నిర్మల ధ్యానాలు - ఓషో - 58


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 58 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఉదయానికి చీకటి రాత్రి గర్భం. వ్యక్తి చీకటి మార్గం గుండా సాగాలి. లేకుంటే వుదయం వుండదు. చీకట్లో వెళుతున్నపుడు నీకు గురువు అవసరం. నీ సొంత కాంతిని దర్శించాకా గురువు అవసరముండదు. 🍀


మనిషి తనలో చిన్ని జ్వాలతో జన్మించాడు. అది దైవస్పర్శ. కాని ఆ జ్వాల అనంతమైన చీకటి పొరల కింద వుంది. కాబట్టి వ్యక్తి తనలోకి వెళ్ళినపుడు అంధకార అరణ్యాల గుండా సాగాలి. అది చాలా మందిని భయపెడుతుంది. చాలా మంది లోపలికి వెళ్ళి ఆ చీకటి చూసి భయపడి వెనక్కి వచ్చేస్తారు. ఆ చీకటి మరణంలా భయపెడుతుంది.

మార్మికులు 'ఆత్మకు సంబంధించిన చీకటి రాత్రి' అని సరైన పేరిచ్చారు. కానీ వ్యక్తి చీకటి మార్గం గుండా సాగాలి. లేకుంటే వుదయం వుండదు. ఉదయానికి చీకటి రాత్రి గర్భం. చీకట్లో వెళుతున్నపుడు నీకు గురువు అవసరం. నీ సొంత కాంతిని దర్శించాకా గురువు అవసరముండదు. నువ్వు గురువు పట్ల కృతజ్ఞత ప్రకటించు. యింటి కొచ్చావు. ప్రయాణం పూర్తయ్యింది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


14 Aug 2021

No comments:

Post a Comment