15-AUGUST-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 240 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 439🌹 
3) 🌹 వివేక చూడామణి - 116 / Viveka Chudamani - 116🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -68🌹  
5) 🌹 Osho Daily Meditations - 57🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 116🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌸. మిత్రులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🌸*
*🐚. Happy Independence Day 🐚*
*ప్రసాద్ భరద్వాజ*

🙏. సద్గురు అరబిందొ జన్మదిన శుభాకాంక్షలు 🙏

🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹
ప్రసాద్ భరద్వాజ 

Join and Share ALL
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://pyramidbook.in/dailywisdom

Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
https://pyramidbook.in/vivekachudamani

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
https://pyramidbook.in/maharshiwisdom

Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

Join and Share
🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹
www.facebook.com/groups/dattachaitanyam/

Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -240 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 20
 
*🍀 19. సనాతనము - కాలమునకు ప్రకృతికి కూడ పుట్టుక స్థానమైనది సత్యము. అదే పరము. అది సనాతనము. అందుండియే ప్రకృతి, కాలము వ్యక్తమగును. అట్టి ప్రకృతినుండి సర్వప్రాణికోట్లు పుట్టుట, పెరుగుట, మరల ప్రకృతిలో లయమగుట కాలానుసారము సాగుచుండును. కాలానుసారమే ప్రకృతి కూడ సత్యమందు లయ మగుట జరుగును. కాలము గూడ సత్యమందు లయమై, మరల వ్యక్త మగుచుండును. కనుక అవ్యక్తమగు ప్రకృతికి కూడ అవ్యక్తమై యుండునది సత్యము గనుక, సనాతన మందురు. 🍀*

పరస్తస్మాత్తు భావో2_న్యో వ్యక్తో వ్యక్తా త్సనాతనః |
యస్ససర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి || 20

తాత్పర్యము : పరమగు సత్యము అవ్యక్తమగు ప్రకృతి కన్నను అన్యమై యున్నది. అది సనాతనము. అది వ్యక్తము కానిది. సమస్త ప్రాణికోట్లు నశించినను, నశింపక యుండునది.

వివరణము : పరమే సత్యము. అది సృష్టి యున్నను, లేకుండినను యుండును. దానియందే సమస్తము ఇమిడి యుండును. సృష్టి లయించునది పరమగు సత్యములోనికే. మూలప్రకృతి సహితము సత్యములోనికే ఇమిడిపోవును. లయమున సత్య మొక్కటియే యుండును. కాలమునకు ప్రకృతికి కూడ పుట్టుక స్థానమైనది సత్యము. అదే పరము. దానిని దర్శించుటకు ఇంకొక వస్తు వుండదు. కనుక దానిని గూర్చి వివరించుట అసాధ్యము. విశ్లేషించుట అవివేకము. చేతస్వరూపమగు ప్రకృతి కూడ అందిమిడిపోయి యుండుటచే ఉండుటయే యుండును గాని ఎరుక కూడ యుండదు. 

అందుండి ఎరుక ఏర్పడినపుడు కాలము, ప్రకృతి వ్యక్తమగును. అట్టి సత్యము నందిమిడి పోవుటయే గాని, దానిని తెలియుట యుండదు. అది సనాతనము. అందుండియే ప్రకృతి, కాలము వ్యక్తమగును. అట్టి ప్రకృతినుండి సర్వప్రాణికోట్లు పుట్టుట, పెరుగుట, మరల ప్రకృతిలో లయమగుట కాలానుసారము సాగుచుండును. కాలానుసారమే ప్రకృతి కూడ సత్యమందు లయ మగుట జరుగును. అపుడు శేషించునది కాల మొక్కటియే. మరల సృష్టి ప్రారంభము వరకు కాలము శయ్యగ, సత్యము వశించి యుండును. 

కాలము గూడ సత్యమందు లయమై, మరల వ్యక్త మగుచుండును. కనుక అవ్యక్తమగు ప్రకృతికి కూడ అవ్యక్తమై యుండునది సత్యము గనుక, సనాతన మందురు. ఈ సనాతన సత్యమాధారముగనే నవావరణ సృష్టి ఏర్పడును. వృద్ధి చెందును. మరల సత్యములోనికి తిరోధానము చెందును. అట్టి సత్యమునకు నాశము లేదు. అందుండి వ్యక్తమైన ప్రకృతికి, భూతములకు ఉండుట లేకుండుట యుండును. అట్టి సత్యమును తెలియుట, సమీపమునకు చేరుట, అటు పైన సారూప్యము చెందుట సంభవము. అట్టి పరమాత్మ సమస్తమునకు అన్యమని ఈ శ్లోకము ఉద్బోధించు చున్నది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 439🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 28

*🌻. శివుని సాక్షాత్కారము - 2 🌻*

శివుని భజించిన మానవుడు భయము లేనివాడై మృత్యువును జయించును. అందువలననే ముల్లోకములలో మృత్యుంజయుడు అను పేరు ప్రసిద్ధి గాంచినది (11). ఆయన అనుగ్రహముచేతనే విష్ణువు విష్ణుత్వమును, బ్రహ్మ బ్రహ్మత్వమును మరియు దేవతలు దేవత్వమును పొందియున్నారు (12).

శివుని దర్శనము కొరకు దేవరాజగు ఇంద్రుడు ముందుగా వెళ్లును. ఆత్మధ్యాన పరుడగు శివుని ద్వారమును భూతములు, గణములు మొదలగు వారు కాపలా కాయుచుందురు (13). వారు బెత్తములతో ఇంద్రుని కిరీటముపై మోదుచుందురు. మరియు ఇంద్రుడు త్రొక్కిసలాటలో నలిగిపోవుచుండును. ఆయన పక్షమును స్వీకరించి అనేక వచనములను చెప్ప బని లేదు. ఆయన తనంత తానుగా మహాప్రభువై ఉన్నాడు (14). 

మంగళ రూపుడగు ఆయనను సేవించినచో ఇహలోకములో లభించనది యేది? ఆ దేవునకు లోటు యేమి గలదు? ఆ సదాశివుడు నన్ను ఏల గోరును? (15) శంకరుని సేవించని మానవుడు ఏడు జన్మలలో దరిద్రుడగును. ఆయనను సేవించు మానవుడు తొలగిపోని సంపదలను పొందును (16).

అష్టసిద్ధులు ఎవనిని సంతోషపెట్టుటకై నిత్యము తలవంచుకొని ఎవని ఎదుట నాట్యము చేయునో, అట్టి ఈశ్వరుని వలన హితము కలుగకుండుట ఎట్లు పొసగును? (17) మంగళకరములగు వస్తువులు శంకరుని సేవను చేయకున్ననూ, ఆయనను స్మరించనంత మాత్రాన మంగళములు కలుగును (18). 

ఎవని పూజ చేసినచో ఆ ప్రభావముచే కోర్కెలన్నియూ సిద్ధించునో, అట్టి వికారరహితుడగు శివునకు ఏ కాలమునందైననూ వికారమెక్కడిది? (19) ఎవని నోట 'శివ' అను మంగళనామము నిరంతరముగా వెలువడునో, అట్టి వానిని దర్శించినంత మాత్రాన మానవులు పవిత్రులగుదురు (20).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 116 / Viveka Chudamani - 116🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 3 🍀*

386. అపరమిత వస్తు సముదాయము గడ్డితో సహా అన్ని బ్రహ్మములోంచి వ్యక్తమైనప్పటికి అవి నిజముగా లేనివే అగును. అందువలన ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, తాను శాశ్వతమైన బ్రహ్మమని అదే ఒకానొక సిద్దాంతము. 

387. పొరపాటున ఏ వస్తువైనా ఒక దానిలో ఉన్నదని భావించిన, వెంటనే దాని గూర్చి వివరణ ద్వారా గ్రహించాలి. ఆ వస్తువునకు మూలము బ్రహ్మమేనని, దానికి వేరు కాదని గ్రహించాలి. ఎపుడైతే తప్పు భావన తొలగిపోతుందో, అసలు సత్యమైన తాడు వ్యక్తమై పాము తొలగిపోతుంది. అదే విధముగా విశ్వము నిజానికి ఆత్మయే. 

388. ఆత్మయే బ్రహ్మము. ఆత్మయే విష్ణువు. ఆత్మయే ఇంద్రుడు. ఆత్మయే శివుడు. ఆత్మయే ఈ విశ్వమంతా దానికి మించినది ఏదీ లేదు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 116 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 26. Self is Unchangeable - 3 🌻*

386. The limiting adjuncts from Brahma down to a clump of grass are all wholly unreal. Therefore one should realise one’s own Infinite Self as the only Principle.

387. That in which something is imagined to exist through error, is, when rightly discriminated, that thing itself, and not distinct from it. When the error is gone, the reality about the snake falsely perceived becomes the rope. Similarly the universe is in reality the Atman.

388. The Self is Brahma, the Self is Vishnu, the Self is Indra, the Self is Shiva; the Self is all this universe. Nothing exists except the Self.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 68 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. రేపటికి ఏదైనా ఉండదేమో! అనే భావమే లోభం. 🌻*

పలుకుబడి ఉందని ఇతరులతో పనులు చేయించుకుంటే, చిక్కుల్లో పడతారు.   

తిడితే పడే వారి స్థితిలో నేనుందును గాక! అని‌ భగవంతుని ప్రార్థించు." పడ్డవాని వెనుక భగవంతుడు ఉండును.   

మాయ సత్యమైనదే కాని, అది కరిగిపోయిన తరువాత ఉన్న సత్యం వంటిది మాత్రం కాదు. మాయ తాత్కాలిక సత్యం. అది కరిగిన తరువాత ఉన్నది శాశ్వత సత్యం.  

మృత్యుభీతి లేనివాడే మృత్యువు లేనివాడు. ప్రపంచంలో అనేక అపచారములకు కారణం మృత్యుభీతి మాత్రమే.   

అక్కరలేని విషయాలలోనికి మనస్సు వెళ్లినచో ధర్మాచరణకు పనికిరావు...

✍️ *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 57 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 57. IN AN EGG SHELL 🍀*

*🕉 When you can come out of your conditioning, you are free, you are simply a human being. And that is real freedom! Then you don't carry a crust around you. The capsule has broken. 🕉*

When the bird is in the egg, it cannot fly. When we are “Indian” or “German” or “English” or “American” we are in egg shell. We cannot fly, cannot open our wings, cannot use our tremendous freedom that existence makes available. There are layers upon layers of conditioning. One is conditioned as a German, one is conditioned as a Christian, and so on. 

One is conditioned as a man and another is conditioned as a woman. I am not talking about the biological difference-that's okay, that has nothing to do with conditioning - but the man is conditioned as a man. You continuously remember that you are a man, that you are not a woman, that you have to behave like a man-that you are not to cry, that tears are not to be allowed, that that is just feminine, it is not expected of you. This is conditioning, this is a crust around you.  

A really free person is neither man nor woman-not that the biological difference disappears, but the psychological difference disappears. A free person is neither black nor white-not that the black becomes white and the white becomes black. The skin remains as it was before, but the psychological color is no longer there. When all these things drop, you are unburdened. You walk one foot above the earth; for you, gravitation doesn't function anymore. You can open your wings and fly. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 116 / Sri Lalita Sahasranamavali - Meaning - 116 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ |*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ‖ 116 ‖ 🍀*

🍀 572. పరాశక్తిః - 
అన్ని శక్తులకు అతీతంగా ఉండి, వాటన్నిటికీ నేపథ్యంలో వర్తించే శక్తి.

🍀 573. పరానిష్ఠా - 
సర్వాంతర్యామిని సర్వమునందు చూడగలుగు నిష్ఠను సూచించునది.

🍀 574. ప్రజ్ఞాన ఘనరూపిణీ - ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానం.

🍀 575. మాధ్వీపానాలసా - 
మధుసంబంధిత పానము వలన అలసత్వము చెందినది.

🍀 576. మత్తా - 
నిత్యము పరవశత్వములో ఉండునది.

🍀 577. మాతృకావర్ణరూపిణీ - 
అన్ని రంగులకు తల్లివంటి రంగు యొక్క రూపంలో ఉండునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 116 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 116. parā śaktiḥ parā niṣṭhā prajñānaghana-rūpiṇī |*
*mādhvīpānālasā mattā mātṛkā-varṇa-rūpiṇī || 116 || 🌻*

🌻 572 ) Para Shakthi -   
She who is the end strength

🌻 573 ) Para Nishta -  
 She who is at the end of concentration

🌻 574 ) Prgnana Gana roopini -   
She who is personification of all superior knowledge

🌻 575 ) Madhvi pana lasaa -   
She who is not interested in anything else due to drinking of toddy

🌻 576 ) Matha -   
She who appears to be fainted

🌻 577 ) Mathruka varna roopini -   
She who is the model of colour and shape

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment