్వచ్ఛమైన మనస్సును ఆత్మపై స్థిరపర్చి తమ ఖచ్చిమైన ఆత్మ విజ్ఞానమును పొందుతూ, నిదానముగా అట్టి స్థితిపై మనస్సును నిల్పిన అట్టి వ్యక్తి తన శాశ్వతమైన ఆత్మను తాను తెలుసుకొనగలడు.
384. ప్రతి వ్యక్తి తన ఆత్మను తాను దర్శించవలెను. అది విభజించుటకు వీలులేని, శాశ్వతమైనది. అన్ని పరిమితులకు అతీతమైనది. అది శరీరము, శరీర భాగాలు, ప్రాణాలు, అహమును తన యొక్క అజ్ఞానము వలన సృష్టించబడినవని గ్రహించి, అవన్నీ ఆకాశముతో నిండి యున్నవని తెలుసుకోవాలి.
385. ఆకాశము వందలకొలది పరిమిత వస్తు సముదాయమును తనలో నింపుకొని; అవి కుండ, జాడి, పార, సూది మొదలగునవి; తాను ఒకటిగా, అనేకముగా కాకుండా ఉన్నది. అదే విధముగా పవిత్రమైన బ్రహ్మము కూడా అహాన్ని ఇతరమైన వాటిని తనలో లేకుండా చేసి ఒకటిగానే తోచుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 115 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 26. Self is Unchangeable - 2 🌻*
383. Fixing the purified mind in the Self, the Witness, the Knowledge Absolute, and slowly making it still, one must then realise one’s own infinite Self.
384. One should behold the Atman, the Indivisible and Infinite, free from all limiting adjuncts such as the body, organs, Pranas, Manas and egoism, which are creations of one’s own ignorance – like the infinite sky.
385. The sky, divested of the hundreds of limiting adjuncts such as a jar, a pitcher, a receptacle for grains or a needle, is one, and not diverse; exactly in a similar way the pure Brahman, when divested of egoism etc., is verily One.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 66 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. భక్తి మార్గము 🌻*
పూర్వము బ్రహ్మ దేవుడు వేదమును తన మనస్సున ముమ్మారు పరామర్శించెను. ధర్మముల రూపముగా నొకమారు , జీవిత సమన్వయముగా నొకమారు, పరిశుద్ధ జ్ఞానముగా నొకమారు అధ్యయనము చేసెను. అటుపై నొక నిర్ణయమునకు వచ్చెను.
*భక్తి మార్గమున తప్ప మరియొక మార్గమున మోక్షము లేదు.*
ఇట్లు నిర్ణయించుకొని విష్ణుమూర్తిని తన స్వరూపము గల వానినిగా ధ్యానము చేసెను. (దానితో తన అస్తిత్వము విష్ణువు నందు అర్పణము చేసెను. ఇదియే సన్న్యాసము.). తత్ఫలితముగా తన వికారము నుండి విమోచనము పొందెను.
అపుడు విష్ణువు మార్గములే తన మార్గములుగా గోచరించినవి. (దానితో సృష్టి సామర్థ్యము గూడ తన నుండి ప్రసరించెను.)
✍🏼 *మాస్టర్ ఇ.కె.*
భాగవతము 2-35
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 56 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 56. SETTLING DOWN 🍀*
*🕉 Lovers become afraid when things go smoothly. They start feeling that perhaps love is disappearing. 🕉*
When love settles, everything becomes smooth. Then love becomes more like friendship-and that has a beauty of its own. Friendship is the very cream, the very essence, of love. So settle! And don't be worried, otherwise sooner or later you will start creating trouble. The mind always wants to create trouble, because then it remains important; when there is no trouble, it becomes unimportant.
The mind is just like the police department. If the city is calm and quiet, they feel bad: no robbery, no riot, no murders--nothing! They are not needed for anything. When everything is silent and peaceful, the mind has a fear, because if you really settle, the mind will be no more. Just remember this. The mind has to go, because it is not the goal. The goal is to go beyond the mind. So help each other to be silent, and keep things going smoothly. If the other starts to get panicky, try to help.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 115 / Sri Lalita Sahasranamavali - Meaning - 115 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ |*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ‖ 115 ‖ 🍀*
🍀 566. నిత్యతృప్తా -
నిత్యసంతుష్టి స్వభావము కలది.
🍀 567. భక్తనిధిః -
భక్తులకు నిధి వంటిది.
🍀 568. నియంత్రీ -
సర్వమును నియమించునది.
🍀 569. నిఖిలేశ్వరీ -
సమస్తమునకు ఈశ్వరి.
🍀 570. మైత్ర్యాది వాసనాలభ్యా -
మైత్రి మొదలైన వాసనా చతుష్టయము గలవారిచే పొందబడునది.
🍀 571. మహాప్రళయ సాక్షిణీ -
మహాప్రళయ స్థితియందు సాక్షి భూతురాలుగా ఉండునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 115 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 115. nityatṛptā bhaktanidhir niyantrī nikhileśvarī |*
*maitryādi-vāsanālabhyā mahāpralaya-sākṣiṇī || 115 || 🌻*
🌻 566 ) Nithya Truptha -
She who is satisfied always
🌻 567 ) Bhaktha Nidhi -
She who is the treasure house of devotees
🌻 568 ) Niyanthri -
She who control
🌻 569 ) Nikhileswari -
She who is goddess for every thing
🌻 570 ) Maitryadhi vasana Labhya -
She who can be attained by habits like Maithree (friendship)
🌻 571 ) Maha pralaya sakshini -
She who is the witness to the great deluge
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. పంచ తత్వములు - పంచ శరీరములు 🌹*
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌ: ఓంసౌ: క్లీంఐం ఆత్మతత్త్వం విశ్వాత్మికం స్థూలదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీం సౌ: ఓంసౌ: క్లీంబం విద్యాతత్త్వం తైజస్మాత్మికం సూక్ష్మదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌ: ఓంసౌ: క్లీంఐం శివతత్త్వం ప్రాజ్ఞాత్మికం కారణదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసా: ఓం సౌః క్లీంఐం సర్వతత్త్వం పాంచభౌతికం, మహాకారణదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా
1) స్థూలదేహము అనగా పంచభూతముల ద్వారా ఏర్పడిన ఈ పాంచభౌతిక దేహమే ఈ స్థూలదేహము (పంచభూతములు అనగా,.ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి. )
2) ఇవి ఒక్కొక్క భూతము నుండి ఒక్కొక్క శక్తి వచ్చినది. పరబ్రహ్మము నుండి అన్ని మహత్తు లు పుట్టి వాటినుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వి. వీటి చేరిక వల్లనే మానవ దేహము ఏర్పడుతుంది.
3) మొదటి దైన ఆకాశ తత్వము నుండి ఐదు పంచకములు ఏర్పడినవి అవి 1. జ్ఞాత 2.మనసు 3.బుద్ధి 4. చిత్తము 5. అహంకారం. వీటి సమ్మేళనమే శరీరము నందు వుండును.—-వీటిని అతీంద్రియములు అని పిలుచుదురు.
4) వాయు తత్వము నుండి
ప్రాణవాయువు,
సమానవాయువు,
వ్యానవాయువు,
ఉదానవాయువు,
అపానవాయువు, వచ్చినవి. వీటినే పంచప్రాణాలు అందురు. అవి తమ తమ విధులను నిర్వర్తించును.
5) అగ్ని తత్వము నుండి
శ్రోత్రము 2.త్వక్ 3.చక్షువు 4.జిహ్వ 5. ఘ్రాణము వచ్చినవి.
వీటినే జ్ఞానేంద్రియములు అందురు.(అగ్ని పంచకములు)
6) జల తత్వము నుండి
1.శబ్ద 2. స్పర్శ 3. రూప 4.రస 5. గంధ ములు వచ్చినవి. వీటిని పంచతన్మాత్రలు అందురు.
7) పృథ్వి తత్వము నుండి
1.వాక్కు 2. ఫాణి 3. పాదము 4. గుహ్యము 5.పాయువు వచ్చినవి. వీటిని కర్మేంద్రియములు అందురు.
8) వీటన్నిటి కలయికయే స్థూలదేహము . (దీనిని జాగ్రతావస్థ అందురు)
9) కొంతమంది అనేక శరీరములున్నవి అంటారు. అనగా
స్థూల 2.సూక్ష్మ 3. కారణ దేహములు అంటారు. మరికొందరు మహాకారణ దేహము అని కుడా అంటారు.
పైన చెప్పిన 25 తత్వములతో కూడిన దేహమునే స్థూలదేహము అంటారు.
10) సూక్ష్మదేహము అనగా జ్ఞానేంద్రియములు ఐదు, శబ్దాదులు ఐదు (కర్మేఇంద్రియాలు)
ప్రాణాదులు ఐదు, మనసు, బుధ్ధి, రెండు అనగా మొత్తం 17 తత్వములు కలిసిన దానిని సూక్ష్మదేహము అందురు. దీనినే లింగశరీరము అని కూడా అంటారు. (ఇది స్వప్నావస్థలో జరుగు ప్రక్రియ.)
11) స్థూలదేహములో వున్నా దశేన్ద్రియములు సూక్ష్మదేహము లోకి ఏరూపములో పోయినవి —?
అనేది మీకు ప్రశ్నగా మారవచ్చు—- అందుకే ఆయా ఇంద్రియాలకు సరి అయిన నిర్వచనము— పైకి కనిపించే చెవులు కాకుండా (పైకి కనిపించే డొప్పలు కావు) వాటికి భిన్న మైనట్టి ఆ చెవుల రంద్రాలలో వ్యాప్తమై వున్న శూన్యాన్ని ఆశ్రయించు కొని శబ్దాన్ని గ్రహించే శక్తి కలిగినట్టి సూక్ష్మ ఇంద్రియాన్నే శ్రోత్రేన్ద్రియం అంటారు. ఇలాగే మిగతా ఇంద్రియాలు కూడాను.
12) మనకు పైకి కనిపించే చర్మానికి భిన్నమైనది, అపాదమస్తకం వ్యాప్తమై, శీతోష్ణాది స్పర్శానుభూతిని కలిగించే సూక్ష్మేంద్రియాన్ని త్వగ్గీన్ద్రియం అంటారు.
13) కండ్లకు భిన్న మైనట్టి కండ్లను అశ్రయించి వున్నట్టి , కనుగుడ్డుకు అగ్ర భాగములో ఉంటు రూపాన్ని గ్రహించే శక్తిగల సూక్ష్మేన్ద్రియాన్ని చక్షురీన్ద్రియం అంటారు.
14 ) కేవలం నాలుక కాకుండా ఆ నాలుకను ఆశ్రయించి నాలుక యొక్క అగ్ర భాగములో ఉంటూ తీపి, పులుపు మొదలైన రసాలని, రుచులని గ్రహించ గలిగే సూక్ష్మేన్ద్రియాన్ని జిహ్వేంద్రియం అంటారు.
15) అట్లాగే పైకి కనిపించే ముక్కుకు భిన్నమైనదై ఆ ముక్కును ఆశ్రయించి ముక్కుకు అగ్రభాగములో గందాదుల్ని (వాసనలను) గ్రహించే శక్తి గల సూక్ష్మేంద్రియాన్ని ఘ్రాణేంద్రియం అంటారు.
16) కర్మేన్ద్రియాలంటే, మాట్లాడే ఇంద్రియమైన నాలుక, పనిచేసే చేతులు, నడిచే పాదాలు, మలమూత్ర విసర్జన చేయు గుదము, జననేంద్రియములు బయటికి కనిపించే పనులు చేసేందుకు కారణ మైనట్టి ఇంద్రియాలు. వాగేన్ద్రియము అంటే వాక్ కు భిన్న మైనట్టి వాక్ కు ఆశ్రయ మైనట్టి ఎనిమిది స్థానాలలో ఉంటూ శబ్దోచ్చారణకు సమర్ధ మైనట్టి ఇంద్రియం , శబ్దోచ్చారణకు వినియోగించే ఎనిమిది స్థానాలు 1.హృదయం 2. ఖంఠము 3. శిరస్సు (మూర్ధ్వం) 4. తాలువు 5. నాలుక 6.దంతములు 7. పెదవులు 8. ముక్కు అంటారు. ఇలాగే ఒక్కొక్క దానికి స్థూలానికి, సూక్ష్మానికి వున్న తేడాను గమనించండి.(ఇది స్వప్నావస్థ)
17) కారణశరీరము అంటే స్థూల, సూక్ష్మ(లింగ) రెండు దేహాలకు హేతుభూత మైనది. అనాది ఐనట్టి, అనిర్వచనీయమైనట్టి , ప్రకాశస్వరూపుడైనట్టి, బ్రహ్మ, ఆత్మలు రెండు ఒకటే అనే జ్ఞానాన్ని మరలిస్తుండేటువంటి అజ్ఞానాన్నే కారణశరీరము అంటారు. ఆత్మ, పరమాత్మల అభిన్నత్వాన్ని, అధ్యైతభావాన్ని, అనుభవములలోనికి రానీయకుండా నివారిస్తుంటుంది. ఈ కారణశరీరము — అనాది ఐనట్టి , అవిద్య మాయ యొక్క రూపమే కారణ శరీరానికి ఉపాధి అంటారు —- ఇటువంటి ఉపాధికి భిన్నమయినటువంటి ఆత్మను మనం తెలుసుకోవాలి. —- శరీరము అనే పదము దీనికి వాడుతున్నారు. కారణశరీరము ఎట్లా క్షయమౌతుంది— ? బ్రహ్మ, ఆత్మల యొక్క ఏకత్వ జ్ఞానము వల్ల ఆత్మ, పరమాత్మలు ఒకటే అనే జ్ఞానము కలగడం తోనే ఈ కారణ శరీరము క్షయమైపోతుంది.
18) సర్వ వ్యాపాకుడైన ఆత్మయే విశ్వానికి జీవశక్తి అయినాడు. అంటే మూలతత్వము. అతని వల్లనే ఇవన్నీ పుడుతున్నాయి. ఆ పరబ్రహ్మలోనే లయమైపోతాయి. కాబట్టి ఆత్మ, పరమాత్మలు ఒకటే అనే జ్ఞానము కలగడంవల్ల శరీరం అనేది మిధ్య అనేది తెలిపోవటంతో ఈ కారణశరీరము పోతుందని భావము. మిగిలేది చిత్తము, జ్ఞాతతో(ఆత్మతో) కూడుకున్నది.దీనినే ప్రాజ్ఞుడు అని అందురు. ఇది నిద్రావస్థ లేదా సుషుప్తావస్థ.
19) మహాకారణ అనగా ఏ తత్వము లేక స్వయం జ్యోతి యై, సర్వసాక్షి అయిన శుద్ధ చైతన్యము నే మహాకారణము అందురు. దీనినే అనుభవజ్ఞులు హిరణ్యగర్భుడు అని అక్షర పురుషుడని ఇంకా అనేక పేర్లతో కొనియాడారు.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment