మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 68


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 68 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. రేపటికి ఏదైనా ఉండదేమో! అనే భావమే లోభం. 🌻


పలుకుబడి ఉందని ఇతరులతో పనులు చేయించుకుంటే, చిక్కుల్లో పడతారు.

తిడితే పడే వారి స్థితిలో నేనుందును గాక! అని‌ భగవంతుని ప్రార్థించు." పడ్డవాని వెనుక భగవంతుడు ఉండును.

మాయ సత్యమైనదే కాని, అది కరిగిపోయిన తరువాత ఉన్న సత్యం వంటిది మాత్రం కాదు. మాయ తాత్కాలిక సత్యం. అది కరిగిన తరువాత ఉన్నది శాశ్వత సత్యం.

మృత్యుభీతి లేనివాడే మృత్యువు లేనివాడు. ప్రపంచంలో అనేక అపచారములకు కారణం మృత్యుభీతి మాత్రమే.

అక్కరలేని విషయాలలోనికి మనస్సు వెళ్లినచో ధర్మాచరణకు పనికిరావు...


✍️ మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹


15 Aug 2021

No comments:

Post a Comment