🌹. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 144 / Bhagavad-Gita - 144 - 3-25 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 541 / Vishnu Sahasranama Contemplation - 541 🌹
4) 🌹 DAILY WISDOM - 219🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 58 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 124🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 339 / Sri Lalitha Chaitanya Vijnanam - 339 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సంక్రాతి శుభాకాంక్షలు, శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 15, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ వేంకటేశ్వర ద్వాదశ మంజరికా స్తోత్రం - 8 🍀*
*శ్రీమత్పద్మాసనాగ్రస్థ చింతితార్థప్రదాయకమ్ |*
*లోకైకనాయకం శ్రీమద్వేంకటాద్రీశమాశ్రయే 12*
*వేంకటాద్రి హరేః స్తోత్రం ద్వాదశశ్లోక సంయుతమ్ |*
*యః పఠేత్సతతం భక్త్యా తస్యముక్తిః కరే స్థితా 13*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల త్రయోదశి 24:58:18
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: మృగశిర 23:22:47 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: బ్రహ్మ 14:33:12 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: కౌలవ 11:39:14 వరకు
సూర్యోదయం: 06:49:16
సూర్యాస్తమయం: 18:01:32
వైదిక సూర్యోదయం: 06:53:06
వైదిక సూర్యాస్తమయం: 17:57:43
చంద్రోదయం: 15:49:31
చంద్రాస్తమయం: 04:34:29
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృషభం
వర్జ్యం: 02:37:42 - 04:25:54
దుర్ముహూర్తం: 08:18:55 - 09:03:44
రాహు కాలం: 09:37:20 - 11:01:22
గుళిక కాలం: 06:49:16 - 08:13:19
యమ గండం: 13:49:26 - 15:13:28
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47
అమృత కాలం: 13:26:54 - 15:15:06
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 23:22:47 వరకు
తదుపరి ముద్గర యోగం - కలహం
పండుగలు : మకర సంక్రాంతి,
శని త్రయోదశి, ప్రదోష వ్రతం,
Pradosh Vrat, Shani Trayodashi
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹*
*🔥.ఈ సంక్రాంతి పండుగ మనందరి జీవితాలలో ప్రకాశంతో కూడిన వైభవములని నింపుగాక. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మన ఆధ్యాత్మిక ప్రగతికి ఉత్తమమైన సోపానంగా మారుగాక.🔥*
*ప్రసాద్ భరధ్వాజ, జ్యోతిర్మయి* 🙌
*🌹. Subhakankshalu on Sankranthi Festival to all. 🌹*
*🔥. Let This Sankranthi fill Brightness in our Lives and Bring all Glory. Let this Uttarayana Punya Kala support and help us in our Spiritual upliftment. 🔥*
*Prasad Bharadwaj, Jyothirmayi* 🙌
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత -144 / Bhagavad-Gita - 144 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 25 🌴*
*25. సక్తా: కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత |*
*కుర్యాద్ విద్వాంస్తథాసక్త శ్చికీర్షుర్లోక సంగ్రహమ్ ||*
🌷. తాత్పర్యం :
*పామరులు ఫలములను ఆసక్తిగలవారై తమ కర్మనొనరించునట్లు, విద్వాంసుడైన వాడు జనులను ధర్మమార్గమున వర్తింపజేయుటకై సంగరహితముగా కర్మ నొనరింపవలెను.*
🌷. భాష్యము :
కృష్ణభక్తిరసభావితుని, కృష్ణభక్తిభావన యందు లేనివానిని కోరికల ననుసరించు వేరు పరుపవచ్చును. కృష్ణభక్తిభావన యందున్నవాడు కృష్ణభక్తిపురోగతికి దోహదము కానటువంటి దేనిని ఒనరింపడు. అట్టివాడు భౌతికకర్మలందు అమితానురక్తుడైన అజ్ఞాని మాదిరిగా కర్మనొనరించినను అతని ఆచరణము శ్రీకృష్ణుని ప్రీత్యర్థము యుండును. కాని అజ్ఞాని కర్మలు ఇంద్రియప్రీత్యర్థమై యుండును. కావున ఏ విధముగా కర్మనొనరింపవలెనో మరియు ఎట్లు కర్మఫలములను కృష్ణభక్తి ప్రయోజనార్థమై వినియోగింపవలెనో కృష్ణభక్తుడు జనులకు చూపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 144 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga - 25 🌴*
*25. saktāḥ karmaṇy avidvāṁso yathā kurvanti bhārata*
*kuryād vidvāṁs tathāsaktaś cikīrṣur loka-saṅgraham*
🌷Translation :
*As the ignorant perform their duties with attachment to results, the learned may similarly act, but without attachment, for the sake of leading people on the right path.*
🌷 Purport :
A person in Kṛṣṇa consciousness and a person not in Kṛṣṇa consciousness are differentiated by different desires. A Kṛṣṇa conscious person does not do anything which is not conducive to development of Kṛṣṇa consciousness. He may even act exactly like the ignorant person, who is too much attached to material activities, but one is engaged in such activities for the satisfaction of his sense gratification, whereas the other is engaged for the satisfaction of Kṛṣṇa. Therefore, the Kṛṣṇa conscious person is required to show the people how to act and how to engage the results of action for the purpose of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 541 / Vishnu Sahasranama Contemplation - 541🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 541. కనకాఙ్గదీ, कनकाङ्गदी, Kanakāṅgadī 🌻*
*ఓం కనకాఙ్గదినే నమః | ॐ कनकाङ्गदिने नमः | OM Kanakāṅgadine namaḥ*
*కనకాఙ్గదినేః कनकाङ्गदिने Kanakāṅgadine*
*కనకమయాన్యఙ్గదాన్యస్యేతి కనకాఙ్గదీ*
*బంగారముతో చేయబడిన భుజాభరణములు ఈతనికి కలవు.*
:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
సీ. కుండల మణి దీప్తి గండస్థలంబులఁ బూర్ణేందురాగంబుఁ బొందుబరుప
దివ్యకిరీట ప్రదీప్తు లంబర రమా సతికిఁ గౌస్తుభవస్త్రంబు గాఁగ
వక్షస్థలంబుపై వనమాల మాలికల్ శ్రీవత్స కౌస్తుభ శ్రీల నొఱయ
నీలాద్రి బెనఁగొని నిలిచిన విద్యుల్లతలభాతిఁ గనకాంగదములు మెఱయ
ఆ. నఖిలలోక మోహనాకార యుక్తుఁడై, నారదాది మునులు చేరి పొగడఁ
గదిసి మునులు పొగడ గంధర్వ కిన్నర, సిద్ధ గానరవము సెవుల నలర. (219)
ఆయన కర్ణకుండలాల కాంతులు ప్రసరించి చెక్కిళ్ళు చంద్రబింబాలలాగా తళతళలాడుతున్నాయి. తలమీద ధరించిన కిరీటం తన దివ్య దీప్తులతో గగనలక్ష్మికి కుంకుమరంగు చీరను అలంకరిస్తున్నది. ఆయన వక్షస్థలం మీద విరాజిల్లే వనమాలిక శోభలు శ్రీవత్సంతోనూ కౌస్తుభంతోనూ పోటీపడుతున్నాయి. బాహువులకు చుట్టుకొని ఉన్న భుజకీర్తులు నీలగిరికి చుట్టుకొన్న మెరుపు తీగలవలె మెరుస్తున్నాయి. ఆ స్వామి సౌందర్యం సమస్త లోకాలనూ మోహంలో ముంచి తేలుస్తున్నది. నారదాది మహర్షులు చుట్టూ చేరి సేవిస్తున్నారు. దేవతా బృందాలు కైవారాలు సలుపుతున్నారు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధులూ వీనులవిందుగా గానం చేస్తున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 541🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻541. Kanakāṅgadī 🌻*
*OM Kanakāṅgadine namaḥ*
कनकमयान्यङ्गदान्यस्येति कनकाङ्गदी /
*Kanakamayānyaṅgadānyasyeti kanakāṅgadī*
*One who has armlets made of gold.*
:: श्रीमद्भागवते षष्ठस्कन्धे चतुर्थोऽध्यायः ::
महाकिरीटकटकः स्फुरन्मकरकुण्डलः ।
काञ्चङ्गुलीयवलय नूपुराङ्गदभूषितः ॥ ३७ ॥
Śrīmad Bhāgavata - Canto 6, Chapter 4
Mahākirīṭakaṭakaḥ sphuranmakarakuṇḍalaḥ,
Kāñcaṅgulīyavalaya nūpurāṅgadabhūṣitaḥ. 37.
The Lord on His head had a gorgeous round helmet, and His ears were decorated with earrings resembling sharks. All these ornaments were uncommonly beautiful. The Lord wore a golden belt on His waist, bracelets on His arms, rings on His fingers, and ankle bells on His feet.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥
మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥
Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 219 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 6. Everywhere there are Gods 🌻*
*The recognition of a spiritual background behind the transitory phenomena of life is actually the object of worship. This is known as the divinities, or gods, who are adumbrated in the Veda Samhitas. Everywhere there are gods. We can worship a tree, we can worship a stone, we can worship a river, we can worship a mountain, we can worship the sun, the moon, the stars. Anything is okay as an object of worship because behind this emblem of an outward form of things in this world, there is a divinity masquerading as these forms. This is the highlighting principle of the Veda Samhitas.*
*If we read the Vedas, we will find that every mantra, every verse, is a prayer to some divinity above, designated by various names: Indra, Mitra, Varuna, Agni, etc. We may give them any other name, according to our own language, style or cultural background. The point is not what name we give, but that there is something behind visible phenomena. Our heart throbs in a state of satisfaction of the fact that there is something above us. Religion, spirituality or philosophy, in the true sense of the term, is the recognition of something above oneself and a simultaneous recognition of the finitude of one's personality.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 58 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 45. శుభము - శాంతి 🌻*
*శాంతి కావలెనన్నచో సహకరించుట నేర్చుకొనవలెను. సహకరించుట చేతకానివారికి శాంతి లభింపదు. ఇతరులకు శుభము జరిగినచో తనకు జరిగినట్లుగ ఆనందించవలెను. ఈర్ష్యపడుట, దుఃఖపడుట నీయందశాంతిని పెంచును. ఇతరులకు అశుభము కలిగి నప్పుడు సహవేదన ననుభవించి, తోడ్పాటు గావించి శక్తికొలది ఓదార్చుము. నీయందు శాంతి పెరుగును. రవ్వంతైనను ఇతరులకు కష్టనష్టములు కోరుకొనకుము. శుభమునే కోరుము. పై తెలిపిన విషయములు ప్రాథమికములే. చిన్నతనము నుండి ఎన్నియో సార్లు విని యుందురు.*
*కాని పై విధముగ ఎన్నిసార్లు ఆచరించితివో చూచుకొనుము. చిన్న చిన్న నీతి పాఠములను చక్కగ నేర్చువాడు బుద్ధిమంతుడు. ఇవి నేర్వని పెద్దవారు చిన్నవారే. సంఘ జీవనమున ప్రస్తుతము ఈర్ష్య, అసూయ, పోటీపడు తత్త్వము ఎక్కువగ నున్నది. అశాంతికి అవకాశమెక్కువ. కాని పై తెలిపిన ప్రాథమిక సూత్రములను మరువక అనుసరించు వారికి శాంతికి కొదవుండదు. మహాత్ములందరూ యిట్లాచరించి చూపినవారే.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 123 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నువ్వు సృజనాత్మకమయిన పని ఏదయినా చేస్తే నీలో గొప్ప సంతృప్తి మొదలవుతుంది. నువ్వు దేవుడి పనిలో భాగస్వామ్యం వహించావు. ఆయన సృష్టికర్త. నువ్వు నీ మార్గంలో సృష్టికర్త. దాన్ని మించిన సంపూర్ణత లేదు. అదే అంతిమ శిఖరం.🍀*
*ఎప్పుడయితే నువ్వు సృజనాత్మకమయిన పని ఏదయినా చేస్తే నీలో గొప్ప సంతృప్తి మొదలవుతుంది. నువ్వొక చిత్రం గీయడం ముగిస్తే నీపై ఒక ప్రశాంతం దిగుతుంది. నువ్వు నిండుగా, అర్థవంతంగా, విలువైంది అందుకున్నట్లు అనుభూతి చెందుతావు. నువ్వొక పని చేశావు. నువ్వు దేవుడి పనిలో భాగస్వామ్యం వహించావు. ఆయన సృష్టికర్త. నువ్వు నీ మార్గంలో సృష్టికర్త.*
*నీ పని చిన్నదే కావచ్చు. దేవుడితో భాగం పంచుకున్నావు. దేవుడితో కలిసి పని చేసావు. కొన్ని అడుగులయినా దేవుడితో కలిసి నడిచావు. సృజనకు సంబంధించిన అంతిమ చర్య నీ చైతన్యంలో వికసించింది. అది మొదలు క్షణం కూడా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అప్పుడు సమస్త తీర్థయాత్ర నీలో జరిగింది. దేవుడితో జరిగింది. సహజంగా అది సంపూర్ణమయింది. దాన్ని మించిన సంపూర్ణత లేదు. అదే అంతిమ శిఖరం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 339 / Sri Lalitha Chaitanya Vijnanam - 339 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*
*🌻 339. 'విష్ణుమాయా' 🌻*
*మాయ శ్రీమాత ప్రధాన ఆయుధము. ఈ ఆయుధమును ఆమె విష్ణువు నందు నిక్షిప్తము చేసి యున్నది. మాయవలననే జీవులు తాము వేరుగా నున్నామని భావింతురు. ఏకము అనేకమైనపుడే కదా సృష్టి! ప్రతి ఒక్కరూ తాము ఇతరుల కన్న వేరన్న భావన మాయావరణమే. త్రిమూర్తులు సహితము మాయకు లోబడియే ఉన్నారు. సృష్టి సృష్టించవలెనని బ్రహ్మకు అనిపించుట, రక్షించవలెనని విష్ణువున కనిపించుట, దుష్టులను సంహరించి శిష్టులను కాపాడవలెనని రుద్రుల కనిపించుట, మొత్తము సృష్టిని పాలించవలెనని ఇంద్రుని కనిపించుట, ఇవి అన్నియూ శ్రీమాత కల్పనే.*
*ప్రథమ మాయావరణము అహంకారము. అహంకారము వలన తానున్నానను భావన కలుగును. నిజమునకు అందరిగను వున్నది ఒకటే తత్త్వము. అన్ని పాత్రల యందు ఒకే చోటు వుండగా వేరు వేరు పాత్రలుగ గోచరించును. ఇట్లు గోచరింప చేయుట శ్రీమాత మాయాశక్తి.*
*ఆమె మాయకు త్రిమూర్తులు కూడ ముహూర్తకాలము భ్రమపడిన సందర్భము లున్నవి. ఇంక ఇతరుల గురించి చెప్పెడిదేమి? ఆమె సంకల్పించిననే గాని మాయ హరింపబడదు. ఆమె మాయ ప్రసరించినచో జ్ఞానులు కూడ హింసింపబడుదురు. సాక్షాత్ భగవత్ స్వరూపులైన గౌతమ మహర్షి కూడ ఆమె మాయకు లోబడిన సందర్భము లున్నవి.*
*“నా మాయ నెవ్వరూ దాటలేరు" అని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు 7వ అధ్యాయమున తెలిపినాడు. నీ మాయను దాటలేము అని మ్రొక్కుట ఒక్కటియే ఉపాయము. తెలిసి తెలిసి మాయలో పడిన వారెందరో కలరు. అనన్య చింతనము, నిత్య ఉపాసనము చేయుచు శ్రీమాతతో అభియుక్తులై ఉన్నవారు కూడ శ్రీమాత సంకల్పించినచో మాయలో పడుదురు. నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతము శ్రీమాత మాయాశక్తికి సంపూర్ణ నిదర్శనము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 339 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*
*🌻 339. Viṣṇu-māyā विष्णु-माया (339) 🌻*
*She is the māyā of Viṣṇu. Viṣṇu is all-pervading maintainer of the universe. Brahman’s sustaining act is known as Viṣṇu. Nārāyaṇa Sūktam says ‘Viṣṇu exists both internally and externally (of our physical body)’. Śaktī is in the form of māyā or illusion that forms a sort of veil around the Brahman. Unless the veil is removed, one cannot realize the Brahman and this is the reason why so much importance is attached to Śaktī worship. Śiva has given His independent autonomy (svātantraya śaktī) to Śaktī to administer the universe.*
*Kṛṣṇa says (Bhagavad Gīta VII.14) “It is difficult to transcend my māyā consisting of three qualities (three guṇa-s). Only those who surrender unto me can become free from the clutches of māyā”. This verse of Gita should be considered as very significant. In a single verse Kṛṣṇa explains the concept of māyā and way to overcome it. Māyā is the combination of three guṇa-s viz. satvic, rajas and tamas. Manipulating these gunas cause manifestation. If one is able to transcend these three guṇa-s, the first step of removing the veil of māyā is achieved. The next step is to surrender unto Him. Kṛṣṇa says “māmeva ye prapadyante māyāmetāṁ tarantidya मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्तिद्य.” This means ‘those who surrender unto me certainly overcome this illusion’.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://www.facebook.com/103080154909766/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment