12-AUGUST-2021 MESSAGES

 1) 🌹 శ్రీమద్భగవద్గీత - 76 / Bhagavad-Gita - 76 - 2 - 29🌹

2) 🌹 శ్రీమద్భగవద్గీత - 645 / Bhagavad-Gita - 645 - 18-56 🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 473 / Vishnu Sahasranama Contemplation - 473 🌹
4) 🌹 Daily Wisdom - 151 🌹
5) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 125 🌹
6) 🌹. నిర్మల ధ్యానములు - 57 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 300 / Sri Lalita Chaitanya Vijnanam - 300 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
 
 🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹

Join and Share ALL
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://pyramidbook.in/dailywisdom

Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
https://pyramidbook.in/vivekachudamani

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
https://pyramidbook.in/maharshiwisdom

Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

Join and Share
🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹
www.facebook.com/groups/dattachaitanyam/

Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
 
*🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 76 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము -  సాంఖ్య యోగము - 29 🌴*

29. ఆశ్చర్యవత్ పశ్యతి కష్చిదేనమ్ ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్య: |
ఆశ్చర్యవచ్చైనమన్య: శ్రుణోతి శ్రుత్వాప్యేనం వేదం న చైవ కశ్చిత్ ||

*🌷. తాత్పర్యం :*
కొందరు ఆత్మను అధ్బుతమైనదానిగా గాంచుదురు. కొందరు దానిని అధ్బుతమైన దానిగా వర్ణింతురు. మరికొందరు దానిని అధ్బుతమైనదానిగా శ్రవణము చేయుదురు. ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏ మాత్రము తెలియకుందురు.

*🌷. భాష్యము :*
అధికపరిమాణ దేహము గల జంతువునందు మరియు ఘనమైన అశ్వత్థవృక్షమునందే గాక, ఒక అంగుళమాత్ర స్థలములో కోట్లాది సంఖ్యలో నుండు సూక్ష్మజీవుల యందును ఆత్మ ఉన్నదనెడు విషయము నిక్కముగా అధ్బుతమైనది. అల్పజ్ఞులు మరియు తపోనిష్ట లేనివారు ఇట్టి ఆత్మ యొక్క అధ్బుతకర్మలను తెలియకున్నారు. విశ్వమునందు తొలిజీవియైన బ్రహ్మదేవునకు సైతము జ్ఞానము ప్రసాదించిన పరమప్రామణికుడైన శ్రీకృష్ణభగవానుడే స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయమును గ్రహింపజాలరు.

కేవలము భౌతికభావనయే కలిగియుండుట వలన ఎట్లు అణుపరిమాణ ఆత్మ అతిపెద్దదిగా మరియు అతి చిన్నదిగా వర్తింపగలదో ఈ కాలపు జనులు ఊహింపజాలరు. కనుకనే వారు దాని నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అధ్బుతమైనదిగా గాంతురు. భౌతికశక్తిచే మోహమునకు గురియై జనులు ఇంద్రియభోగ విషయములందే అధికముగా రతులగుదురు.

ఆత్మానుభవమును పొందకున్నచో కర్మలన్నియును జీవనసంఘర్షణలో అంత్యమున ఓటమినే కలుగజేయుననుట వాస్తవమైనను వారు దాని కొరకై సమయమును కేటాయింపరు. ప్రతియొక్కరు ఆత్మను గూర్చి తెలిసికొని తద్ద్వారా భౌతికక్లేశములను పరిష్కారము చూపవలెనని వారు బహుషా తెలిసియుండకపోవచ్చును.

ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సంగమున ప్రవచనములను వినుచుందురు. కాని కొన్నిమార్లు అజ్ఞానవశమున వారు ఆత్మ మరియు పరమాత్మ లిరివురును ఒక్కటే యనియు, వారివురి నడుమ పరిమాణమందును భేదము లేదనియు భావించి తప్పుమార్గమున చనుదురు. ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని, వారి కర్మల, వారి నడుమ గల సంబంధమును, వారికి సంబంధించిన విషయముల నన్నింటిని సంపూర్తిగా తెలిసిన మనుజుడు దుర్లభుడు.

ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది, ఆత్మ యొక్క స్థానమును వివిధకోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత దుర్లభుడు. కాని ఏదియో ఒక విధముగా ఈ ఆత్మను గుర్చిన విషయమును మనుజుడు అవగతము చేసికొనినచో జన్మ సఫలము కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 76 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 29 🌴*

29. āścarya-vat paśyati kaścid enam
āścarya-vad vadati tathaiva cānyaḥ
āścarya-vac cainam anyaḥ śṛṇoti
śrutvāpy enaṁ veda na caiva kaścit

*🌻 Translation :*
Some look on the soul as amazing, some describe him as amazing, and some hear of him as amazing, while others, even after hearing about him, cannot understand him at all.

*🌻 Purport :*
The fact that the atomic soul is within the body of a gigantic animal, in the body of a gigantic banyan tree, and also in the microbic germs, millions and billions of which occupy only an inch of space, is certainly very amazing.

Men with a poor fund of knowledge and men who are not austere cannot understand the wonders of the individual atomic spark of spirit, even though it is explained by the greatest authority of knowledge, who imparted lessons even to Brahmā, the first living being in the universe.

Owing to a gross material conception of things, most men in this age cannot imagine how such a small particle can become both so great and so small. So men look at the soul proper as wonderful either by constitution or by description.

Illusioned by the material energy, people are so engrossed in subject matters for sense gratification that they have very little time to understand the question of self-understanding, even though it is a fact that without this self-understanding all activities result in ultimate defeat in the struggle for existence. Perhaps they have no idea that one must think of the soul, and thus make a solution to the material miseries.
🌹 🌹 🌹 🌹 🌹
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
 
 
*🌹. శ్రీమద్భగవద్గీత - 645  / Bhagavad-Gita - 645 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 56 🌴*

56. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ: |
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :
అన్ని రకములైన కర్మల యందు నియుక్తుడైనను నా శుద్ధభక్తుడు నా  రక్షణలో నిలిచి శాశ్వతమును, అవ్యయమును అగు పదమును నా అనుగ్రహముచే పొందగలడు.

🌷. భాష్యము  :
“మద్వ్యపాశ్రయ:” అనగా శ్రీకృష్ణభగవానుని రక్షణమున అని భావము. భౌతికకల్మషముల నుండి విడివడుటకు శుద్ధభక్తుడైనవాడు శ్రీకృష్ణభగవానుని నిర్దేశమున లేదా ఆ భగవానుని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నిర్దేశమున వర్తించును. కాలపరిమితి యనునది లేకుండా ఇరువదినాలుగు గంటలు, నూటికినూరుపాళ్ళు భగవానుని నిర్దేశమున అతడు కర్మల యందు నియుక్తుడై యుండును.

ఆ విధముగా కృష్ణభక్తిభావనలో కర్మల యందు నియుక్తుడైన భక్తుని యెడ శ్రీకృష్ణభగవానుడు పరమదయాళువు కాగలడు. తత్కారణముగా ఎట్టి కష్టములెదురైనను అంత్యమున అతడు కృష్ణలోకమున చేరగలడు.

అతడు కృష్ణలోకమును నిశ్చయముగా చేరుననుటలో ఎట్టి సందేహము లేదు. అట్టి కృష్ణలోకమునందు ప్రతిదియు మార్పురహితము, శాశ్వతము, అవ్యయము, జ్ఞానపూర్ణమై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 645 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga -  The Perfection of Renunciation  - 56 🌴*

56. sarva-karmāṇy api sadā
kurvāṇo mad-vyapāśrayaḥ
mat-prasādād avāpnoti
śāśvataṁ padam avyayam

🌷 Translation :
Though engaged in all kinds of activities, My pure devotee, under My protection, reaches the eternal and imperishable abode by My grace.

🌹 Purport :
The word mad-vyapāśrayaḥ means under the protection of the Supreme Lord. To be free from material contamination, a pure devotee acts under the direction of the Supreme Lord or His representative, the spiritual master.

There is no time limitation for a pure devotee. He is always, twenty-four hours a day, one hundred percent engaged in activities under the direction of the Supreme Lord. To a devotee who is thus engaged in Kṛṣṇa consciousness the Lord is very, very kind.

In spite of all difficulties, he is eventually placed in the transcendental abode, or Kṛṣṇaloka. He is guaranteed entrance there; there is no doubt about it. In that supreme abode, there is no change; everything is eternal, imperishable and full of knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
 
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 473 / Vishnu  Sahasranama Contemplation - 473🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 473. రత్నగర్భః, रत्नगर्भः, Ratnagarbhaḥ 🌻*

*ఓం రత్నగర్భాయ నమః | ॐ रत्नगर्भाय नमः | OM Ratnagarbhāya namaḥ*


రత్నాని గర్భభూతాని యస్యాబ్ధేస్తత్స్వరూపవాన్ ।
రత్నగర్భ ఇతి ప్రోక్తః సముద్రశయనో హరిః ॥

రత్నములు ఉదరస్థ శిశువులుగా ఈతనికి కలవనే వ్యుత్పత్తి చే సముద్రునకు 'రత్నగర్భః' అని వ్యవహారము. ఈ హేతువు చేతనే రత్నాకరః అనియు సముద్రునకు వాడుక. ఆ సముద్రము - సముద్రశయనుడైన హరియొక్క విభూతియే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 473🌹*
📚. Prasad Bharadwaj

*🌻 473. Ratnagarbhaḥ 🌻*

*OM Ratnagarbhāya namaḥ*

Ratnāni garbhabhūtāni yasyābdhestatsvarūpavān,
Ratnagarbha iti proktaḥ samudraśayano hariḥ.

रत्नानि गर्भभूतानि यस्याब्धेस्तत्स्वरूपवान् ।
रत्नगर्भ इति प्रोक्तः समुद्रशयनो हरिः ॥

As the ratnās or gems are in it's womb or at its bottom, the ocean is called ratnagarbhaḥ. Such oceans are the manifestations of Lord Hari Himself, who rests on the ocean.

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥

స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥

Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
 
 
*🌹 DAILY WISDOM - 151 🌹*
*🍀 📖  The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 30. Consciousness is One 🌻*

Though the objects that are known in consciousness are different and of various kinds, consciousness is one. It is what integrates all sensations and perceptions into a coherent whole.

If consciousness were a changing phenomenon, such a synthesis of knowledge would be impossible, and there would arise the contingency of introducing different consciousnesses at different times. Such consciousnesses, in order that their existences might be justified, may have to be known by another consciousness, which, after all, we have to admit as the real Self.

That the Self is one, and not more than one, need not be proved, for no one ever feels that one is divided, that one is two or more. Everyone knows that one’s self cannot be cut or divided into segments but always retains its unity. Even supposing that the Self can be manifold, we would be led to the necessity of asserting a unitary consciousness knowing the difference between the parts assumed in the Self.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
 
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 125 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻 102. ఒక సాధన 🌻*

కన్నులు మూసిగాని కన్నులు తెరచిగానీ ఒక రమ్యమగు దృశ్యమును ఊహించి చూచుట నేర్చుడు. అట్లే ఊహించి వినుట నేర్చుడు. ఉదాహరణకు కనులు మూసుకొని కైలాస పర్వతమును చూచుట, తిరుపతి వెంకటేశ్వరుని చూచుట, బెజవాడ కనకదుర్గను చూచుట యిత్యాది దూరపు ప్రాంతముల నున్న మనవారిని చూచుట. ఈ చూచుటలో వివరములు చూచుట కూడ చేయవలెను.

ఇట్లే వినుట కూడ చేయవచ్చును. పరధ్యానమున కనపడుట, వినపడుట కన్న, నిర్దేశించి చూచుట, వినుట మిన్న అయిన విషయము. మొదటిది జబ్బు. అందు మన సంకల్పమేమీ లేదు. రెండవది దూరదృష్టి, దూరశ్రవణము. ఇట్లు అభ్యాసము గావించుట వలన మీ యందు దూరదృష్టి, దూరశ్రవణము ఏర్పడగలవు. పై విధముగ సూక్ష్మదేహమున నున్న నీ సభ్యులనుగాని, దివ్య దేహముననున్న ఒక దేవతనుగాని చూచుటకు ప్రయత్నించినచో క్రమముగ గురుదర్శనము, దైవదర్శనము కూడ కాగలదు. దీని వలన మీ మనస్సునకు అతీంద్రియ శక్తి పెరుగును.

అందునకే ధ్యానమున, ఒకే రూపము నెప్పుడునూ చూచు అభ్యాసమీయబడినది. దీని కారణముగ వినపడనివి వినబడుట, కనబడనివి కనపడుట అను మరియొక సిద్ధి కలుగును.  ఇట్టి సాధనలకు ఓర్పు, నిరంతరత్వము చాల ముఖ్యము. శ్రద్ధ కూడ చాల అవసరము. ఈ మూడు గుణములతో సూక్ష్మలోకము, స్టూలలోకమంత నిజమై నిలచును. ఇది ఒక సాధన.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
 
 
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 57 🌹*
✍️.  సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀.  మరింత మరింతగా లోపలి తత్వంపై కేంద్రీకరించు. లోపల మరింతగా కాలాన్ని స్థలాన్ని సృష్టించు. అదంతా కేవలం గుర్తించాల్సిన విషయం. మెల్ల మెల్లగా నీ చైతన్యం నీ పక్కకు తిరిగుతుంది.   🍀*

ఎంతగా అహం మార్గాల్ని కనిపెడితే అంతగా స్వేచ్ఛగా వుంటావు. నువ్వు తెలుసుకునే కొద్దీ దాని కుట్రలు పని చెయ్యవు. యిది దృష్టిలో పెట్టుకుని మరింత మరింతగా లోపలి తత్వంపై కేంద్రీకరించు. లోపల మరింతగా కాలాన్ని స్థలాన్ని సృష్టించు. అదంతా కేవలం గుర్తించాల్సిన విషయం. మెల్ల మెల్లగా నీ చైతన్యం నీ పక్కకు తిరిగుతుంది.

ఎప్పుడయితే నీకు నువ్వు ముఖాముఖి నిల్చుంటావో అప్పుడు నువ్వోక ఉన్నతమయిన విషయాన్ని, అపురూపమైన విషయాన్ని జీవితంలో సౌందర్య భరితమయిన అనుభవాన్ని పొందుతావు. ఆ ఎదుర్కొన్న అనుభవంతో సహజమైన దయ, కాంతివంత కారుణ్యం తొణికిసలాడుతాయి.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
 
 
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 300  / Sri Lalitha Chaitanya Vijnanam  - 300 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।*
*హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀*

*🌻 300. 'నామరూప వివర్జితా' 🌻*

నామ రూపములను విసర్జించునది శ్రీమాత అని అర్థము. నామము (1). రూపము (2). ఈ రెండునూ జగత్తు రూపములు. అనగా మార్పుచెందు రూపములు. వీనియందు సత్యము నేతి బీరకాయలోని నేయి వంటిది. భౌతిక వ్యవహారమునకే నామము, రూపము అనుభవించు జీవుడు వీనికి భిన్నముగ నున్నాడు. అట్టి జీవునికన్న భిన్నముగ దైవముండును.

జీవునికి స్వభావము మొదటి పొర. రూపము రెండవ పొర. నామము మూడవ పొర. రూపమున్న చోట నామ ముండును. రూపము లేనిచోట నామము లేదు. నామము లేక రూపము ఉండవచ్చును. పేరు పెట్టకముందు కూడ శిశువునకు రూపమున్నది కదా! ముందు రూపము, తరువాత నామము సృష్టి క్రమమున ఏర్పడినవి. రూపము, నామము లేకున్ననూ స్వభావ రూపమున జీవుడుండ గలడు. ఈ స్వభావము దైవీ ఆసురీ మానవ స్వభావములుగ కూడ నుండవచ్చును.

స్వభావమును దాటుట మూడు పొరలను దాటుట. అపుడుండునది 1) ఉండుట, 2) దాని వెలుగు, 3) దాని ఆనందము. ఈ మూడింటిని సత్ చిత్ ఆనంద అందురు (సచ్చిదానంద). సచ్చిదానందస్థితి సృష్టి యందు శ్రీమాత సహజ స్థితి. రూపమును దాల్చుట, నామమును ధరించుట ఆమె ఆవశ్యకతను బట్టి నిర్వర్తించు చుండును. ఇట్లు శ్రీదేవికి ఐదు రూపములున్నట్లు పెద్దలు తెలుపుదురు. 1) అస్థిత్వము లేక ఉండుట 2) వెలుగు 3) ఆనందము 4) రూపము 5) నామము.

శ్రీదేవి కేది సహజ స్థితియో జీవుల స్థితి జేరుట సిద్ధి. వారు సామాన్యముగ నామమునందు, రూపమునందు, స్వభావము నందు బద్ధులై యుందురు. శ్రీదేవి నుపాసించుటలో
తన్మయత్వము చెందగలిగినచో భ్రమర కీటక న్యాయమున వారును సచ్చిదానంద స్థితిని పొందగలరు. నిజమునకు స్వభావ ప్రభావము వీడినచో జీవుడు కూడ సచ్చిదానంద రూపుడే.

“శ్రీమాత సచ్చిదానంద స్వరూపిణి. ఆమె నామరూపములను విసర్జించి వెలుగై ఆనందముగ నున్నది. నేనునూ సచ్చిదానంద స్వరూపుడనే. నా నామ రూపములు తాత్కాలికములు. నా స్వభావమునే నేర్పరచుకొన్నది. వీరిని విసర్జించి దేవి పద సాన్నిధ్యమున చేరి సచ్చిదానంద రూపుడుగనే ఆమెను ఆరాధింతునుగాక!” అని సంకల్పించుకొని శ్రీమాత నారాధింపుడు. సర్వము శుభంకరము కాగలదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 300 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

*🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀*

*🌻 300. Nāma-rūpa-vivarjitā नाम-रूप-विवर्जिता (300) 🌻*

She is without name (nāma) and form (rūpa). Vivarjitā means devoid.  She is beyond names and forms, an exclusive quality of the Brahman.  Every creation has two aspects. One is cit and another a-cit. Cit means the universal consciousness and a-cit means individual consciousness.  Both cit and a-cit are derived from the Supreme Consciousness or the divine consciousness.  Cit is again sub-divided into existence, knowledge and bliss.  The Brahman is the cause for these three.  

A-cit consists of nāma and rūpā (name and form) and this is opposed to cit in the sense, it does not represent the Brahman.  When the union of empirical “I” with the “I” consciousness of Śiva takes place, creation happens.  The derivatives of “I” consciousness of Śiva are existence, knowledge and bliss.  Name and form are the products of empirical consciousness.  Since the nāma says She is beyond nāma and rūpā (name and form), it is implied that She belongs to Cit, the Supreme Consciousness which is also known as the Brahman.  

Chāndogya Upaniṣad (VIII.14.1) says, “That which is described as space manifests names and forms. These names and forms are within Brahman.  Brahman is immortal.  It is the Self”.  Vāc Devi-s utilize every opportunity to mention Her as the Supreme Brahman.  The Brahman can be described either through negations or through affirmations.  Here the quality of the Brahman is described by negation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
 
 
 
 
 
 
 
 
 

No comments:

Post a Comment