నిర్మల ధ్యానాలు - ఓషో - 123
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 123 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నువ్వు సృజనాత్మకమయిన పని ఏదయినా చేస్తే నీలో గొప్ప సంతృప్తి మొదలవుతుంది. నువ్వు దేవుడి పనిలో భాగస్వామ్యం వహించావు. ఆయన సృష్టికర్త. నువ్వు నీ మార్గంలో సృష్టికర్త. దాన్ని మించిన సంపూర్ణత లేదు. అదే అంతిమ శిఖరం.🍀
ఎప్పుడయితే నువ్వు సృజనాత్మకమయిన పని ఏదయినా చేస్తే నీలో గొప్ప సంతృప్తి మొదలవుతుంది. నువ్వొక చిత్రం గీయడం ముగిస్తే నీపై ఒక ప్రశాంతం దిగుతుంది. నువ్వు నిండుగా, అర్థవంతంగా, విలువైంది అందుకున్నట్లు అనుభూతి చెందుతావు. నువ్వొక పని చేశావు. నువ్వు దేవుడి పనిలో భాగస్వామ్యం వహించావు. ఆయన సృష్టికర్త. నువ్వు నీ మార్గంలో సృష్టికర్త.
నీ పని చిన్నదే కావచ్చు. దేవుడితో భాగం పంచుకున్నావు. దేవుడితో కలిసి పని చేసావు. కొన్ని అడుగులయినా దేవుడితో కలిసి నడిచావు. సృజనకు సంబంధించిన అంతిమ చర్య నీ చైతన్యంలో వికసించింది. అది మొదలు క్షణం కూడా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అప్పుడు సమస్త తీర్థయాత్ర నీలో జరిగింది. దేవుడితో జరిగింది. సహజంగా అది సంపూర్ణమయింది. దాన్ని మించిన సంపూర్ణత లేదు. అదే అంతిమ శిఖరం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
15 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment