శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 339 / Sri Lalitha Chaitanya Vijnanam - 339


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 339 / Sri Lalitha Chaitanya Vijnanam - 339 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀

🌻 339. 'విష్ణుమాయా' 🌻

మాయ శ్రీమాత ప్రధాన ఆయుధము. ఈ ఆయుధమును ఆమె విష్ణువు నందు నిక్షిప్తము చేసి యున్నది. మాయవలననే జీవులు తాము వేరుగా నున్నామని భావింతురు. ఏకము అనేకమైనపుడే కదా సృష్టి! ప్రతి ఒక్కరూ తాము ఇతరుల కన్న వేరన్న భావన మాయావరణమే. త్రిమూర్తులు సహితము మాయకు లోబడియే ఉన్నారు. సృష్టి సృష్టించవలెనని బ్రహ్మకు అనిపించుట, రక్షించవలెనని విష్ణువున కనిపించుట, దుష్టులను సంహరించి శిష్టులను కాపాడవలెనని రుద్రుల కనిపించుట, మొత్తము సృష్టిని పాలించవలెనని ఇంద్రుని కనిపించుట, ఇవి అన్నియూ శ్రీమాత కల్పనే.

ప్రథమ మాయావరణము అహంకారము. అహంకారము వలన తానున్నానను భావన కలుగును. నిజమునకు అందరిగను వున్నది ఒకటే తత్త్వము. అన్ని పాత్రల యందు ఒకే చోటు వుండగా వేరు వేరు పాత్రలుగ గోచరించును. ఇట్లు గోచరింప చేయుట శ్రీమాత మాయాశక్తి.

ఆమె మాయకు త్రిమూర్తులు కూడ ముహూర్తకాలము భ్రమపడిన సందర్భము లున్నవి. ఇంక ఇతరుల గురించి చెప్పెడిదేమి? ఆమె సంకల్పించిననే గాని మాయ హరింపబడదు. ఆమె మాయ ప్రసరించినచో జ్ఞానులు కూడ హింసింపబడుదురు. సాక్షాత్ భగవత్ స్వరూపులైన గౌతమ మహర్షి కూడ ఆమె మాయకు లోబడిన సందర్భము లున్నవి.

“నా మాయ నెవ్వరూ దాటలేరు" అని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు 7వ అధ్యాయమున తెలిపినాడు. నీ మాయను దాటలేము అని మ్రొక్కుట ఒక్కటియే ఉపాయము. తెలిసి తెలిసి మాయలో పడిన వారెందరో కలరు. అనన్య చింతనము, నిత్య ఉపాసనము చేయుచు శ్రీమాతతో అభియుక్తులై ఉన్నవారు కూడ శ్రీమాత సంకల్పించినచో మాయలో పడుదురు. నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతము శ్రీమాత మాయాశక్తికి సంపూర్ణ నిదర్శనము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 339 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini
Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻

🌻 339. Viṣṇu-māyā विष्णु-माया (339) 🌻


She is the māyā of Viṣṇu. Viṣṇu is all-pervading maintainer of the universe. Brahman’s sustaining act is known as Viṣṇu. Nārāyaṇa Sūktam says ‘Viṣṇu exists both internally and externally (of our physical body)’. Śaktī is in the form of māyā or illusion that forms a sort of veil around the Brahman. Unless the veil is removed, one cannot realize the Brahman and this is the reason why so much importance is attached to Śaktī worship. Śiva has given His independent autonomy (svātantraya śaktī) to Śaktī to administer the universe.

Kṛṣṇa says (Bhagavad Gīta VII.14) “It is difficult to transcend my māyā consisting of three qualities (three guṇa-s). Only those who surrender unto me can become free from the clutches of māyā”. This verse of Gita should be considered as very significant. In a single verse Kṛṣṇa explains the concept of māyā and way to overcome it. Māyā is the combination of three guṇa-s viz. satvic, rajas and tamas. Manipulating these gunas cause manifestation. If one is able to transcend these three guṇa-s, the first step of removing the veil of māyā is achieved. The next step is to surrender unto Him. Kṛṣṇa says “māmeva ye prapadyante māyāmetāṁ tarantidya मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्तिद्य.” This means ‘those who surrender unto me certainly overcome this illusion’.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Jan 2022

No comments:

Post a Comment