శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 301-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 301-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 301-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 301-1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀

🌻 301-1. 'హ్రీంకారీ' 🌻


సృష్టి స్థితి లయములు తన అధికారములో వుంచునది శ్రీమాత అని అర్థము. 'అ'కారము సృష్టికిని, 'ర'కారము లయమునకును, 'ఈ'కారము సృష్టి వ్యాపనమునకును, బిందువు మూడింటిని తన అధీనము నందుంచుకొను స్థితికి నిశబ్ద సంకేతములు. 'ప్రీం' అన్ననూ 'హరి' అన్ననూ శబ్ద తరంగములు ఒకే రకముగ గోచరించును. అవ్యక్తము నుండి వ్యక్తములోనికి సమస్తమునూ గొనివచ్చుట, వ్యక్తమైన దానిని స్థితి యందుంచుట అను కార్యమును నిర్వర్తింపజేయు అతీతమగు శక్తి హ్రీంకారము.

హ్రీంకారము ఆకృతులను కలిగించును. వాటిని వృద్ధి చేయును. కాలానుసారము ఆకృతులకు తిరోధానము కలిగించును. ఆకృతులను వృద్ధి చేయునపుడు వాటికి తుష్టిని, పుష్టిని కూడా అమర్చును. అందమును చేకూర్చును. సువర్ణ కాంతిని ఏర్పరచి అత్యంత రమ్యముగ గోచరింప జేయును. హిరణ్యమను వర్ణము కూడ ఈ శబ్దము నుండియే పుట్టినది. స్థూల సృష్టికి తెర వెనుకగ హిరణ్య సృష్టి సూక్ష్మముగ నున్నది. అది దిగివచ్చిన దివ్యతత్వము. హిరణ్య ప్రాకారము వరకు ఈ స్పర్శ స్పష్టముగా నుండును. నిర్మలమైన మనస్సు, పరిశుద్ధ జీవనము గలవారికి గోచరించునని శాస్త్రములు తెలుపుచున్నవి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 301-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀

🌻 301-1. Hrīṁkārī ह्रींकारी (301-1) 🌻


She is in the form of māyā bīja hrīṁ. Hrīṁ is also called śākta praṇava or śaktī praṇava, which means that the worshippers of śaktī, call hrīṁ as praṇava bīja of Śaktī. This is also known as Bhuvaneśvarī bījā (Nāma 294 is Bhuvaneśvarī). Praṇava is the supreme ॐ.

The power of hrīṁ bīja is as powerful as ॐ. That is why in Pañcadaśī mantra every kūṭa or group ends with the bīja hrīṁ. Hrīṁ is the combination of ha (ह) + ra (र) + ī (ई) + ma (म) + bindu ('). Ha refers to manifestation, ra indicates involution (action of enfolding, the action of māyā), ī indicates perfection and the bindu, a dot on top of the bīja controls all the three.

Therefore hrīṁ means manifestation, involution and perfection. The appearance of the bodily form enfolded by perfection is the literal meaning of the bīja hrīṁ. This means that māyā or illusion is causing a veil around the Brahman and this veil can be removed only if one realizes the Supreme Consciousness of Śaktī.

Unless the kinetic energy (Śaktī) is fully realized, it is not possible to feel the pulsation of Śiva, the static energy. In fact this bīja can also be called as Śiva-Śaktī bīja as ha stands for Śiva bījā and kāmakalā - īṁ (ईं) stands for Śaktī bīja. The bīja ra (र) conjoins these two bīja-s to form a single Śiva-Śaktī bīja. The role of ra in any bīja is significant. The sound of ra is the chief of all the sounds. Whenever hrīṁ is chanted, it endues peace and auspiciousness.

In any bīja the bindu is important and most of the bīja-s have bindu. For example take the letter ha (ह). When a dot is placed at the top of this ha it becomes haṁ (हं). Without bindu an alphabet remains as an alphabet and becomes a bījā only if a ‘dot’ is placed above the alphabet.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


14 Aug 2021

No comments:

Post a Comment