మైత్రేయ మహర్షి బోధనలు - 58
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 58 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 45. శుభము - శాంతి 🌻
శాంతి కావలెనన్నచో సహకరించుట నేర్చుకొనవలెను. సహకరించుట చేతకానివారికి శాంతి లభింపదు. ఇతరులకు శుభము జరిగినచో తనకు జరిగినట్లుగ ఆనందించవలెను. ఈర్ష్యపడుట, దుఃఖపడుట నీయందశాంతిని పెంచును. ఇతరులకు అశుభము కలిగి నప్పుడు సహవేదన ననుభవించి, తోడ్పాటు గావించి శక్తికొలది ఓదార్చుము. నీయందు శాంతి పెరుగును. రవ్వంతైనను ఇతరులకు కష్టనష్టములు కోరుకొనకుము. శుభమునే కోరుము. పై తెలిపిన విషయములు ప్రాథమికములే. చిన్నతనము నుండి ఎన్నియో సార్లు విని యుందురు.
కాని పై విధముగ ఎన్నిసార్లు ఆచరించితివో చూచుకొనుము. చిన్న చిన్న నీతి పాఠములను చక్కగ నేర్చువాడు బుద్ధిమంతుడు. ఇవి నేర్వని పెద్దవారు చిన్నవారే. సంఘ జీవనమున ప్రస్తుతము ఈర్ష్య, అసూయ, పోటీపడు తత్త్వము ఎక్కువగ నున్నది. అశాంతికి అవకాశమెక్కువ. కాని పై తెలిపిన ప్రాథమిక సూత్రములను మరువక అనుసరించు వారికి శాంతికి కొదవుండదు. మహాత్ములందరూ యిట్లాచరించి చూపినవారే.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
15 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment