🌹. పంచ తత్వములు - పంచ శరీరములు 🌹
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌ: ఓంసౌ: క్లీంఐం ఆత్మతత్త్వం విశ్వాత్మికం స్థూలదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీం సౌ: ఓంసౌ: క్లీంబం విద్యాతత్త్వం తైజస్మాత్మికం సూక్ష్మదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌ: ఓంసౌ: క్లీంఐం శివతత్త్వం ప్రాజ్ఞాత్మికం కారణదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసా: ఓం సౌః క్లీంఐం సర్వతత్త్వం పాంచభౌతికం, మహాకారణదేహం, పరిశోదయామి జుహోమి స్వాహా
1) స్థూలదేహము అనగా పంచభూతముల ద్వారా ఏర్పడిన ఈ పాంచభౌతిక దేహమే ఈ స్థూలదేహము (పంచభూతములు అనగా,.ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి. )
2) ఇవి ఒక్కొక్క భూతము నుండి ఒక్కొక్క శక్తి వచ్చినది. పరబ్రహ్మము నుండి అన్ని మహత్తు లు పుట్టి వాటినుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వి. వీటి చేరిక వల్లనే మానవ దేహము ఏర్పడుతుంది.
3) మొదటి దైన ఆకాశ తత్వము నుండి ఐదు పంచకములు ఏర్పడినవి అవి 1. జ్ఞాత 2.మనసు 3.బుద్ధి 4. చిత్తము 5. అహంకారం. వీటి సమ్మేళనమే శరీరము నందు వుండును.—-వీటిని అతీంద్రియములు అని పిలుచుదురు.
4) వాయు తత్వము నుండి
ప్రాణవాయువు,
సమానవాయువు,
వ్యానవాయువు,
ఉదానవాయువు,
అపానవాయువు, వచ్చినవి. వీటినే పంచప్రాణాలు అందురు. అవి తమ తమ విధులను నిర్వర్తించును.
5) అగ్ని తత్వము నుండి
శ్రోత్రము 2.త్వక్ 3.చక్షువు 4.జిహ్వ 5. ఘ్రాణము వచ్చినవి.
వీటినే జ్ఞానేంద్రియములు అందురు.(అగ్ని పంచకములు)
6) జల తత్వము నుండి
1.శబ్ద 2. స్పర్శ 3. రూప 4.రస 5. గంధ ములు వచ్చినవి. వీటిని పంచతన్మాత్రలు అందురు.
7) పృథ్వి తత్వము నుండి
1.వాక్కు 2. ఫాణి 3. పాదము 4. గుహ్యము 5.పాయువు వచ్చినవి. వీటిని కర్మేంద్రియములు అందురు.
8) వీటన్నిటి కలయికయే స్థూలదేహము . (దీనిని జాగ్రతావస్థ అందురు)
9) కొంతమంది అనేక శరీరములున్నవి అంటారు. అనగా
స్థూల 2.సూక్ష్మ 3. కారణ దేహములు అంటారు. మరికొందరు మహాకారణ దేహము అని కుడా అంటారు.
పైన చెప్పిన 25 తత్వములతో కూడిన దేహమునే స్థూలదేహము అంటారు.
10) సూక్ష్మదేహము అనగా జ్ఞానేంద్రియములు ఐదు, శబ్దాదులు ఐదు (కర్మేఇంద్రియాలు)
ప్రాణాదులు ఐదు, మనసు, బుధ్ధి, రెండు అనగా మొత్తం 17 తత్వములు కలిసిన దానిని సూక్ష్మదేహము అందురు. దీనినే లింగశరీరము అని కూడా అంటారు. (ఇది స్వప్నావస్థలో జరుగు ప్రక్రియ.)
11) స్థూలదేహములో వున్నా దశేన్ద్రియములు సూక్ష్మదేహము లోకి ఏరూపములో పోయినవి —?
అనేది మీకు ప్రశ్నగా మారవచ్చు—- అందుకే ఆయా ఇంద్రియాలకు సరి అయిన నిర్వచనము— పైకి కనిపించే చెవులు కాకుండా (పైకి కనిపించే డొప్పలు కావు) వాటికి భిన్న మైనట్టి ఆ చెవుల రంద్రాలలో వ్యాప్తమై వున్న శూన్యాన్ని ఆశ్రయించు కొని శబ్దాన్ని గ్రహించే శక్తి కలిగినట్టి సూక్ష్మ ఇంద్రియాన్నే శ్రోత్రేన్ద్రియం అంటారు. ఇలాగే మిగతా ఇంద్రియాలు కూడాను.
12) మనకు పైకి కనిపించే చర్మానికి భిన్నమైనది, అపాదమస్తకం వ్యాప్తమై, శీతోష్ణాది స్పర్శానుభూతిని కలిగించే సూక్ష్మేంద్రియాన్ని త్వగ్గీన్ద్రియం అంటారు.
13) కండ్లకు భిన్న మైనట్టి కండ్లను అశ్రయించి వున్నట్టి , కనుగుడ్డుకు అగ్ర భాగములో ఉంటు రూపాన్ని గ్రహించే శక్తిగల సూక్ష్మేన్ద్రియాన్ని చక్షురీన్ద్రియం అంటారు.
14 ) కేవలం నాలుక కాకుండా ఆ నాలుకను ఆశ్రయించి నాలుక యొక్క అగ్ర భాగములో ఉంటూ తీపి, పులుపు మొదలైన రసాలని, రుచులని గ్రహించ గలిగే సూక్ష్మేన్ద్రియాన్ని జిహ్వేంద్రియం అంటారు.
15) అట్లాగే పైకి కనిపించే ముక్కుకు భిన్నమైనదై ఆ ముక్కును ఆశ్రయించి ముక్కుకు అగ్రభాగములో గందాదుల్ని (వాసనలను) గ్రహించే శక్తి గల సూక్ష్మేంద్రియాన్ని ఘ్రాణేంద్రియం అంటారు.
16) కర్మేన్ద్రియాలంటే, మాట్లాడే ఇంద్రియమైన నాలుక, పనిచేసే చేతులు, నడిచే పాదాలు, మలమూత్ర విసర్జన చేయు గుదము, జననేంద్రియములు బయటికి కనిపించే పనులు చేసేందుకు కారణ మైనట్టి ఇంద్రియాలు. వాగేన్ద్రియము అంటే వాక్ కు భిన్న మైనట్టి వాక్ కు ఆశ్రయ మైనట్టి ఎనిమిది స్థానాలలో ఉంటూ శబ్దోచ్చారణకు సమర్ధ మైనట్టి ఇంద్రియం , శబ్దోచ్చారణకు వినియోగించే ఎనిమిది స్థానాలు 1.హృదయం 2. ఖంఠము 3. శిరస్సు (మూర్ధ్వం) 4. తాలువు 5. నాలుక 6.దంతములు 7. పెదవులు 8. ముక్కు అంటారు. ఇలాగే ఒక్కొక్క దానికి స్థూలానికి, సూక్ష్మానికి వున్న తేడాను గమనించండి.(ఇది స్వప్నావస్థ)
17) కారణశరీరము అంటే స్థూల, సూక్ష్మ(లింగ) రెండు దేహాలకు హేతుభూత మైనది. అనాది ఐనట్టి, అనిర్వచనీయమైనట్టి , ప్రకాశస్వరూపుడైనట్టి, బ్రహ్మ, ఆత్మలు రెండు ఒకటే అనే జ్ఞానాన్ని మరలిస్తుండేటువంటి అజ్ఞానాన్నే కారణశరీరము అంటారు. ఆత్మ, పరమాత్మల అభిన్నత్వాన్ని, అధ్యైతభావాన్ని, అనుభవములలోనికి రానీయకుండా నివారిస్తుంటుంది. ఈ కారణశరీరము — అనాది ఐనట్టి , అవిద్య మాయ యొక్క రూపమే కారణ శరీరానికి ఉపాధి అంటారు —- ఇటువంటి ఉపాధికి భిన్నమయినటువంటి ఆత్మను మనం తెలుసుకోవాలి. —- శరీరము అనే పదము దీనికి వాడుతున్నారు. కారణశరీరము ఎట్లా క్షయమౌతుంది— ? బ్రహ్మ, ఆత్మల యొక్క ఏకత్వ జ్ఞానము వల్ల ఆత్మ, పరమాత్మలు ఒకటే అనే జ్ఞానము కలగడం తోనే ఈ కారణ శరీరము క్షయమైపోతుంది.
18) సర్వ వ్యాపాకుడైన ఆత్మయే విశ్వానికి జీవశక్తి అయినాడు. అంటే మూలతత్వము. అతని వల్లనే ఇవన్నీ పుడుతున్నాయి. ఆ పరబ్రహ్మలోనే లయమైపోతాయి. కాబట్టి ఆత్మ, పరమాత్మలు ఒకటే అనే జ్ఞానము కలగడంవల్ల శరీరం అనేది మిధ్య అనేది తెలిపోవటంతో ఈ కారణశరీరము పోతుందని భావము. మిగిలేది చిత్తము, జ్ఞాతతో(ఆత్మతో) కూడుకున్నది.దీనినే ప్రాజ్ఞుడు అని అందురు. ఇది నిద్రావస్థ లేదా సుషుప్తావస్థ.
19) మహాకారణ అనగా ఏ తత్వము లేక స్వయం జ్యోతి యై, సర్వసాక్షి అయిన శుద్ధ చైతన్యము నే మహాకారణము అందురు. దీనినే అనుభవజ్ఞులు హిరణ్యగర్భుడు అని అక్షర పురుషుడని ఇంకా అనేక పేర్లతో కొనియాడారు.
🌹 🌹 🌹 🌹 🌹
13 Aug 2021
No comments:
Post a Comment