మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 66


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 66 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భక్తి మార్గము 🌻


పూర్వము బ్రహ్మ దేవుడు వేదమును తన మనస్సున ముమ్మారు పరామర్శించెను. ధర్మముల రూపముగా నొకమారు , జీవిత సమన్వయముగా నొకమారు, పరిశుద్ధ జ్ఞానముగా నొకమారు అధ్యయనము చేసెను. అటుపై నొక నిర్ణయమునకు వచ్చెను.

భక్తి మార్గమున తప్ప మరియొక మార్గమున మోక్షము లేదు.

ఇట్లు నిర్ణయించుకొని విష్ణుమూర్తిని తన స్వరూపము గల వానినిగా ధ్యానము చేసెను. (దానితో తన అస్తిత్వము విష్ణువు నందు అర్పణము చేసెను. ఇదియే సన్న్యాసము.). తత్ఫలితముగా తన వికారము నుండి విమోచనము పొందెను.

అపుడు విష్ణువు మార్గములే తన మార్గములుగా గోచరించినవి. (దానితో సృష్టి సామర్థ్యము గూడ తన నుండి ప్రసరించెను.)

✍🏼 మాస్టర్ ఇ.కె.

భాగవతము 2-35

🌹 🌹 🌹 🌹 🌹


13 Aug 2021

No comments:

Post a Comment